ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, జులై 7 వ తేదీ నాడు రాజ‌స్థాన్ లోని జయ్ పుర్ ను సంద‌ర్శించ‌నున్నారు.  

భార‌త ప్ర‌భుత్వం మ‌రియు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం యొక్క 12 ప‌థ‌కాల ల‌బ్దిదారులు వారి అనుభ‌వాన్ని వెల్ల‌డిస్తున్నటువంటి దృశ్య‌, శ్ర‌వ‌ణ స‌మ‌ర్ప‌ణ‌ను ఒకదానిని ప్ర‌ధాన మంత్రి ఒక భారీ జ‌న స‌భ లో వీక్షించ‌నున్నారు.  రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తారు.

ఈ ప‌థ‌కాల‌లో :

*  ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వ‌ల యోజ‌న‌

*  ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న

*  ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న 

*  స్కిల్ ఇండియా 

*  రాష్ట్రీయ బాల‌ స్వాస్థ్య కార్య‌క్ర‌మ్‌

*  ముఖ్య‌మంత్రి రాజ్ శ్రీ యోజ‌న    

*  భామాశాహ్ స్వాస్థ్య బీమా యోజ‌న‌

*  ముఖ్య‌మంత్రి జ‌ల స్వావ‌లంబ‌న్ అభియాన్‌

*  శ్రామిక్ క‌ళ్యాణ్ కార్డ్ 

*  ముఖ్య‌మంత్రి పాల‌న్‌హార్ యోజ‌న‌

*  ఛాత్రా స్కూటీ విత‌ర‌ణ్ యోజ‌న, ఇంకా

*  దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ వ‌రిష్ఠ్  నాగ‌రిక్ తీర్థ్ యాత్రా యోజ‌న లు 

భాగంగా ఉంటాయి.

2100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి తో నిర్మిత‌మ‌య్యే 13 ప‌ట్ట‌ణ అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి పునాది రాయి ని వేస్తారు. ఈ ప‌థ‌కాల‌లో :  

*    పాత ఉద‌య్‌పుర్ కు చెందిన ఏకీకృత అవ‌స్థాప‌న ప్యాకేజి

*  అజ్ మేర్ కై ఉద్దేశించినటువంటి ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్టు తో పాటు

*  అజ్ మేర్, భీల్‌వాడా, బీకానేర్‌, హ‌నుమాన్‌గ‌ఢ్‌, సీక‌ర్ మ‌రియు మౌంట్ ఆబూ ల‌లో నీటి స‌ర‌ఫ‌రా మ‌రియు మురుగునీటి పారుదల ప్రాజెక్టులు 

*  ధౌల్‌ పుర్‌, నాగౌర్‌, అల్ వర్, ఇంకా జోధ్‌ పుర్ ల‌లో ఎస్‌టిపి ల న‌వీనీక‌ర‌ణ, 

*  ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (ప‌ట్ట‌ణ‌) ప‌థ‌కంలో భాగంగా బూందీ, అజ్ మేర్‌ మ‌రియు బీకానేర్ జిల్లా ల‌లో  చేప‌ట్టే ప్రాజెక్టులు

*  కోటా లో ద‌శ్ హరా మైదాన్ (రెండో ద‌శ‌) ప్రాజెక్టు లు ప్రముఖమైనవి.

అలాగే ఒక జ‌న స‌భను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు.

PM @narendramodi will visit Jaipur tomorrow. He will witness an audio-visual presentation of experience sharing by 12 beneficiaries of schemes of the Government of India and Government of Rajasthan. This will be moderated by CM @VasundharaBJP.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 జూలై 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond