వర్షపు నీటి సంరక్షణపై వీధి నాటకం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా నెహ్రూ యువక కేంద్ర స్వచ్ఛంద కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“యువతరం ఇటువంటి ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన వ్యాప్తికి ఇటువంటి ప్రక్రియలు ఎంతగానో దోహదం చేస్తాయి. వర్షపు నీటి సంరక్షణపై ఈ సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో దేశవాసులంతా తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Such efforts are laudatory and they go a long way in spreading awareness on various issues. I hope more people across India undertake such efforts to further the message of water conservation. https://t.co/FVXqoth18p
— Narendra Modi (@narendramodi) June 17, 2023


