షేర్ చేయండి
 
Comments

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.

    సమావేశంలో 8 ప్రాజెక్టులు, ఒక పథకానికి సంబంధించిన 9 చర్చనీయాంశాలున్నాయి. ఈ ఎనిమిది ప్రాజెక్టులలో మూడు రైల్వే మంత్రిత్వశాఖకు చెందినవి కాగా, రోడ్డు రవాణా-రహదారులు, విద్యుత్‌ మంత్రిత్వశాఖలకు చెందినవి రెండేసి, పెట్రోలియం-సహజవాయువుల శాఖకు చెందినది ఒకటి వంతున ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు.. బీహార్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ పరిధిలోని ఈ ఎనిమిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం దాదాపు రూ.20,000 కోట్లు. ఖర్చులు పెరిగే అవకాశం లేకుండా సకాలంలో వీటన్నిటినీ పూర్తిచేయాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   ఈ సమీక్షలో భాగంగా ‘పోషణ్‌ అభియాన్‌’పైన కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యమం తరహాలో అమలు చేయటంపై ప్రభుత్వాలు పూర్తి శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం కింద బాలల ఆరోగ్యంపై, పౌష్టికతపై స్వయం సహాయ బృందాలుసహా ఇతర స్థానిక సంస్థల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన పెంచడానికి కృషి చేయాలని కోరారు. పోష్టికాహార కార్యక్రమం ప్రజల్లోకి చేరడంతోపాటు ఆచరణలోకి రావడంలో ఈ కృషి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

   ఇప్పటిదాకా నిర్వహించిన 38 ‘ప్రగతి’ సమావేశాల్లో రూ.14.64 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులపై సమీక్ష పూర్తయింది.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Budget 2023: Perfect balance between short and long term

Media Coverage

Budget 2023: Perfect balance between short and long term
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2023
February 02, 2023
షేర్ చేయండి
 
Comments

Citizens Celebrate India's Dynamic Growth With PM Modi's Visionary Leadership