‘‘ఒకప్రక్కన మనం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం, మరో ప్రక్కన ప్లాస్టిక్వ్యర్థాల శుద్ధి ని తప్పనిసరి చేయడం జరిగింది’’
‘‘21వశతాబ్ది లో భారతదేశం జలవాయు పరివర్తన మరియు పర్యావరణ పరిరక్షణ ల కోసం చాలాస్పష్టమైనటువంటి మార్గసూచి తో ముందుకు సాగిపోతోంది’’
‘‘గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం లో చిత్తడి నేలల సంఖ్య మరియు రామ్ సర్ స్థలాలు అంత క్రితం తో పోలిస్తే, దాదాపు గా మూడు రెట్లు వృద్ధి చెందాయి’’
‘‘ప్రపంచం లో శీతోష్ణ స్థితి ని పరిరక్షించడం కోసం ప్రతి దేశం స్వార్థ ప్రయోజనాల కు మించిన ఆలోచనలు చేయాలి’’
‘‘భారతదేశం యొక్క వేల సంవత్సరాల సంస్కృతి లో ప్రకృతి కి తోడు ప్రగతి కూడా ఉంది’’
‘‘ప్రపంచంలో మార్పు కోసం మీ యొక్క స్వభావం లో మార్పును తీసుకు రావాలి అనేదే మిశన్ లైఫ్యొక్క మౌలిక సూత్రం గా ఉంది’’
‘‘జలవాయుపరివర్తన సంబంధి చైతన్యం ఒక్క భారతదేశాని కి పరిమితం అయినది కాదు, ఈకార్యక్రమాని కి ప్రపంచవ్యాప్తం గా సమర్థన అనేది అంతకంతకు పెరుగుతోంది’’
‘‘రాబోయే కాలాల్లో పర్యావరణానికి ఒక బలమైన కవచం గా మిశన్ లైఫ్ లో భాగం గా చేపట్టే ప్రతి చర్య నిరూపణ అవుతుంది’’

ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రపంచం లోని ప్రతి ఒక్క దేశాని కి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం పర్యావరణ దినం యొక్క ఇతివృత్తం అయినటువంటి ‘సింగిల్-యూజ్ ప్లాస్టిక్’ కు స్వస్తి పలకడం కోసం ప్రచార ఉద్యమం ను గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, భారతదేశం గడచిన 4-5 సంవత్సరాలు గా ఈ దిశ లో నిరంతరం శ్రమిస్తోంది అంటూ తన సంతోషాన్ని ప్రకటించారు. 2018 లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలకడాని కి భారతదేశం రెండు స్థాయి ల్లో పని చేయడం ప్రారంభించిందని శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ‘‘ఒక ప్రక్కన మేము సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించాము, మరో ప్రక్కన ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి ని తప్పనిసరి చేశాం’’ అని ఆయన అన్నారు. దీని వల్ల భారతదేశం లో ఇంచుమించుగా 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ యొక్క నిర్భంద రీ సైక్లింగ్ చోటు చేసుకొంది. ఇది భారతదేశం లో ఏటా పోగు పడే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల లో 75 శాతాని కి సమానం గా ఉంది. అంతేకాకుండా, నిర్మాణదారు సంస్థ లు దిగుమతిదారు సంస్థ లు మరియు బ్రాండులు కలుపుకొని దాదాపు గా 10 వేల సంస్థలు దీని పరిధి లోకి చేరాయి అని ఆయన వివరించారు.

