దేశం లో ప్రస్తుతం మళ్లీ తలెత్తిన కోవిడ్-19 మహమ్మారి ని దృష్టి లో పెట్టుకొని చాలినన్ని మానవ వనరుల అవసరం పెరుగుతూ ఉన్న స్థితి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు సమీక్షించారు. కోవిడ్ కు సంబంధించిన విధి నిర్వహణ లో వైద్యచికిత్స సిబ్బంది లభ్యత ను చెప్పుకోదగిన స్థాయి లో పెంచే అనేక ముఖ్య నిర్ణయాల ను ఈ సందర్భం లో తీసుకోవడం జరిగింది.
ఎన్ఇఇటి-పిజి ని కనీసం 4 నెలల పాటు వాయిదా వేయడం కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోవడమైంది. మరి ఈ పరీక్ష ను 2021వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీ కంటే ముందు నిర్వహించబోవడం లేదు. ఈ పరీక్ష ను ప్రకటించిన తరువాత దానిని నిర్వహించే కన్నా ముందు విద్యార్థుల కు కనీసం ఒక నెల వ్యవధి ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అర్హత కలిగిన వైద్యులు పెద్ద సంఖ్య లో కోవిడ్ విధుల నిర్వహణ కు అందుబాటు లోకి రావడానికి వెసులుబాటు ను కల్పించగలదు.
మెడికల్ ఇంటర్న్ స్ ను ఇంటర్న్‌శిప్ రోటేశన్ లో భాగం గా వారి ఫేకల్టీ పర్యవేక్షణ లో కోవిడ్ నిర్వహణ సంబంధిత విధుల లో నియోగించడానికి అనుమతించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఫేకల్టీ ద్వారా తగినంత నేపథ్య దృష్టి ప్రసారం, పర్యవేక్షణ ల అనంతరం ఎమ్ బిబిఎస్ చివరి సంవత్సరం విద్యార్థుల ను కోవిడ్ స్వల్పం గా సోకినటువంటి కేసు ల విషయం లో పర్యవేక్షణ కు, టెలి-కన్ సల్టేశన్ వంటి సేవల ను అందజేయడానికి వినియోగించుకోవచ్చును. ఇది ప్రస్తుతం కోవిడ్ సంబంధిత కర్తవ్య నిర్వహణ లో తలమునకలు గా ఉన్న వైద్యుల పైన పని భారాన్ని తగ్గించడమే కాకుండా రోగుల కు ఇవ్వవలసిన చికిత్స తాలూకు క్రమాన్ని నిర్ణయించే దిశ లో జరుగుతున్న ప్రయత్నాల ను అభివృద్ధిపర్చనూగలదు.
పిజి విద్యార్థుల తాలూకు తాజా బ్యాచ్ లు చేరేటంత వరకు పిజి ఫైనల్ ఇయర్ విద్యార్థుల (స్థూల మరియు సూపర్ -స్పెశాలిటీస్ విభాగాల కు చెందిన వారి) సేవల ను రెసిడెంట్స్ హోదా లో వినియోగించుకొంటూ ఉండవచ్చును.
బి.ఎస్‌సి./ జిఎన్ఎమ్ అర్హత కలిగిన నర్సుల ను సీనియర్ డాక్టర్ లు మరియు నర్సు ల పర్యవేక్షణ లో పూర్తి కాలపు కోవిడ్ నర్సింగ్ విధుల లో వినియోగించుకోవచ్చును.
కోవిడ్ నిర్వహణ లో సేవల ను అందిస్తున్న వ్యక్తుల కు వారు కోవిడ్ డ్యూటీ లో కనీసం 100 రోజుల ను పూర్తి చేసిన తరువాత భవిష్యత్తు లో జరిపే ప్రభుత్వ రెగ్యులర్ నియామకాల లో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.
కోవిడ్ సంబంధిత కార్యాల లో నిమగ్నం కాదలుచుకున్న వైద్య విద్యార్థుల కు/వైద్య వృత్తి నిపుణుల కు టీకా మందు ను ఇప్పించడం జరుగుతుంది. ఇందువల్ల కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో పాల్గొంటున్న ఆరోగ్య రంగ శ్రమికుల కు ఉద్దేశించిన ప్రభుత్వ బీమా పథకం తాలూకు రక్షణ వృత్తి నిపుణులు అందరికీ లభించినట్లు అవుతుంది.
