తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో ఉన్న ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోయినట్లు తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్కి తాలూకు దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘విరుధునగర్ జిల్లా లో గల ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో జరిగిన దుర్ఘటన ను గురించి తెలిసింది. అది చాలా దు:ఖదాయకమైనటువంటి సమాచారం. ఈ కఠిన సమయం లో విషాదభరితం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క ప్రియతముల కు కలిగినటువంటి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగాను మరియు పూర్తిగాను కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.

 

మృతి చెందిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future