 

21వ శతాబ్దం లో భారతదేశం జలవాయు పరివర్తన మరియు పర్యావరణ పరిరక్షణ ల కోసం చాలా స్పష్టమైన మార్గసూచి తో ముందంజ వేస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం ప్రస్తుత అవసరాలు మరియు భావి దృక్కోణం ల మధ్య ఒక సమతుల్యత ను ఏర్పరచింది అని ప్రధాన మంత్రి చెప్తూ, రాబోయే కాలం లో శక్తి అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ప్రధానమైన చర్యల ను తీసుకొంటూ, అదే సమయం లో నిరుపేదల కోసం అవసరమైన సహాయాన్ని సమకూర్చడమైంది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘గత తొమ్మిది సంవత్సరాల లో గ్రీన్ ఎనర్జీ, ఇంకా స్వచ్ఛమైన శక్తి.. ఈ రెండు అంశాల పై భారతదేశం ఇది వరకు ఎన్నడూ లేనంతగా శ్రద్ధ ను తీసుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సౌరశక్తి మరియు ఎల్ఇడి బల్బులు ప్రజల కు డబ్బు ను ఆదా చేసుకోవడం లో తోడ్పడ్డాయి. అంతేకాదు, పర్యావరణాన్ని పరిరక్షించే దిశ లో ఈ చర్యలు వాటి వంతు తోడ్పాటును అందించాయి అని ఆయన ఉదాహరణలు గా ప్రస్తావించారు. ప్రపంచం లో తలెత్తిన మహమ్మారి వేళ భారతదేశం వహించిన నాయకత్వాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మిశన్ గ్రీన్ హైడ్రోజన్ ను భారతదేశం మొదలు పెట్టింది, నేల ను, నీటి ని, రసాయనిక ఎరువుల బారి నుండి రక్షించడం కోసం ప్రాకృతిక వ్యవసాయం దిశ లో ప్రధానమైన చర్యల ను చేపట్టింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

 

‘‘గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం లో చిత్తడి నేలల సంఖ్య మరియు రామ్ సర్ స్థలాల సంఖ్య అంత క్రితం తో పోలిస్తే దాదాపు గా మూడు రెట్లు వృద్ధి చెందింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న మరో రెండు పథకాల ను ప్రవేశపెట్టడమైంది. ఈ పథకాలు గ్రీన్ ఫ్యూచర్, గ్రీన్ ఇకానమి ల తాలూకు ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోతాయి అని ఆయన అన్నారు. ఈ రోజు న ప్రారంభించిన ‘అమృత్ ధరోహర్ యోజన’ ప్రజల భాగస్వామ్యం ద్వారా ఈ రామ్ సర్ స్థలాల సంరక్షణ కు పూచీ పడుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. భవిష్యత్తు లో ఈ రామ్ సర్ స్థలాలు ఇకో-టూరిజమ్ కు కేంద్రాలు గా నిలుస్తాయి, మరి వేల కొద్దీ ప్రజల కు గ్రీన్ జాబ్స్ తాలూకు ఒక వనరు గా కూడా మారుతాయి అని ప్రధాన మంత్రి వివరించారు. రెండో పథకం ‘మిష్టీ యోజన’ అని ఆయన వెల్లడించారు. ఈ పథకం దేశం లో మేన్ గ్రోవ్ ఇకో సిస్టమ్ ను పరిరక్షించడం తో పాటు, దాని మనుగడ కు సాయపడుతుంది అని ఆయన అన్నారు. దీనితో దేశం లోని తొమ్మిది రాష్ట్రాల లో మడ అడవుల విస్తృతి ని పునరుద్ధరించడం జరుగుతుంది, అంతేకాకుండా, సముద్ర మట్టాలు పెరగడం, తుపానుల వంటి విపత్తుల బారి నుండి సముద్ర తీర ప్రాంతాల లో నివశించే ప్రజల కు మరియు వారి బ్రతుకు తెరువుల కు ఎదురయ్యే ముప్పు ను తగ్గించడం లో ఈ పథకం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

 

ప్రపంచం లో శీతోష్ణ స్థితి ని పరిరక్షించడం కోసం ప్రతి దేశం స్వార్థ ప్రయోజనల ను మించి ఆలోచనల ను చేయవలసి ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. తమ దేశాన్ని అభివృద్ధి పరచుకొనే ఆలోచన, దానితో బాటే పర్యావరణాన్ని గురించి ఆందోళన చెందడం అనే కోవ కు చెందిన అభివృద్ధి చాలా కాలం పాటు ప్రపంచం లోని పెద్ద మరియు ఆధునిక దేశాల లో ఉంటూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి దేశాలు అభివృద్ధి సంబంధి లక్ష్యాల ను సాధించినప్పటికీ, అందుకు యావత్తు ప్రపంచం లోని పర్యావరణం మూల్యాన్ని చెల్లించింది అని ఆయన అన్నారు. ఈ రోజు కు కూడా ను ప్రపంచం లోని అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల యొక్క లోపభూయిష్టమైన విధానాల వల్ల యాతనలు పడుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అభివృద్ధి చెందిన కొన్ని దేశాల ఈ రకమైన ధోరణి ని నిలువరించేందుకు దశాబ్దులు గా ఏ దేశం ముందుకు రాలేదని’’ ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ప్రతి ఒక్క దేశం ముందు క్లయిమేట్ జస్టిస్ అంశాన్ని భారతదేశం లేవనెత్తిందని ఆయన చెప్పారు.

 

‘‘భారతదేశం యొక్క వేల సంవత్సరాల ప్రాచీన సంస్కృతి లో పకృతి తో పాటు ప్రగతి కి స్థానం దక్కింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పర్యావరణాని కి మరియు ఆర్థిక వ్యవస్థ కు తగిన ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చిన పరిణామానికే ఈ ఖ్యాతి అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం తన మౌలిక సదుపాయాల కల్పన పట్ల మునుపు ఎన్నడూ ఎరుగని విధం గా పెట్టుబడులు పెడుతున్న క్రమం లో అది పర్యావరణం పైన సైతం సమానం గా శ్రద్ధ వహిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణం లకు ఊతాన్ని అందించేటటువంటి పోలికల ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, దేశం లో 4జి మరియు 5జి కనెక్టివిటీ పరిధి ని విస్తరిస్తూనే, అటవీ ప్రాంతాల పరిధి ని పెంచడం జరిగింది అని వెల్లడించారు. భారతదేశం పేదల కోసం 4 కోట్ల గృహాల ను నిర్మించింది, అయితే అదే కాలం లో దేశం లో అభయారణ్యాలు మరియు వన్యప్రాణుల సంఖ్య రికార్డు స్థాయి లో అధికం అయింది అని ఆయన చెప్పారు. జల్ జీవన్ అభియాన్ ను గురించి మరియు జల భద్రత కోసం ఉద్దేశించిన 50,000 అమృత్ సరోవర్ ల నిర్మాణాన్ని గురించి, భారతదేశం ప్రపంచం లోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదగడాన్ని గురించి, అంతేకాకుండా, నవీకరణయోగ్య శక్తి రంగం లో అగ్రగామి అయిదు దేశాల సరసన నిలవడాన్ని గురించి, భారతదేశం యొక్క వ్యావసాయిక ఎగుమతులు వృద్ధి చెందుతూ ఉండడాన్ని గురించి, అలాగే పెట్రోల్ లో 20 ఇథనాల్ ను కలిపేందుకు ఒక ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడం గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. భారతదేశం ‘కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ - సిడి ఆర్ఐ మరియు ఇంటర్ నేశనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ల వంటి సంస్థల కు నిలయం గా మారింది అని కూడా ఆయన తెలిపారు.

 

లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ –ఎల్ఐఎఫ్‌ఇ (‘లైఫ్‌’) ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ఒక ప్రజాందోళన గా రూపుదాల్చిందని, జలవాయు పరివర్తన తో పోరాడటం కోసం జీవన శైలి లో మార్పుల ను అనుసరించడాని కి సంబంధించిన ఒక సరిక్రొత్త చైతన్యాన్ని వ్యాప్తి చేయడమే ఈ మిశన్ అని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. కిందటి సంవత్సరం గుజరాత్ లోని కేవడియా-ఏక్ తా నగర్ లో ఈ మిశన్ ను ప్రారంభించినప్పుడు ప్రజల లో ఆసక్తి రేకెత్తింది, అయితే ఒక నెల రోజుల క్రితమే మిశన్ లైఫ్ కు సంబంధించిన ప్రచార ఉద్యమం ఆరంభం అయింది, దీని లో భాగం గా 2 కోట్ల మంది ప్రజానీకం ఈ మిశన్ లో 30 రోజుల కన్నా తక్కువ వ్యవధి లో భాగం పంచుకొన్నారు అని ఆయన వివరించారు. ‘గివింగ్ లైఫ్ టు మై స్కీమ్’ అనే భావన తో ర్యాలీలు, క్విజ్ పోటీల ను నిర్వహిస్తున్న సంగతి ని ఆయన వెల్లడించారు. ‘‘లక్షల కొద్దీ సహచరులు వారి యొక్క నిత్య జీవనం లో భాగం గా రెడ్యూస్, రీయూజ్ రీ సైకిల్.. మంత్రాన్ని ఆచరిస్తున్నారని’’ ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లో మార్పును తీసుకు రావడం కోసం ఒక వ్యక్తి తన స్వభావం లో మార్పును తీసుకొని రావడం అనేదే మిశన్ లైఫ్ యొక్క మూల సూత్రం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘మిశన్ లైఫ్ అనేది యావత్తు మానవ జాతి కి ఉజ్వలమైన భవిష్యత్తు, మన భావి తరాల వారి కోసం ఉద్దేశించినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘జలవాయు పరివర్తన దిశ లో చైతన్యం అనేది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు, ఈ కార్యక్రమాని కి ప్రపంచవ్యాప్తం గా సమర్థన నానాటికీ అధికం అవుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కిందటి సంవత్సరం లో పర్యావరణ దినం సందర్భం లో ప్రపంచ సముదాయాని కి ఒక అభ్యర్థన ను చేసిన విషయాన్ని ఆయన గుర్తు కు తెచ్చుకొంటూ, అప్పట్లో వ్యక్తుల లోను, సముదాయాల లోను శీతోష్ణస్థితి కి అనుకూలమైనటువంటి ప్రవర్తన పూర్వక పరివర్తన ను తీసుకు రావడం కోసం వినూత్నమైనటువంటి పరిష్కార మార్గాల తో ముందుకు రావాల్సింది గా తాను విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇంచుమించు 70 దేశాల నుండి వేల కొద్దీ సహచరులు వారి వారి ఆలోచనల ను వెల్లడి చేశారని, అవి ఆచరణాత్మకం గా ఉన్నాయని చెబుతూ, ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయాల ను వెల్లడించిన వారి లో విద్యార్థులు, పరిశోధకులు, వేరు వేరు రంగాల నిపుణులు, వృత్తి నిపుణులు, ఎన్ జిఒ లు మరియు సామాన్య పౌరులు ఉన్నారన్నారు. ఆయన వారి వారి ఆలోచనల ను వ్యక్తం చేసినందుకు గాను పురస్కారాల ను అందుకొన్న వారి కి తన అభినందనల ను సైతం వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, మిశన్ లైఫ్ దిశ లో వేసేటటువంటి ప్రతి ఒక్క అడుగు రాబోయే కాలాల్లో పర్యావరణాని కి దృఢతరమైన కవచం గా మారుతుందన్నారు. థాట్ లీడర్ శిప్ ఫార్ లైఫ్ పేరు తో ఒక సంకలనాన్ని కూడా ఈ రోజు న ఆవిష్కరించడమైంది అని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి తో సామరస్య పూర్వకమైనటువంటి వృద్ధి ని సాధించాలన్న సంకల్పాన్ని ఈ తరహా ప్రయాసలు మరింత గా బలపరచగలవన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వెలిబుచ్చారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of collective effort
December 17, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”

The Sanskrit Subhashitam conveys that even small things, when brought together in a well-planned manner, can accomplish great tasks, and that a rope made of hay sticks can even entangle powerful elephants.

The Prime Minister wrote on X;

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”