కోవిడ్ విధుల లో కనీసం 100 రోజులు పాలుపంచుకోవడానికి సిద్ధపడి సంతకాలు పెట్టి ముందుకు వచ్చే, ఆ కార్యభారాన్ని విజయవంతం గా ముగించే వృత్తినిపుణులు అందరికీ భారత ప్రభుత్వం తరఫున ప్రైం మినిస్టర్స్ డిస్ టింగ్ విశ్ డ్ కోవిడ్ నేశనల్ సర్వీస్ సమ్మాన్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది.
డాక్టర్లు, నర్సులు, మరియు ఈ రంగానికి చెందినటువంటి ఇతరత్రా వృత్తి నిపుణులు కోవిడ్ నిర్వహణ కు ముఖ్యాధారం గా ఉన్నారు; అంతేకాదు, వారు ముందు వరుస లో నిలబడి సేవల ను అందిస్తున్న సిబ్బంది గా కూడా పేరు ను తెచ్చుకొన్నారు. రోగుల అవసరాల ను చాలా చక్క గా తీర్చడానికి గాను వీరు తగినంత సంఖ్య లో అందుబాటు లో ఉండడమనేది ఎంతో ముఖ్యం. వైద్య సముదాయం అత్యంత సమర్పణ భావం తో చేస్తున్న ప్రశంసా యోగ్యమైనటువంటి పని ని సముచిత రీతి లో గుర్తించడం జరిగింది.
డాక్టర్ లు/ నర్సు ల సేవల ను కోవిడ్ విధుల లో వినియోగించుకోవడానికి వీలు గా కేంద్ర ప్రభుత్వం 2020 వ సంవత్సరం జూన్ 16న మార్గదర్శక సూత్రాల ను జారీ చేసింది. కోవిడ్ నిర్వహణ కు అవసరమైన సదుపాయాల ను, మానవ వనరుల ను పెంచడానికి 15,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ప్రత్యేకమైనటువంటి సార్వజనిక ఆరోగ్య అత్యవసర ఆలంబన ను కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా నేశనల్ హెల్థ్ మిశన్ లో భాగం గా సిబ్బంది ని రంగం లోకి దించడం తో, అదనం గా 2206 మంది స్పెశలిస్టుల ను, 4685 మంది వైద్య అధికారుల ను, 25593 మంది స్టాఫ్ నర్సుల ను భర్తీ చేసుకోవడమైంది.
కీలక నిర్ణయాల తాలూకు పూర్తి వివరాలు :
ఎ. సడలింపు/సౌకర్య కల్పన/విస్తరణ:
ఎన్ఇఇటి- పిజి ని కనీసం 4 నెలల పాటు వాయిదా వేయడం:
కోవిడ్-19 మరో సారి విజృంభించిన దరిమిలా ఏర్పడిన స్థితి ని పరిశీలన లోకి తీసుకొని ఎన్ఇఇటి (పిజి) -2021 ని వాయిదా వేయడం జరిగింది. ఈ పరీక్ష ను 2021వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీ కన్నా ముందు నిర్వహించబోవడం లేదు. పరీక్ష ను గురించి ప్రకటన చేసిన తరువాత దానిని నిర్వహించే కన్నా ముందు కనీసం ఒక నెల వ్యవధి ని ఇవ్వడం జరుగుతుంది.
