ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2021 జూన్‌ 5న నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా పాల్గొంటారు. ఈ ఏడాది “మెరుగైన పర్యావరణ కోసం జీవ ఇంధనాలకు ప్రోత్సాహం” ఇతివృత్తంగా కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

   ఈ కార్యక్రమంలో భాగంగా “భారతదేశంలో ఇథనాల్‌ సమ్మిశ్రమం కోసం మార్గ ప్రణాళిక 2020-2025పై నిపుణుల కమిటీ నివేదిక”ను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణ దిశగా ఇథనాల్‌ కలిపిన పెట్రోలు విక్రయించాల్సిందిగా చమురు కంపెనీలను ఆదేశిస్తూ ‘ఈ-20 నోటిఫికేషన్‌’ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ కలిపి విక్రయించాలని సూచించనుంది. అదేవిధంగా అధిక మోతాదులో ‘ఇ12, ఇ15’ ఇథనాల్‌ మిశ్రమానికి సంబంధించి ‘బీఐఎస్‌’ ప్రమాణాలను ప్రకటించనుంది. ఈ చర్యలతో ఇథనాల్ అదనపు డిస్టిల్లరీ సామర్థ్యంగల ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కలగడమేగాక దేశవ్యాప్తంగా మిశ్రమ ఇంధన లభ్యతకు నిర్ణీత వ్యవధి లభిస్తుంది. ఇథనాల్ ఉత్పాదక రాష్ట్రాలు, సమీప ప్రాంతాల్లో 2025కు ముందే ఇథనాల్ వినియోగం పెరగడానికి కూడా ఈ చర్యలు తోడ్పడతాయి.

   పుణే నగరంలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మక పథకం కింద ‘ఇ100’ ఇంధన విక్రయ స్టేషన్లను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. దీంతోపాటు ఇథనాల్ మిశ్రమ పెట్రోలు, పీడనసహిత బయోగ్యాస్ కార్యక్రమాల కింద మద్దతు పొందిన రైతుల తొలి అనుభవాలను వారినుంచి తెలుసుకునే దిశగా ప్రధాని వారితో ముచ్చటిస్తారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA

Media Coverage

India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 డిసెంబర్ 2025
December 09, 2025

Aatmanirbhar Bharat in Action: Innovation, Energy, Defence, Digital & Infrastructure, India Rising Under PM Modi