రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన బాధితుల కు పరిహారం చెల్లింపున కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
‘‘రాజస్థాన్ లోని నాగౌర్ లో ఓ ప్రమాద ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.
The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives due to the accident at Nagaur, Rajasthan. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) August 31, 2021