ఎన్ఇఇటి కి హాజరు కాబోయే అభ్యర్థుల ను గుర్తించి వారిని ఈ ఆపత్కాలం లో కోవిడ్-19 సేవల రోజుల దళం లో చేరవలసిందిగా అభ్యర్ధించడం లో రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాల ను చేయవలసి ఉంటుంది. ఈ ఎమ్ బిబిఎస్ డాక్టర్ ల సేవల ను కోవిడ్-19 నిర్వహణ లో ఉపయోగించుకోవచ్చును. రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఇక మీదట మెడికల్ ఇంటర్న్ లను ఇంటర్న్‌శిప్ రొటేశన్ లో భాగం గా వారి ఫేకల్టీ పర్యవేక్షణ లో కోవిడ్ నిర్వహణ సంబంధి విధుల లో నియోగించుకోవచ్చును. ఎమ్ బిబిఎస్ చివరి సంవత్సరం విద్యార్థుల సేవల ను ఫేకల్టీ ద్వారా తగిన నేపథ్య దృష్టి, పర్యవేక్షణ ల అనంతరం తేలికపాటి కోవిడ్ కేసు ల పర్యవేక్షణ కు, టెలి- కన్సల్టేశన్ వంటి సేవల ను అందించడం కోసం వినియోగించుకోవచ్చును.
పిజి ఫైనల్ ఇయర్ లో ఉన్నవారి సేవలను కొనసాగించడం:
పిజి ఫైనల్ ఇయర్ విద్యార్థుల (స్థూల మరియు సూపర్ స్పెశాలిటీస్ విభాగాలకు చెందిన వారి) సేవల నురెసిడెంట్స్ హోదా లో ఉపయోగించుకోవడాన్ని- పిజి తాజా బ్యాచ్ ల విద్యార్థులు చేరే వరకు- కొనసాగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అదే విధం గా, సీనియర్ రెసిడెంట్స్/రిజిస్ట్రార్స్ సేవల ను- కొత్త నియామకాలు జరిగేటంత వరకు- కొనసాగించుకోవచ్చును.
నర్సింగ్ సిబ్బంది:
బి.ఎస్‌సి./జిఎన్ఎమ్ అర్హత కలిగిన నర్సుల ను- సీనియర్ డాక్టర్ లు, నర్సుల పర్యవేక్షణ లో- ఐసియు తదితర విభాగాల లో పూర్తి కాలపు కోవిడ్ నర్సింగ్ విధుల లో వినియోగించుకోవచ్చును. ఎమ్.ఎస్‌సి. నర్సింగ్ విద్యార్థులు, పోస్ట్ బేసిక్ బి.ఎస్‌సి. (ఎన్) మరియు పోస్ట్ బేసిక్ డిప్లొమా నర్సింగ్ విద్యార్థులు.. వీరు రిజిస్టర్డ్ నర్సింగ్ ఆఫీసర్స్ అయినందువల్ల, వీరి సేవల ను ఆసుపత్రి ప్రోటోకాల్స్/ విధానాల కు అనుగుణం గా కోవిడ్-19 రోగుల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి వినియోగించుకోవచ్చును. అలాగే జిఎన్ఎమ్ లేదా బి.ఎస్‌సి. (నర్సింగ్) ఫైనల్ ఇయర్ విద్యార్థులు- ఎవరైతే ఇంకా ఆఖరి పరీక్ష కోసం హాజరవడం కోసం ఎదురు చూస్తున్నారో- వారికి సీనియర్ ఫేకల్టీ పర్యవేక్షణ లో వివిధ ప్రభుత్వ/ ప్రైవేటు ఆసుపత్రుల లో కోవిడ్ నర్సింగ్ తాలూకు పూర్తి కాలపు విధుల ను కూడా ఇవ్వవచ్చును.
ఆరోగ్య సంరక్షణ సంబంధ వృత్తి నిపుణుల సేవల ను- వారికి ఇచ్చినటువంటి శిక్షణ మరియు సర్టిఫికెట్ ల ఆధారం గా- కోవిడ్ నిర్వహణ లో సహాయం అందించడానికి గాను వినియోగించుకోవచ్చును.
ఈ రకం గా కూడగట్టిన అదనపు మానవ వనరుల ను కోవిడ్ నిర్వహణ సంబంధ సదుపాయాల లో మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది.
బి. ప్రోత్సాహకాలు/ సేవ తాలూకు గుర్తింపు
కోవిడ్ నిర్వహణ లో సేవల ను అందిస్తున్న వ్యక్తుల కు, వారు కోవిడ్ సంబంధిత విధుల లో కనీసం 100 రోజులు పూర్తి చేసిన తరువాత, భవిష్యత్తు లో జరిగే ప్రభుత్వ రెగ్యులర్ నియామకాల లో పెద్దపీట వేయడం జరుగుతుంది.
