మహోన్నత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఈ స్వాతంత్ర్య సమరయోధుడిని స్మరిస్తూ.. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడానికే ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీర్ సావర్కర్ వ్యక్తిత్వం, ఆయన కృషి దేశ సేవలో ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
మహోన్నత విప్లవకారుడు వీర సావర్కర్ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, కృషి ప్రతి తరానికి దేశ సేవలో స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
महान क्रांतिकारी वीर सावरकर जी को उनकी पुण्यतिथि पर सादर नमन। देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनका व्यक्तित्व और कृतित्व हर पीढ़ी को राष्ट्रसेवा के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) February 26, 2026


