ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రధాన పథకాల ఫలాలు అందరికిఅందేటట్టు చూసేందుకు ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ను ప్రారంభించినప్రధాన మంత్రి
దాదాపు గా 24 వేల కోట్ల రూపాయల బడ్జెటు తో పిఎమ్ జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పిఎమ్ – జన్ మన్) ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
పిఎమ్-కిసాన్ లో భాగం గా సుమారు 18 వేల కోట్ల రూపాయల తో కూడిన 15వ కిస్తీ సొమ్ము ను విడుదల చేసిన ప్రధాన మంత్రి
రమారమి 7,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల నుఝార్ ఖండ్ లో దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
వికసిత్ భారత్ సంకల్ప్ ప్రతిజ్ఞ‌ కు నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి
‘‘భగ్ వాన్ బిర్ సా ముండా యొక్క పోరాటాలు మరియు త్యాగాలుఅసంఖ్యక భారతీయుల కు ప్రేరణ ను అందించేవే’’
‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ , ఇంకా ‘పిఎమ్ జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్’ అనే రెండు చారిత్రిక కార్యక్రమాల ను ఈ రోజు నఝార్ ఖండ్ లో ప్రారంభించుకోవడం జరుగుతున్నది’’
‘‘భారతదేశం లో అభివృద్ధి అమృత్ కాలం యొక్క నాలుగుస్తంభాలైన మహిళ ల శక్తి, యువ శక్తి, వ్యవసాయ శక్తి మరియు మన పేదలు, మధ్య తరగతిప్రజల యొక్క శక్తి ల మీద ఆధారపడి ఉంది’’
‘‘నిరాదరణ కు గురి అయిన వర్గాల వారి ని తన ప్రాధాన్యంగా ఎంచుకొన్న మోదీ’’
‘‘భగ్ వాన్ బిర్ సా ముండా కు చెందిన ఈ గడ్డ కు నేను, నిరాదరణకు గురి అయిన వర్గాల కు నేను తీర్చవలసిన రుణాన్ని తీర్చడానికే వచ్చాను’’
‘‘దేశం లో ఏ పౌరుడుపౌరురాలు విషయం లో వివక్ష సంబంధిసంభావ్యతల ను అంతమొందించినప్పుడే సిసలైన మతాతీతవాదం పెల్లుబుకుతుంది’’
‘‘ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ఈ రోజు న అంటే భగ్వాన్ బిర్ సా ముండా యొక్క జయంతి నాడు మొదలై రాబోయే సంవత్సరం లో జనవరి 26వ తేదీవరకు కొనసాగనుంది’’

జన్ జాతీయ గౌరవ్ దివస్, 2023 సంబంధి వేడుకల కు గుర్తు గా ఝార్ ఖండ్ లోని ఖూంటీ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ తో పాటు ప్రధాన మంత్రి పర్టిక్యులర్ లీ వల్నరబల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్ మెంట్ మిశన్ ’ ను కూడ ప్రారంభించారు. ఆయన పిఎమ్-కిసాన్ యొక్క 15వ కిస్తీ ని కూడ విడుదల చేశారు. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు ల వంటి అనేక రంగాల లో 7,200 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ఝార్ ఖండ్ లో శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటు ఆయా ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన లో ఆయన కలియదిరిగారు కూడా.

 

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వద్ద నుండి ఒక వీడియో సందేశాన్ని ఈ కార్యక్రమం లో చూపించడం జరిగింది.

 

ఇదే కార్యక్రమం లో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ ప్రతిజ్ఞ‌ కు సైతం ప్రధాన మంత్రి నాయకత్వం వహించారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ ఈ రోజు న తాను భగ్ వాన్ బిర్ సా ముండా యొక్క జన్మస్థలం ఉలిహాతు గ్రామాని కి వెళ్లడం, అలాగే రాంచీ లో బిర్ సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను సందర్శించిన సంగతి ని గుర్తు కు తీసుకు వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు న ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను ప్రారంభించిన విషయాన్ని కూడా ను ఆయన ప్రస్తావించారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భం లో ప్రతి ఒక్క పౌరురాలు కు, ప్రతి ఒక్క పౌరుని కి శ్రీ నరేంద్ర మోదీ తన అభినందనల ను తెలియజేయడం ఒక్కటే కాకుండా శుభాకాంక్షల ను కూడా వ్యక్తం చేశారు. ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆయన తన శుభకామనల ను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఝార్ ఖండ్ స్థాపన లో పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ యొక్క తోడ్పాటు ను కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ రోజు న రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు వంటి వివిధ రంగాల లో చేపట్టుకొన్న అభివృద్ధి పథకాల కు గాను ఆయన ఝార్ ఖండ్ ప్రజల కు అభినందనల ను తెలియజేశారు. ఝార్ ఖండ్ ఇక 100 శాతం విద్యుదీకరణ పూర్తి అయినటువంటి రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి అంటూ ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు.