పైన ప్రస్తావించిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి అదనపు మానవ శక్తి ని రంగం లోకి దించడం కోసం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఒప్పంద పద్ధతి లో చేపట్టే మానవ వనరుల భర్తీ కి ఉద్దేశించినటువంటి నేశనల్ హెల్థ్ మిశన్ (ఎన్‌హెచ్ఎమ్) నియమావళి ని అమలు పరచడాన్ని పరిశీలించవచ్చును. ఎన్‌హెచ్ఎమ్ నియమావళి లో ప్రస్తావించిన ప్రకారం ప్రతిఫలం పై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రాల కు వెసులుబాటు లభిస్తుంది. కోవిడ్ సంబంధిత విశిష్ట సేవల కు సముచితమైనటువంటి ఒక గౌరవ భృతి ని అందజేయడం గురించి కూడా పరిశీలించవచ్చును.
కోవిడ్ సంబంధిత పనుల లో నిమగ్నం కాదలచుకొన్న వైద్య విద్యార్థుల కు/ వైద్య వృత్తి నిపుణుల కు అందుకు అవసరమైనటువంటి టీకా మందు ను ఇప్పించడం జరుగుతుంది. ఆ విధం గా భర్తీ చేసుకొన్న ఆరోగ్య రంగ వృత్తి నిపుణుల కు, కోవిడ్-19 తో పోరు లో తలమునకలైన ఆరోగ్య రంగ శ్రమికుల కు ఉద్దేశించిన ప్రభుత్వ బీమా పథకం లో ప్రస్తావించిన మేరకు రక్షణ కవచం లభిస్తుంది.
కోవిడ్ విధుల లో కనీసం 100 రోజుల పాటు పాల్గొనడానికి, మరి ఆ విధుల ను జయప్రదం గా పూర్తి చేసినటువంటి వృత్తి నిపుణులందరికీ కూడా భారత ప్రభుత్వం పక్షాన ప్రైం మినిస్టర్స్ డిస్ టింగ్ విశ్ డ్ కోవిడ్ నేశనల్ సర్వీస్ సమ్మాన్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేసుకొనే అదనపు ఆరోగ్య రంగ వృత్తి నిపుణుల ను ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల తో పాటు కేసు ల తాకిడి అధికం గా ఉన్న ప్రాంతాల కు పంపవచ్చును.
ఆరోగ్య విభాగం లో, వైద్య విభాగం లో ఖాళీ గా మిగిలి ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, నర్సు ఉద్యోగాలు, ఇతర సంబంధిత వృత్తి నిపుణుల కొలువులు మరియు ఇతరత్రా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నౌకరీ లను ఎన్‌హెచ్ఎమ్ నియమావళి ఆధారం గా ఒప్పంద నియామకాల ద్వారా 45 రోజుల లోపల త్వరిత గతి ప్రక్రియ ల ద్వారా భర్తీ చేయవచ్చును.
మానవ శక్తి ని గరిష్ఠ స్థాయి లో అందుబాటు లోకి తీసుకు రావడానికి గాను పైన పేర్కొన్నటువంటి ప్రోత్సాహకాల గురించి ఆలోచన చేయవలసింది గా రాష్ట్రాల ను/ కేంద్ర పాలిత ప్రాంతాల ను కోరడమైంది.
NEET-PG Exam to be postpone for at least 4 months
Medical personnel completing 100 days of Covid duties will be given priority in forthcoming regular Government recruitments
Medical Interns to be deployed in Covid Management duties under the supervision of their faculty
Final Year MBBS students can be utilized for tele-consultation and monitoring of mild Covid cases under supervision of Faculty
B.Sc./GNM Qualified Nurses to be utilized in full-time Covid nursing duties under the supervision of Senior Doctors and Nurses.
Medical personnel completing 100 days of Covid duties will be given Prime Minister’s Distinguished Covid National Service Samman


