బీహార్‌లోని మోతిహారిలో ఇటుకబట్టీ పేలుడు సంఘటన వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మోతిహారిలోని ఇటుకబట్టీ పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వబడుతుంది:PM @narendramodi” అని పేర్కొంది.
Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 24, 2022


