తర్వాతి తరం సంస్కరణలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. జీవన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే, సమ్మిళిత సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన, సమగ్రమైన సంస్కరణలను అందించడమే ఈ సమావేశ లక్ష్యం.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘తర్వాతి తరం సంస్కరణలను సిద్ధం చేసే ప్రణాళికను చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించారు. అన్ని రంగాల్లోనూ జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యాన్ని, సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన సంస్కరణలకు మేం కట్టుబడి ఉన్నాం.’’
Chaired a meeting to discuss the roadmap for Next-Generation Reforms. We are committed to speedy reforms across all sectors, which will boost Ease of Living, Ease of Doing Business and prosperity. pic.twitter.com/XnJQ5vg3eK
— Narendra Modi (@narendramodi) August 18, 2025