 

ఆదివాసీ స్వాభిమానం పరిరక్షణ కోసం భగ్ వాన్ బిర్ సా ముండా జరిపిన ప్రేరణదాయకం అయినటువంటి పోరాటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అనేక మంది ఆదివాసి వీరుల తో ఝార్ ఖండ్ గడ్డ కు గల అనుబంధాన్ని వివరించారు. తిల్ కా మాంఝి, సిద్ధు కాన్హు, చండ్ భైరవ్, ఫులో ఝానో, నీలాంబర్, పీతాంబర్, జట్ రా తానా భగత్ మరియు ఆల్బర్ట్ ఎక్కా గారు ల వంటి ఎంతో మంది వీరులు ఈ నేల గర్వపడేటట్టు చేశారు అని ఆయన అన్నారు. దేశం లో మూల మూల న జరిగిన స్వాతంత్ర్య సమరం లో ఆదివాసి యోధులు పాలుపంచుకొన్నారు అని ప్రధాన మంత్రి చెప్తూ, మాన్ గఢ్ ధామ్ కు చెందిన గోవింద్ గురు, మధ్య ప్రదేశ్ కు చెందిన తాంత్యా భీల్, ఛత్తీస్ గఢ్ కు చెందిన భీమా నాయక్, అమరుడు వీర్ నారాయణ్ సింహ్, వీర్ గుండాధుర్, మణిపుర్ కు చెందిన రాణి గైదిన్ లియు, తెలంగాణ కు చెందిన వీరుడు రాంజీ గోండ్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామ రాజు, గోండ్ ప్రదేశ్ కు చెందిన రాణి దుర్గావతి లను గురించి చెప్పారు. అటువంటి మహనీయుల పట్ల ఉపేక్ష విచారకరం అని ప్రధాన మంత్రి అంటూ, ఈ వీరుల ను అమృత్ మహోత్సవ సందర్బం లో స్మరించుకొంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఝార్ ఖండ్ తో వ్యక్తిగతం గా తనకు ఉన్న బంధాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆయుష్మాన్ యోజన ను ఝార్ ఖండ్ నుండే మొదలుపెట్టడం జరిగిందని గుర్తు కు తీసుకు వచ్చారు. ఝార్ ఖండ్ లో ఈ రోజు న రెండు చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాల ను ప్రారంభించుకోవడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వాటి లో ఒకటోది వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని అది ప్రభుత్వ లక్ష్యాల ను నెరవేర్చేటటువంటి ఒక సాధనం గా ఉండగలదన్నారు. రెండోది పిఎమ్ జన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ అని అది అంతరించిపోయే దశ లో ఉన్న తెగల ను కాపాడి వాటి ని పెంచి పోషిస్తుందని ఆయన చెప్పారు.

 

 

వికసిత్ భారత్ యొక్క ఈ యొక్క ‘అమృత స్తంభాలు నాలుగింటి’ పై దృష్టి ని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ నాలుగు స్తంభాలు ఏవేవి అంటే అవి మహిళా శక్తి, భారతదేశం యొక్క ఆహార సృష్టికర్తలు, దేశం లోని యువత , ఇక చివరగా భారతదేశం లోని నవ మధ్య తరగతి మరియు పేద ప్రజానీకం అని వివరించారు. అభివృద్ధి కి ఆధారమైన స్తంభాల ను బలపరచడం కోసం మన లో ఉన్నటువంటి సామర్థ్యం మీద భారతదేశం లో అభివృద్ధి యొక్క స్థాయి ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. నాలుగు స్తంభాల ను బలపరచడం కోసం ప్రస్తుత ప్రభుత్వం గడచిన 9 సంవత్సరాల లో చేసిన ప్రయాస లు మరియు కార్యాల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

