"ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్" (ఐఐఎస్ఎఫ్)-2020 ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఆదివారం సాయంత్రం 4.30 గం.కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర మంత్రి శ్రీ హర్షవర్ధన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఐఎస్ఎఫ్ గురించి:
దేశంలో సాంకేతికత భావాలను ప్రోత్సహించడానికి; 'విజ్ఞాన భారతి'తో కలిసి, కేంద్ర శాస్త్ర&సాంకేతికత మంత్రిత్వ శాఖ, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఏఏఎస్ఎఫ్కు రూపకల్పన చేశాయి. శాస్త్ర, సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంతో దీనిని 2015లో ప్రారంభించారు. ప్రజా జీవనాన్ని సాంకేతికతతో ముడిపెట్టడానికి, విజ్ఞాన ఫలాలను అనుభవించడానికి, శాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) కలిసి సమస్యలను పరిష్కరించి జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుస్తాయో చూపడం ఈ కార్యక్రమ లక్ష్యం. శాస్త్రీయ విజ్ఞానం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కారం, బృంద కృషితో 21 శతాబ్దపు నైపుణ్యాలను వృద్ధి చేయడానికి యువతకు సాయపడడం ఈ ఏడాది నిర్వహిస్తున్న ఐఐఎస్ఎఫ్ లక్ష్యం. శాస్త్రీయ రంగాల్లో విద్యాభ్యాసం, సాధన దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం దీర్ఘకాలిక లక్ష్యం.


