రక్షణ రంగం లో దేశవాళీ పరిశోధక సామర్ధ్యాల కు ఊతం ఇచ్చే చర్యల లో భాగం గా, డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబొరేటరిస్ అయిదింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జనవరి 2వ తేదీ గురువారం నాడు దేశ ప్రజల కు అంకితమివ్వనున్నారు.
ఈ కార్యక్రమాన్ని బెంగళూరు లోని డిఆర్‌డిఒ లో గల ఏరోనాటికల్ డివెలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ లో ఏర్పాటు చేయడమైంది. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. శాస్త్రవేత్తల ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
డిఆర్‌డిఒ తన నూతన ఆవిష్కరణ సంబంధిత ఉత్పత్తుల ను కొన్నిటిని ఒక ప్రదర్శన ద్వారా ప్రధాన మంత్రి సమక్షం లో ప్రదర్శించనుంది.
కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప మరియు డిఆర్‌డిఒ చైర్ మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి లు ఈ కార్యక్రమాని కి హాజరు అవుతారు.
ప్రధాన మంత్రి 2014వ సంవత్సరం లో డిఫెన్స్ రిసర్చ్ ఎండ్ డివెలప్‌మెంట్ ఆర్గనైజేశన్ (డిఆర్‌డిఒ) పురస్కారాల ను ప్రదానం చేసిన తరువాత సీనియర్ డిఫెన్స్ సైటిస్టు లు మరియు ప్రముఖుల తో కూడిన సభ లో ప్రసంగిస్తూ, దేశం లో కనీసం అయిదు ల్యాబ్స్ ను డిఆర్ డిఒ ప్రత్యేకం గా నిర్మించాలని, ఆ ల్యాబ్స్ లో 35 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన యువ శాస్త్రవేత్త ల ద్వారా కొన్ని నూతన ఆవిష్కరణ లు జరగాలంటూ సూచన ను చేసిన సంగతి తెలిసిందే. రక్షణ పరిశోధక కార్యకలాపాల లో యువత పెద్ద ఎత్తున పాలు పంచుకోవాలని ప్రధాన మంత్రి ఆహ్వానం పలుకుతూ, అలాగ జరిగితే భారతదేశం ప్రపంచం లో రక్షణ రంగం లో చోటు చేసుకొంటూవుండే సాంకేతిక విజ్ఞాన పరమైన పురోగతి తో పాటు తాను కూడా అడుగులు కలుపుతూ పయనించే అవకాశం ఏర్పడుతుందని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.