   దేశంలో 13 కోట్ల మందికిపైగా ప్రజలను పేదరికం నుంచి విముక్తం చేయడం ద్వారా ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అధికశాతం ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని చెబుతూ- ‘‘మేము 2014లో అధికారంలోకి వచ్చాక మా సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పేదలు ఆశలు వదిలేసుకున్నారని తెలిపారు. అయితే, ‘‘ప్రస్తుతం మా ప్రభుత్వం సేవా స్పూర్తితో కృషికి శ్రీకారం చుట్టింది’’ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు నేడు ఇంటి ముంగిటే సౌకర్యాలు కల్పనను ప్రభుత్వ ప్రాథమ్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. పరివర్తన దిశగా తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అలాగే 2014కు ముందు గ్రామీణ పరిశుభ్రత పరిధి 40 శాతం మాత్రమే కాగా, నేడు సంతృప్త స్థాయి లక్ష్యంగా దేశం ముందడుగు వేస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. మరోవైపు 2014 నుంచీ తమ ప్రభుత్వం సాధించిన ఇతర విజయాలను ఆయన ఏకరవు పెట్టారు. ఈ మేరకు గ్రామాల్లో  వంటగ్యాస్ కనెక్షన్లు 50-55 శాతం నుంచి దాదాపు 100 శాతానికి చేరాయన్నారు. బాలలకు ప్రాణరక్షక టీకాలు 55 శాతం నుంచి 100 శాతం పూర్తయ్యాయని, స్వాతంత్ర్యం తర్వాత ఏడు దశాబ్దాల్లో 17 శాతంగా  ఉన్న నీటి సరఫరా కనెక్షన్లు నేడు 70 శాతానికి పెరిగాయని తెలిపారు. ‘‘అణగారిన వర్గాలే తన ప్రాథమ్యంగా మోదీ సంకల్పం ప్రకటించుకున్నాడు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పేదరికం, కష్టనష్టాలతో కూడిన తన జీవితానుభవమే అణగారిన వర్గాల ప్రజలతో తన అనుబంధాన్ని బలోపేతం చేసిందని, తద్వారా వారు ప్రభుత్వ ప్రాథమ్యంగా మారారని ప్రధాని చెప్పారు. ‘‘అణగారిన వర్గాల రుణం తీర్చుకోవడానికే నేనివాళ భగవాన్ బిర్సా ముండా జన్మభూమికి వచ్చాను’’ అని ఆయన వివరించారు.

   తక్షణ ఫలితాల కోసం ఆరాటపడకుండా చిరకాల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్వేషణకే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని శ్రీ మోదీ అన్నారు. తరతరాలుగా శాపగ్రస్థుల్లా అంధకారంలో మగ్గిన 18 వేల గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యుదీకరణను ఈ సందర్భంగా ఉదాహరించారు. ఎర్రకోట బురుజుల నుంచి ఇచ్చిన హామీ మేరకు నిర్దిష్ట వ్యవధిలోనే ఈ విద్యుదీకరణ పూర్తయిందని గుర్తుచేశారు. అలాగే వెనుకబడినవిగా ముద్ర వేయబడిన 110 జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, జీవన సౌలభ్యం వంటి కీలక పారామితులన్నింటిలోనూ వృద్ధి నమోదైందని తెలిపారు. ఈ మేరకు గిరిజనం అధికంగాగల జిల్లాలుసహా అమలు చేసిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం పరివర్తనాత్మక మార్పులు తెచ్చిందని ఆయన చెప్పారు. ‘‘ఆకాంక్షాత్మక జిల్లాల విజయం ప్రాతిపదికగా ప్రస్తుతం ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం చేపట్టాం’’ అని ఆయన చెప్పారు.

   ‘దేశంలోని ఏ పౌరుడి విషయంలోనైనా వివక్షకుగల అన్ని అవకాశాలనూ రూపుమాపితేనే నిజమైన లౌకికత సిద్ధిస్తుంది’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనం ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో అందినప్పుడే సామాజిక న్యాయానికి భరోసా ఇచ్చినట్లు కాగలదన్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతి నేపథ్యంలో నేడు ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 26 వరకూ కొనసాగనున్న ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’కు స్ఫూర్తి ఇదేనన్నారు. ‘‘ఈ ప్రయాణంలో ప్రభుత్వం దేశంలోని ప్రతి గ్రామానికీ విప్లవాత్మక రీతిలో చేరువ అవుతుంది. ప్రతి పేద-అణగారిన వర్గాల వ్యక్తినీ పథకాల లబ్ధిదారులుగా మారుస్తుంది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

 

