పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు కేంద్రంగా ఒడిశా రాష్ట్ర అపారమైన సామర్థ్యాన్ని ఈ సదస్సు ప్రదర్శిస్తుంది: ప్రధాన మంత్రి
దేశాభివృద్ధికి తూర్పు భారతదేశం చోదక శక్తి అయితే, ఇందులో ఒడిశా పాత్ర ఎంతో కీలకం: ప్రధాని
కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది: ప్రధాని
ఒడిశా ముద్ర ప్రత్యేకం... నవ భారతదేశ ఆశావాదానికి, సహజత్వానికి ప్రతీక.... ఒడిశా అవకాశాలకు కేంద్రం
ఎల్లప్పుడూ అత్యుత్తమతను కనబరచడం ఇక్కడి ప్రజల అభిరుచి: ప్రధానమంత్రి
హరిత భవిత, హరిత సాంకేతికతపై దృష్టి పెట్టిన భారత్: ప్రధానమంత్రి
21వ శతాబ్దపు భారతదేశానికి ఇది అనుసంధానిత మౌలిక సదుపాయాలు, బహుళ విధ కనెక్టివిటీతో ముడిపడిన శకం: ప్రధాన మంత్రి
ఒడిశాలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయి: ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా సమ్మేళనం,  2025 మేక్ ఇన్ ఒడిశా ఎగ్జిబిషన్ లను ప్రారంభించారు. 2025 జనవరి నెలలో తాను ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి అనిప్రవాసీ భారతీయ దివస్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తాను మొదటిసారి వచ్చానని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారుఇప్పటి వరకు ఒడిశాలో జరిగిన అతిపెద్ద వ్యాపార శిఖరాగ్ర సదస్సు బిజినెస్ సమ్మిట్ ఇదేననిమేక్ ఇన్ ఒడిశా కాన్ క్లేవ్ 2025లో 5-6 రెట్లు ఎక్కువ మంది పెట్టుబడిదారులు పాల్గొంటున్నారని శ్రీ మోదీ తెలిపారుఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రజలకుఒడిశా ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.

"దేశ అభివృద్ధికి తూర్పు భారతదేశం ఒక చోదక శక్తి.  ఇందులో ఒడిశా కీలక పాత్ర పోషిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారుప్రపంచ వృద్ధిలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తున్న సమయంలో తూర్పు భారతదేశ సహకారం ప్రాధాన్యతను చారిత్రాత్మక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారుతూర్పు భారతదేశంలో భారీ పారిశ్రామిక కేంద్రాలుఓడరేవులువాణిజ్య కేంద్రాలు ఉన్నాయనిఇందులో ఒడిశా భాగస్వామ్యం విశేషమని శ్రీ మోదీ పేర్కొన్నారుఒడిశా దక్షిణ ఆగ్నేయాసియా వాణిజ్యంలో ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలోని నౌకాశ్రయాలు భారతదేశానికి ప్రవేశ ద్వారంగా పనిచేశాయి” అని ప్రధానమంత్రి తెలిపారు. ఒడిశాలో ఇప్పటికీ బలి యాత్రను ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుని భారత సందర్శనను ప్రస్తావించిన ప్రధానమంత్రి.. తన డీఎన్ఏలో ఒడిశా ఆనవాళ్లు ఉండవచ్చంటూ ఆయన చెప్పిన మాటలను ఉటంకించారు.

 

ఆగ్నేయాసియాతో అనుసంధాన వారసత్వాన్ని ఒడిశా కలిగి ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ సుసంపన్నమైన వారసత్వాన్ని ఈ 21వ శతాబ్దంలో పునరుద్ధరించడం ఒడిశా ప్రారంభించిందని ఆయన అన్నారు. సింగపూర్ అధ్యక్షుడు ఇటీవల ఒడిశాలో పర్యటించారని, ఒడిశాతో సంబంధాలపై సింగపూర్ చాలా ఆసక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒడిశాతో వాణిజ్యం, సంప్రదాయ సంబంధాల బలోపేతానికి ఆసియాన్ దేశాలు కూడా ఆసక్తి కనబరిచాయని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మునుపెన్నడూ లేనంతగా ఈ ప్రాంతంలో అనేక అవకాశాలు తెరుచుకుంటున్నాయని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. అభివృద్ధి బాట పట్టిన ఒడిశాలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులకు పిలుపునిస్తూ, వారి పెట్టుబడులు కొత్త విజయాల శిఖరాలకు దారితీస్తాయని  అన్నారు. 

"కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది" అని శ్రీ మోదీ అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - ఎ ఐ - అనేది కృత్రిమ మేధస్సు, యాస్పిరేషన్ ఆఫ్ ఇండియా (భారతదేశ ఆకాంక్ష) అనే రెండింటికీ వర్తిస్తుందని, ఇది భారతదేశపు శక్తి అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ప్రజల అవసరాలు తీరినప్పుడే ఆకాంక్షలు పెరుగుతాయని, గత దశాబ్ద కాలం  కోట్లాది మంది పౌరులకు సాధికారత కల్పించి, దేశానికి మేలు చేసిందన్నారు. ఒడిశా ఈ ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఒడిశా అసాధారణమైన రాష్ట్రమని, నవ భారత ఆశావాదానికి, సహజత్వానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ఒడిశాకు అనేక అవకాశాలు ఉన్నాయని, అక్కడి ప్రజలు ఎల్లప్పుడూ మెరుగైన పనితీరు కనబరచాలనే తపనను ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. గుజరాత్ లో ఒడిశా ప్రజల నైపుణ్యాలు, కష్టపడి చేసే పనితీరు, నిజాయితీని చూసిన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రధానమంత్రి ఈసందర్భంగాప్రస్తావించారు. కొత్తగా వస్తున్న అవకాశాలతో ఒడిశా రాష్ట్రం త్వరలోనే అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశా అభివృద్ధిని వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝీ, ఆయన బృందం చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోకెమికల్స్, పోర్టు ఆధారిత అభివృద్ధి, చేపల పెంపకం, ఐటీ, ఎడ్యుటెక్, టెక్స్ టైల్స్, టూరిజం, మైనింగ్, గ్రీన్ ఎనర్జీతో సహా వివిధ పరిశ్రమల్లో ఒడిశా భారతదేశపు అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా మారుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారతదేశం శరవేగంగా పురోగమిస్తున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మైలురాయి ఎంతో దూరంలో లేదని అన్నారు. గత దశాబ్ద కాలంలో తయారీ రంగంలో భారత్ సామర్ధ్యం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ రెండు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని, వీటిలో ఒకటి సృజనాత్మక సేవా రంగం కాగా, రెండోది నాణ్యమైన ఉత్పత్తులు అని ప్రధానమంత్రి అన్నారు. దేశ వేగవంతమైన పురోగతి కేవలం ముడి పదార్థాల ఎగుమతులపై మాత్రమే ఆధారపడదని, అందువల్ల మొత్తం వ్యవస్థను కొత్త దార్శనికతతో మారుస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. ఖనిజాలను వెలికితీసి ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు కోసం విదేశాలకు పంపి, తిరిగి ఆ ఉత్పత్తులు భారత్ కు వచ్చే ధోరణిని భారత్ మారుస్తోందని అన్నారు. అదేవిధంగా ఇతర దేశాలకు ప్రాసెసింగ్ కోసం సీఫుడ్ ను ఎగుమతి చేసే ధోరణిని కూడా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని వనరులకు సంబంధించిన పరిశ్రమలను ఆ రాష్ట్రంలోనే నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఉత్కర్ష్ ఒడిశా సదస్సు-2025 ఈ దార్శనికతను సాకారం చేసుకోవడానికి ఒక సాధనమని ఆయన స్పష్టం చేశారు. 

సుస్థిర జీవన శైలిపై ప్రపంచం ఎక్కువగా దృష్టి సారించిందని, హరిత భవిష్యత్తు వైపు పయనిస్తోందని, హరిత ఉద్యోగ (గ్రీన్ జాబ్స్) అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత కాల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశ ఇంధన భద్రతకు శక్తినిచ్చే సోలార్, విండ్, హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్ తో సహా గ్రీన్ టెక్నాలజీ, హరిత భవిష్యత్తుపై భారతదేశం దృష్టి సారించిందని ఆయన తెలియచేశారు. ఈ విషయంలో ఒడిశాకు అపారమైన సామర్ధ్యం ఉందని, దేశం జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్ మిషన్లను ప్రారంభించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఒడిశాలో పునరుత్పాదక ఇంధన పరిశ్రమలను ప్రోత్సహించడానికి గణనీయమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని, హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని శ్రీ మోదీ తెలిపారు. 

 

 

ఒడిశాలో గ్రీన్ ఎనర్జీతో పాటు పెట్రో, పెట్రో కెమికల్ రంగాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. పరదీప్, గోపాల్ పూర్ లలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, పెట్టుబడి ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఈ రంగంలో గణనీయమైన పెట్టుబడి అవకాశాలను సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని,  త్వరితగతిన సత్వర నిర్ణయాలతో కొత్త సానుకూల వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు ఒడిశా ప్రభుత్వాన్ని శ్రీ మోదీ అభినందించారు.

