రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం “ఎక్స్”లో ఇలా పోస్ట్ చేసింది..
“రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో తమ సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 నష్టపరిహారాన్ని అందిస్తాం’’
Pained by the loss of lives due to a mishap in Jaipur, Rajasthan. My thoughts are with those who have lost their near and dear ones. I pray that the injured recover soon.
— PMO India (@PMOIndia) November 3, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would…