   ప్రభుత్వం 2018లో గ్రామ స్వరాజ్ అభియాన్‌ నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏడు ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వెయ్యి మంది అధికారులను గ్రామాలకు పంపామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు వికసిత భారతం సంకల్ప యాత్ర కూడా విజయవంతం కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోని ప్రతి పేదకూ ఉచిత రేషన్ కార్డు, ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్, ఇళ్లకు విద్యుత్ సరఫరా, కొళాయి కనెక్షన్, ఆయుష్మాన్ కార్డు, పక్కా ఇల్లు సంతృప్త స్థాయిలో సమకూరే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రతి రైతు, కార్మికుడు పెన్షన్ పథకంలో చేరడం, యువతరం తమ కలల సాకారం దిశగా ముద్రా యోజనను సద్వినియోగం చేసుకోవడంపై తన దృక్పథాన్ని ప్రధాని మోదీ వివరించారు. ఈ మేరకు ‘‘దేశంలోని పేద-అణగారిన, మహిళా, యువతరం, అన్నదాతలకు మోదీ ఇస్తున్న హామీయే వికసిత భారతం సంకల్ప యాత్ర’’ అని ఆయన పేర్కొన్నారు.

   వికసిత భారతం సంకల్పానికి కీలక పునాది ‘ప్రధానమంత్రి జన్మన్’ లేదా ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్’ అని ఆయన నొక్కిచెప్పారు. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తొలిసారి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు సహా ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించిన ఘనత అటల్‌ జీ ప్రభుత్వానిదేనన్నారు. మునుపటితో పోలిస్తే గిరిజన సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులు 6 రెట్లు పెంచామని తెలిపారు. ‘పిఎం జన్మన్’ ద్వారా గిరిజన సమాజాలకు, ఆదిమ తెగలకు ప్రభుత్వం చేరువవుతుందని, వీరిలో అధికశాతం నేటికీ  అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. దేశంలోని 22 వేలకుపైగా గ్రామాల్లో నివసించే లక్షలాది జనాభాగల 75 గిరిజన సమాజాలు, ఆదిమ తెగలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వాలు అంకెలు మాత్రమే జోడించాయి. కానీ,  నేను అలా కాకుండా జీవితానుసంధానం కోసం కృషి చేస్తున్నాను. ఈ లక్ష్యంతోనే ఇవాళ ‘పిఎం జన్మన్’ ప్రారంభమైంది’’ అని ప్రధాని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక  కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ₹24,000 కోట్లు ఖర్చు చేయనుందని వెల్లడించారు.

   దేశంలోని గిరిజనుల అభ్యున్నతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృఢ సంకల్పం, అంకితభావంపై ప్రధాని ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా చోదక ప్రగతికి ఆమె స్ఫూర్తిదాయక ప్రతీక అని ఆయన కొనియాడారు. ఇటీవ‌లి కాలంలో మ‌హిళ‌ల నేతృత్వంలో ప్రగతికి సంబంధించి చేపట్టిన చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని వివ‌రించారు. ‘‘మా ప్రభుత్వం వారి జీవితంలోని ప్రతి దశనూ పరిగణనలోకి తీసుకుని వివిధ పథకాలను రూపొందించింది’’ అని చప్పారు. ఈ మేరకు ‘బేటీ బచావో-బేటీ పఢావో, పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సైనిక పాఠశాలలు-రక్షణ అకాడమీలో ప్రవేశం’ వంటివాటిని ఆయన ఉదాహరించారు. అలాగే ముద్ర యోజన లబ్ధిదారులలో 70 శాతం మహిళలేనని, మహిళలు-స్వయం సహాయ సంఘాలకు రికార్డు స్థాయిలో ఆర్థిక సహాయం అందించడంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చామని, ఇవన్నీ వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పలు తెస్తున్నాయని తెలిపారు. ‘‘ఈ రోజు భాయ్ దూజ్ పవిత్ర పర్వదినం. ఈ నేపథ్యంలో దేశంలోని సోదరీమణులందరి ముందంజకుగల అన్ని అవరోధాలనూ తొలగిస్తామని మా ప్రభుత్వం తరఫున మీ సోదరుడుగా నేను హామీ ఇస్తున్నాను. వికసిత భారతం నిర్మాణంలో మహిళా శక్తి అమృత స్తంభానిదే కీలక పాత్ర’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   వికసిత భారతం సాధన దిశగా పయనంలో ప్రతి వ్యక్తి సామర్థ్యాన్నీ సద్వినియోగం చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ‘పిఎం విశ్వకర్మ యోజన’ స్పష్టం చేస్తోందని శ్రీ మోదీ చెప్పారు. విశ్మకర్మ మిత్రులందరికీ ఆధునిక శిక్షణతోపాటు అనువైన పరికరాలను కూడా ఈ పథకం కింద అందిస్తామని చెప్పారు. ‘‘ఈ పథకం కోసం ₹13,000 కోట్లు కేటాయించాం’’ అని ప్రధాని వెల్లడించారు.