“21వ శతాబ్దం అనుసంధాన మౌలిక సదుపాయాల శకం. భారత్ అనేక విధాలుగా అనుసంధితమవుతోంది” అని శ్రీ మోదీ అన్నారు. భారత్ లో ప్రత్యేకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పరిమాణం, వేగం పెట్టుబడులకు దేశాన్ని అత్యున్నతమైన గమ్యస్థానంగా మారుస్తున్నాయని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు తూర్పు - పశ్చిమ తీరాలను కలుపుతున్నాయని, గతంలో భూ పరివేష్టితంగా ఉన్న ప్రాంతాలకు సముద్రంలోకి వేగంగా ప్రవేశించే సదుపాయాన్ని కల్పించాయని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణం కార్యకలాపాలను ప్రారంభించేలా సదుపాయాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ పారిశ్రామిక నగరాలను నిర్మిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో ఇలాంటి అవకాశాలు మెరుగవుతున్నాయనీ రాష్ట్రంలో రైల్వే, హైవే నెట్‌వర్క్‌లకు సంబంధించి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. ఒడిశాలో పరిశ్రమలకు రవాణా వ్యయాన్ని తగ్గించడం కోసం పారిశ్రామిక ప్రాంతాలతో ఓడరేవులను ప్రభుత్వం అనుసంధానం చేస్తోందని, దానితోపాటు ప్రస్తుత ఓడరేవుల విస్తరణతోపాటు కొత్త ఓడరేవుల నిర్మాణాలనూ చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్ర ఆర్థిక వ్యవస్థ పరంగా దేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఒడిశా నిలిచిందని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్త పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో అంతర్జాతీయంగా సరఫరా శ్రేణుల్లో ఎదురవుతున్న సవాళ్లను ప్రతిఒక్కరూ గుర్తించాలని ప్రధానమంత్రి కోరారు. విడివిడిగానూ దిగుమతి ఆధారితంగానూ ఉన్న సరఫరా వ్యవస్థపైనే భారత్ ఆధారపడలేదని స్పష్టం చేశారు. బదులుగా ఒక శక్తిమంతమైన సరఫరా, కార్యకలాపాల వ్యవస్థను దేశంలోనే నిర్మించుకుని అంతర్జాతీయ ఒడుదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వమూ పరిశ్రమా రెండింటిపైనా ఈ బాధ్యత ఉందన్నారు. వృద్ధిలో పరిశోధన, ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఎంఎస్ఎంఈలు, కొత్త అంకుర సంస్థలకు చేయూతనివ్వాలని పారిశ్రామిక రంగానికి శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఇంటర్న్ షిప్ లు, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి, ప్యాకేజీల ఏర్పాటుతో దేశంలో ఒక శక్తిమంతమైన పరిశోధన వ్యవస్థను ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు. ఇందులో పరిశ్రమలు క్రియాశీలకంగా పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. బలమైన పరిశోధన వ్యవస్థ, నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తి పరిశ్రమలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని ప్రత్యేకంగా పేర్కొన్న శ్రీ మోదీ.. ఒడిశా ప్రభుత్వమూ పారిశ్రామిక భాగస్వాములూ కలిసి పనిచేస్తూ ఒడిశా ఆకాంక్షలకు అనుగుణమైన ఆధునిక వ్యవస్థను నిర్మించాలని, యువతకు కొత్త అవకాశాలను కల్పించాలని కోరారు. దీనివల్ల ఒడిశాలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. అది రాష్ట్రానికి శ్రేయస్సుకు, శక్తితో పురోగమించడానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.

 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారత్ ను అర్థం చేసుకోవడానికి, ఈ దేశం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వేలాది సంవత్సరాల చరిత్ర, వారసత్వం కలిగిన ఒడిశా... భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఓ అద్భుతమైన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వాసమూ, ఆధ్యాత్మికత, అడవులు, కొండలు, సముద్రమూ... అన్నీ ఒక్కచోట కలగలిసి ఉన్న విశిష్టత ఒడిశా సొంతమన్నారు. ఒడిశాను అభివృద్ధికి, వారసత్వానికి నమూనాగా అభివర్ణించిన శ్రీ మోదీ.. జీ-20 సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రంలో నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. కోణార్క్ సూర్య దేవాలయ చక్రాన్ని ప్రధాన కార్యక్రమంలో భాగం చేసిన విషయాన్నీ గుర్తుచేశారు. 500 కిలోమీటర్ల తీరప్రాంతం, 33 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం, పర్యావరణ హిత పర్యాటకానికీ అడ్వెంచర్ టూరిజానికీ అపారమైన అవకాశాలున్న ఒడిశా తన పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం అత్యావశ్యకమన్నారు. ‘భారత్ లో వివాహం’, ‘భారత్ లో స్వస్థత’లపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందనీ.. ఒడిశా సహజ సౌందర్యం, పర్యావరణం వీటికి దోహదం చేస్తుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

