ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం జనవరి 30 వ తేదీ నాడు గుజరాత్ లోని సూరత్ ను మరియు దండి ని సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి తన పర్యటన కాలం లో సూరత్ విమానాశ్రయ టర్మినల్ భవనం విస్తరణ కు పునాది రాయి ని వేయనున్నారు. టర్మినల్ భవనాన్ని 354 కోట్ల రూపాయల వ్యయం తో 25,500 చదరపు మీటర్ల విస్తీర్ణం లో నిర్మిస్తున్నారు. ఇది సౌర శక్తి ని వినియోగించుకొంటూ ఎల్ఇడి దీపాల ను కలిగి వుండే పర్యావరణ హితకరమైన భవనం గా రూపుదిద్దుకొంటుంది. ఒకసారి దీని నిర్మాణం పూర్తి అయిందంటే గనక 18 వందల మంది కి పైగా ప్రయాణికుల రాకపోక లకు అనువైందిగా ఇది రూపుదిద్దుకోనుంది. విమానాల కదలిక లు మరియు ప్రయాణికుల రాక పోక లను బట్టి చూస్తే అహమదాబాద్, వడోదరా ల తరువాత గుజరాత్ లో లో అత్యంత రద్దీ గా ఉండగల మూడో విమానాశ్రయం గా సూరత్ విమానాశ్రయం ఉంటుంది.
అభివృద్ధి కై మౌలిక సదుపాయాలను విస్తరించడం ప్రభుత్వ ప్రాధాన్యాల లో ఒకటి గా ఉంటూ వచ్చింది. వివిధ రంగా లలో అనేక కార్యక్రమాల ను చేపట్టడం జరుగగా, మరి ఆ రంగాల లో విమానయాన రంగం కూడా ఒక రంగం గా ఉంది. గుజరాత్ లో పౌర విమానయాన రంగ సంబంధ మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయడం తో పాటు గగనతల సంధానాన్ని కూడా పెంపొందించడమైంది. ఈ పథకాల లో- యుడిఎఎన్ (‘ఉడాన్’) పథకం లో భాగంగా కాండ్లా ను ముంబయి తో, పోర్‌బందర్ ను అహమదాబాద్ తో మరియు ముంబయి తో సంధానించడం కూడా కలసి వుంది. రాజ్‌కోట్ లోని హీరాసర్ లో నూతన విమానాశ్రయం అభివృద్ధి, అహమదాబాద్ లో మరియు వడోదరా లో నూతన ఎటిసి టవర్/ టెక్నికల్ బ్లాక్ అభివృద్ధి వంటివి సైతం వీటి లో కొన్ని.
ప్రధాన మంత్రి సూరత్ లో న్యూ ఇండియా యూత్ కాంక్లేవ్ లో భాగంగా యువతీ యువకుల తో ముఖాముఖి సంభాషించనున్నారు. అలాగే, శ్రీమతి రసీలా బెన్ సెవంతిలాల్ శాహ్ వీనస్ హాస్పిటల్ ను కూడా ఆయన ప్రారంభించనున్నారు; అక్కడి సదుపాయాల ను ఆయన చూస్తారు.
గుజరాత్ లోని నవ్‌సారీ జిల్లా లో గల దండి ప్రధాన మంత్రి తదుపరి గమ్య స్థానం కానుంది. అక్కడ, బాపు వర్థంతి ని పురస్కరించుకొని జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ స్మారకం లో మహాత్మ గాంధీ మరియు చారిత్రక దండి ఉప్పు సత్యాగ్రహం లో ఆయన తో కలసి యాత్ర లో పాలుపంచుకొన్న 80 మంది సత్యాగ్రహీ ల యొక్క విగ్రహాల ను అమర్చడమైంది. చరిత్రాత్మకమైన 1930 నాటి సాల్ట్ మార్చ్ తాలూకు వివిధ ఘట్టాల ను మరియు గాథ లను వర్ణించే 24 కుడ్య చిత్రాలు కూడా ఈ స్మారకం లో ఉన్నాయి. ఈ స్మారకం గుండా ప్రధాన మంత్రి నడుస్తారు. ఒక జన సభ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
ఉప్పు సత్యాగ్రహ యాత్ర యే 1930వ సంవత్సరం లో జరిగిన దండి యాత్ర గా ప్రసిద్ధమైంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక చెప్పుకోదగిన ఘటన గా ఇది నిలచింది. ఈ రోజు నే, బ్రిటిషు పాలన కు వ్యతిరేకం గా జరిగిన శాసనోల్లంఘనోద్యమం లో భాగం గా మహాత్మ గాంధీ నాయకత్వం లో 80 మంది సత్యాగ్రహీ లు అహమదాబాద్ లోని సాబర్ మతీ ఆశ్రమం నుండి 241 మైళ్ళ దూరం లో గల కోస్తా తీర గ్రామమైన దండి కి నడచిపోయి బ్రిటిషు ప్రభుత్వ సాల్ట్ లా ను ఉల్లంఘించి సముద్ర జలం నుండి ఉప్పు ను తయారు చేశారు.
గుజరాత్ ను ఈ నెల లో ప్రధాన మంత్రి సందర్శించడం ఈ నెల లో ఇది రెండో సారి కానుంది. హజీరా లో ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను అంకితం చేయడం కోసం ప్రధాన మంత్రి ఇంతకు ముందు 2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ నాడు సూరత్ ను సందర్శించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో 2019 వ సంవత్సరం జనవరి 17 వ మరియు 18 వ తేదీ లలో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమిట్ కు ఆయన హాజరయ్యారు.