 

   ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో ఇవాళ 15వ విడత నిధులు జమ చేసిన నేపథ్యంలో ఈ పథకం కింద ఇప్పటిదాకా ₹2,75,000 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. పశుపోషకులు, మత్స్యకారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్, పశువులకు ఉచిత టీకాల కోసం ప్రభుత్వం ₹15,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా మత్స్య సంపద యోజన కింద ఆర్థిక సహాయంతోపాటు దేశంలో 10 వేల కొత్త రైతు ఉత్పత్తిదారు సంస్థల ఏర్పాటు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రైతులకు మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడంద్వారా వారి ఖర్చులు తగ్గాయన్నారు. ఇక 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా నిర్వహించుకోవడం, ‘శ్రీ అన్న’ (చిరుధాన్యాల)ను విదేశీ విపణులకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రధాని మోదీ వివరించారు.

   జార్ఖండ్‌లో నక్సలైట్ల హింసాకాండను గణనీయంగా తగ్గించడమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధాన కారణమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి త్వరలో 25 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 25 పథకాల సంతృప్తస్థాయి అమలు లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రాభివృద్ధికి కొత్త ఉత్తేజం లభిస్తుందని, జీవన సౌలభ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. ‘‘విద్యారంగం విస్తరణతోపాటు యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులు తమ మాతృభాషలో వైద్య, ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసేందుకు ఆధునిక జాతీయ విద్యా విధానం వీలు కల్పిస్తుందని శ్రీ మోదీ వివరించారు. దేశవ్యాప్తంగా గడచిన తొమ్మిదేళ్లలో 300కుపైగా కొత్త విశ్వవిద్యాలయాలు, 5,500 కొత్త కళాశాలలు ఏర్పాటయ్యాయని తెలిపారు. డిజిటల్ భారతం కార్యక్రమం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. అలాగే భారతదేశం లక్షకుపైగా అంకుర సంస్థలతో ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర పర్యావరణ వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. రాంచీలోని ‘ఐఐఎం’ ప్రాంగణంలో, ధన్‌బాద్‌లోని ఐఐటీ-ఐఎస్‌ఎంలో కొత్త హాస్టళ్ల ప్రారంభోత్సవం గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

 

   చివరగా- అమృత కాలంలోని నాలుగు అమృత స్తంభాలు... ‘భారత మహిళా శక్తి, యువశక్తి, వ్యవసాయ శక్తి, పేద-మధ్యతరగతి శక్తి’ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చడమేగాక వికసిత భారతంగా రూపుదిద్దగలవన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం - వికసిత భారతం సంకల్ప యాత్ర

   ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ నిర్దిష్ట వ్యవధిలో చేరేలా చూడటం ద్వారా సంతృప్త స్థాయిని సాధించేందుకు ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ లక్ష్యం సాధించడమే పరమావధిగా గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నాడు ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’కు ఆయన శ్రీకారం చుట్టారు.

   ప్రజలకు చేరువ కావడం, అవగాహన కల్పించడం, పారిశుద్ధ్య సౌకర్యాలు, పరిశుభ్ర తాగునీరు, నిత్యావసర ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు, వంటగ్యాస్ సిలిండర్లు, పేదలకు ఇళ్లు, ఆహార భద్రత, సరైన పోషకాహారం, విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను సంపూర్ణంగా అందించడంపై ఈ యాత్ర ప్రధానంగా దృష్టి సారిస్తుంది. యాత్ర సందర్భంగా సేకరించే వివరాల ప్రాతిపదికన సంభావ్య లబ్ధిదారుల నమోదు చేపడతారు. కాగా, వికసిత భారతం సంకల్ప యాత్ర ప్రారంభ సూచికగా జార్ఖండ్‌లోని ఖుంటిలో ‘ఐఇసి’ (సమాచార-విద్యా-కమ్యూనికేషన్) వాహనాలను ప్రధానమంత్రి జెండా ఊపి సాగనంపారు. గిరిజన ప్రాబల్యంగల జిల్లాల నుంచి మొదలైన ఈ యాత్ర 2024 జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరిస్తుంది.