సదస్సుల నిర్వహణ పర్యాటకంలో భారత్ కు గణనీయమైన అవకాశాలున్నాయని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమి వంటి వేదికలు ఈ రంగంలో ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ రకమైన వ్యవస్థను అభివృద్ధి చెందుతున్న రంగంగా ఆయన ప్రస్తావించారు. సంగీతం, నృత్యం, కథాకథనాల సుసంపన్నమైన వారసత్వమూ సమ్మేళనాలకు పెద్ద సంఖ్యలో వెళ్లే యువతతో ఈ రంగంలో భారత్ కు అపారమైన అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలూ, వాటికి డిమాండూ గత దశాబ్ద కాలంగా పెరిగిందని ఆయన తెలిపారు. ముంబయి, అహ్మదాబాద్ నగరాల్లో కోల్డ్ ప్లే కన్సర్టులను భారత్ లో లైవ్ కన్సర్టులకు ఉన్న ఆదరణకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన కళాకారులంతా భారత్ వైపు ఆకర్షితులయ్యారని, కన్సర్ట్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకానికి ఊతమిచ్చి అనేక ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని అన్నారు. ఈ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టిసారించాలని రాష్ట్రాలను, ప్రైవేటు రంగాన్ని ఆయన కోరారు. ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోనూ, వ్యక్తిగత కళాకారులను తీర్చిదిద్దడంలోనూ అవకాశాలతోపాటు భద్రతా సిబ్బందికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)కు తొలిసారి భారత్ వేదికగా నిలుస్తుందని శ్రీ మోదీ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం భారత సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటుతుందన్నారు. అలాంటి కార్యక్రమాలు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు మన విలువను పెంచుతాయని వ్యాఖ్యానించారు. అది అంతిమంగా ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆతిథ్యమివ్వడంలో ఒడిశాకు అపారమైన అవకాశాలున్నాయన్నారు.

 

“అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించడంలో ఒడిశాది కీలక పాత్ర” అని ప్రధానమంత్రి అన్నారు. సుసంన్నమైన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని ఒడిశా ప్రజలు సంకల్పించారని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తోందని వెల్లడించారు. ఒడిశాతో తనకున్న ప్రేమను గుర్తుచేస్తూ.. ప్రధానిగా తానిప్పటివరకు 30 సార్లు ఒడిశాను, అందులోని అనేక జిల్లాలను సందర్శించానని తెలిపారు. ఒడిశా, ఈ రాష్ట్ర ప్రజల సమర్థతపై తనకు అపారమైన విశ్వాసముందన్నారు. పెట్టుబడుల ద్వారా వాణిజ్యంతోపాటు ఒడిశా పురోగతి కూడా కొత్త శిఖరాలను చేరుతుందని ధీమా వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝి, కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం:

ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా చర్చావేదిక అన్నది ఒడిశా ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన పెట్టుబడుల సదస్సు. పూర్వోదయ దార్శనికత కేంద్రంగాను, పెట్టుబడుల గమ్యస్థానంగాను, భారత పారిశ్రామిక కూడలిగా రాష్ట్రాన్ని నిలపడం ఈ సదస్సు లక్ష్యం.

మేకిన్ ఒడిశా ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రభావవంతమైన పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో రాష్ట్రం సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. పారిశ్రామిక అధినేతలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తల సమావేశానికీ.. పెట్టుబడుల ప్రధాన గమ్యస్థానంగా ఒడిశాకు గల అవకాశాలను చర్చించడానికీ వేదికగా ఇది ఉపయోగపడుతుంది. సీఈవోలు - వాణిజ్యాధినేతల సమావేశాలు, రంగాల వారీగా సదస్సులు, వివిధ సంస్థలకు చెందిన నిపుణుల సమావేశాలు, విధానపరమైన చర్చలకు ఈ సదస్సు వేదికవనుంది. అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులతో భాగస్వామ్యానికి దీని ద్వారా అవకాశం లభిస్తుంది.  

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre releases Rs 44,544 crore capex loans to states so far in FY27

Media Coverage

Centre releases Rs 44,544 crore capex loans to states so far in FY27
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses anguish over the loss of lives due to tunnel collapse in Namchi, Sikkim
July 21, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed anguish over the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. He extended his deepest condolences to the bereaved families and prayed that those injured recover at the earliest.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Shri Modi stated that the injured would be given Rs. 50,000.

In a post on X, the Prime Minister shared:

"Anguished by the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. I extend my deepest condolences to the bereaved families. I pray that those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"