షేర్ చేయండి
 
Comments
ఈశాన్య రాష్ట్రాల మండలి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సమావేశం నిర్వహణ
“లుక్ ఈస్ట్ విధానం” “యాక్ట్ ఈస్ట్”గా మార్చాలన్న పరిధి దాటి ఆలోచించిన ప్రభుత్వం; ఇప్పుడు తమ విధానం “యాక్ట్ ఈస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ యాక్ట్ ఫస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్” అని ప్రకటన
ఈశాన్యానికి 8 మూల స్తంభాలఫై చర్చించిన ప్రధానమంత్రి
ప్రాంతీయ స్వభావం, సంస్కృతీ, సామర్థ్యం ప్రదర్శించగలిగే అవకాశం జి-20 సమావేశాలు : ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం షిల్లాంగ్ లో ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఇసి) సమావేశంలో ప్రసంగించారు. 1972లో లాంఛనంగా ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రాల మండలి స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు.

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిలో ఎన్ఇసి పాత్రను కొనియాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఆజాదీ కా  అమృత్ మహోత్సవ్ కు సమాంతరంగా ఎన్ఇసి సమావేశం జరుగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు.  ఈశాన్యంలోని 8 రాష్ట్రాలను తాను తరచు అష్ట లక్ష్ములుగా అభివర్ణిస్తానన్న విషయం గుర్తు చేస్తూ ఇందుకు 8 మూల స్తంభాలు - శాంతి, శక్తి, పర్యాటకం, 5జి కనెక్టివిటీ, సంస్కృతి , ప్రకృతి వ్యవసాయం, క్రీడలు, సామర్థ్యం - ప్రభుత్వం పని చేయాలన్నారు.

ఆగ్నేయాసియా ముఖ ద్వారం అయిన ఈశాన్యం మొత్తం ప్రాంతీయాభివృద్ది కేంద్రంగా మారగల సామర్థ్యం కలిగి ఉన్నదని  ప్రధానమంత్రి అన్నారు.  ఈ  సామర్థ్యాన్ని సంపూర్ణంగా వెలుగులోకి తెచ్చే దిశగా భారత-మయన్మార్-థాయిలాండ్ త్రైపాక్షిక హై వే, అగర్తల-అకౌరా రైల్ ప్రాజెక్ట్ వంటి ప్రోజెక్టుల పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. “లుక్ ఈస్ట్” విధానాన్ని “యాక్ట్ ఈస్ట్” గా మార్చటాన్ని దాటి ప్రభుత్వం కృషి చేసిందని, ఇప్పుడు తమ విధానం “యాక్ట్ ఈస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్” అని ప్రధానమంత్రి వివరించారు. ఈశాన్యంలో చేపట్టిన శాంతి చర్యలు విజయ వంతం కావడం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇప్పటికి ఎన్నో శాంతి ఒప్పందాలఫై సంతకాలు జరిగాయని, అంతర్ రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కూడా జరిగాయని చెప్పారు. తీవ్రవాద సంఘటనలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు.

నెట్ జీరో కు భారతదేశం కట్టుబాటు గురించి మాట్లాడుతూ ఈశాన్యం హైడ్రో విద్యుత్తు మూల స్థానంగా మారగల సామర్థ్యం కలిగి ఉన్నదని చెప్పారు. ఈ చొరవతో ఈశాన్య రాష్ట్రాలు విద్యుత్ మిగులు రాష్ట్రాలుగా మారతాయని, దీని వాళ్ళ పరిశ్రమల విస్తరణ, భారీగా  ఉపాధి కల్పనకు సహాయం అందించినట్టు అవుతుందని అన్నారు.

ఈ ప్రాంతానికి గల పర్యాటక సామర్థ్యం గురుంచి ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలోని సంస్కృతి, ప్రకృతి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో కూడా పర్యాటకం సర్కూట్లు గుర్తించి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. 100 విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఈశాన్యానికి పంపే విషయం కూడా అయన చర్చించారు.  దీని వల్ల విభిన్న ప్రాంతాల ప్రజలు సన్నిహితం అవుతారన్నారు. విద్యార్థులు ప్రాంతీయ దౌత్యవేత్తలు కాగలుగుతారని చెప్పారు.

కనెక్టివిటీని పెంచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఐకానిక్ బ్రిడ్జి ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతున్నాయని చెప్పారు.  గత 8 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో విమానాశ్రయాల సంఖ్య 9 నుంచి 16కి పెరిగిందని, విమానాల సంఖ్య 2014లో 900 కాగా ఇప్పుడు 1900కి పెరిగిందని తెలిపారు.  పలు ఈశాన్య రాష్ట్రాలు తొలి సారి రైల్వే మ్యాప్ లో చేరాయన్నారు. అలాగే జల మార్గాలు కూడా పెంచే కృషి జరుగుతున్నదని తెలిపారు.  2014 తర్వాత ఈశాన్యంలో జాతీయ రహదారుల సంఖ్య 50% పెరిగిందని చెప్పారు. పిఎం డివైన్ పథకం ప్రారంభంతో  ఈశాన్యంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగం అందుకున్నాయన్నారు.  ఈశాన్యంలో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ విస్తరించడం ద్వారా డిజిటల్ కనెక్టివిటీ మెరుగు పరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.  ఆత్మనిర్భర్ 5జి నెట్ వర్క్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ 5జితో స్టార్ట్ అప్ వ్యవస్థ, సేవారంగం మరింతగా  అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈశాన్య ప్రాంతాన్ని ఆర్థికాభివృద్ధి కేంద్రంగానే కాదు సాంస్కృతిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

ఈశాన్య ప్రాంతానికి గల వ్యవసాయ సామర్థ్యం గురించి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉన్నాడని చెప్పారు.  కృషి ఉడాన్ ద్వారా ఈశాన్యంలోని రైతులు తమ ఉత్పత్తులను దేశంలోనే అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు పంపగలుగుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు ప్రస్తుతం అమలు జరుగుతున్న వంట నూనెల ఉత్పత్తి కార్యక్రమంలోను ప్రత్యేకించి పామాయిల్ మిషన్ లోను పాల్గొనాలని అయన విజ్ఞప్తి చేశారు. రైతులు భౌగోళిక సవాళ్ళను అధిగమించేందుకు, వారి ఉత్పత్తులు మార్కెట్లకు చేరేందుకు డ్రోన్లు ఎలా ఉపయోగపడుతున్నాయో  కూడా అయన ప్రస్తావించారు.

క్రీడా రంగానికి ఈ ప్రాంతం అందిస్తున్న సేవల గురించి మాట్లాడుతూ ఈశాన్యంలో తొలి  క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.  ఈ ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో 200 పైగా ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెబుతూ టాప్స్ స్కీం ద్వారా ఈశాన్యానికి చెందిన అథ్లెట్లు ఏంటో ప్రయోజనం పొందుతారన్నారు

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development

Media Coverage

Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2023
March 26, 2023
షేర్ చేయండి
 
Comments

PM Modi Inspires and Motivates the Nation with The 99 th episode of Mann Ki Baat

During the launch of LVM3M3, people were encouraged by PM Modi's visionary thinking