‘పిఎం పివిటిజి’ కార్యక్రమం

   ఈ పర్యటనలో భాగంగా దేశంలోనే తొలిసారి ‘ప్ర‌ధానమంత్రి దుర్బ‌ల‌ గిరిజన సంఘాల ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం’ (పిఎం పివిటిజి) ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 28 లక్షల జనాభాగల 22,544 గ్రామాల్లో (220 జిల్లాలు) నివసించే గిరిజనం కోసం 75 ‘పివిటిజి’లు ప్రస్తుతం ఏర్పాటయ్యాయి.

 

   వివిధ తెగలకు చెందిన ఈ గిరిజనం పలు మారుమూల, దుర్గమ ప్రాంతాల్లోని ఆవాసాలలో జీవిస్తుంటారు. వీరిలో అధికశాతం అటవీ ప్రాంతాలలో నివసిస్తుంటారు. అందుకే దాదాపు ₹24,000 కోట్ల బడ్జెట్‌తో ‘పివిటిజి’ల కుటుంబాలు, ఆవాసాలను రహదారులు, టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్, సురక్షిత గృహాలువంటి ప్రాథమిక సౌకర్యాలతో అనుసంధానించే ప్రణాళిక రూపొందించబడింది. అలాగే పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణల మెరుగైన లభ్యతసహా సుస్థిర జీవనోపాధి అవకాశాలు వారికి లభిస్తాయి. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వంలోని 9 మంత్రిత్వశాఖల పరిధిలోగల 11 ప్రస్తుత కార్యక్రమాల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఉదాహరణకు... ‘పిఎంజిఎస్‘వై, పిఎంజిఎవై, జల్ జీవన్ మిషన్ తదితరాలన్నిటినీ మారుమూల ఆవాసాలు వర్తింపజేసేలా కొన్ని పథకాల నిబంధనలు సడలించబడతాయి. దీంతోపాటు ‘పిఎంజెఎవై’, కొడవలి కణ రక్తహీనత వ్యాధి నిర్మూలన, క్షయ నిర్మూలన, వందశాతం రోగనిరోధక టీకాలు, పిఎం సురక్షిత మాతృత్వ యోజన, పిఎం మాతృ వందన యోజన, పిఎం పోషణ్, పిఎం జన్ ధన్ యోజన తదితరాలన్నీ సంతృప్త స్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది.

పిఎం-కిసాన్’ పథకం 15విడత నిధుల విడుదల.. ఇతర ప్రగతి పథకాలు

   రైతుల సంక్షేమంపై ప్రధాని నిబద్ధతను చాటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పిఎం-కిసాన్) కింద 15వ విడతగా 8 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ₹18,000 కోట్లు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పద్ధతిలో వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడ్డాయి. ఈ పథకం కింద ఇప్పటిదాకా 14 విడతల్లో ₹2.62 లక్షల కోట్లు రైతు ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. మరోవైపు రాష్ట్రంలో రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియం-సహజవాయువు తదితర రంగాలకు సంబంధించి ₹7200 కోట్ల విలువైన కొన్ని ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు.

   ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో జాతీయ రహదారి-133లోని మహాగామ-హన్స్‌దిహా విభాగంలో 52 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి-114ఎ పరిధిలో బాసుకినాథ్-దేవగఢ్ విభాగంలో 45 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలకు విస్తరణ; కెడిహెచ్-పూర్ణదిహ్ బొగ్గు నిర్వహణ ప్రాజెక్టు, ట్రిపుల్ ఐటీ-రాంచీ కొత్త విద్యా-పరిపాలన భవనం వగైరాలున్నాయి.

   ఇక జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులలో: ఐఐఎం-రాంచీ, ఐఐటి-ఐఎస్ఎం-ధన్‌బాద్ లలో కొత్త హాస్టల్ భవనాలు, బొకారోలో పెట్రోలియం-లూబ్రికెంట్స్ (పిఒఎల్) డిపో; హటియా-పక్రా విభాగం, తల్గారియా-బొకారో విభాగం, జరంగ్డిహ్-పాట్రాటు విభాగాల్లో రైల్వే లైన్ డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టులు, జార్ఖండ్ రాష్ట్రంలో రైల్వే విద్యుదీకరణ 100 శాతం లక్ష్యం పూర్తయ్యే ప్రాజెక్టు కూడా ఉన్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space

Media Coverage

How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM announces ex-gratia for the victims of Kasganj accident
February 24, 2024

The Prime Minister, Shri Narendra Modi has announced ex-gratia for the victims of Kasganj accident. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000.

The Prime Minister Office posted on X :

"An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Kasganj. The injured would be given Rs. 50,000"