ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ సునీల్ జైన్ మృతి పట్ల, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ,  “ప్రియమైన సునీల్ జైన్, మీరు చాలా త్వరగా మమ్మల్ని విడిచి వెళ్ళడం బాధ కలిగించింది.  విభిన్న అంశాలపై మీరు వ్రాసే ప్రత్యేక శీర్షికలు చదివే అవకాశాన్నీ, మీ స్పష్టమైన, తెలివైన అభిప్రాయాలను వినే అవకాశాన్నీ నేను కోల్పోతాను. మీరు  ఉత్తేజకరమైన పని శ్రేణిని విడిచి వెళ్ళారు.  మీ విచారకరమైన మరణం, జర్నలిజానికి తీరని లోటు.  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.” అని పేర్కొన్నారు.