It is only partnerships that will get us to our goals: PM Modi
The health of mothers will determine the health of the children and the health of children will determine the health of our tomorrow: PM Modi
The India story is one of hope: PM Narendra Modi at Partners' Forum
We are committed to increasing India’s health spending to 2.5 percent of GDP by 2025: Prime Minister

వేదిక ను అలంకరించిన ప్ర‌ముఖులు,
దేశ విదేశాల‌ నుండి వ‌చ్చిన ప్ర‌తినిధులు,
మహిళలు మరియు సజ్జనులారా,

న‌మ‌స్తే, 

ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల‌ నుండి పార్ట్ నర్స్ ఫోరమ్, 2018కి  విచ్చేసిన వారందరికీ ఆత్మీయ స్వాగ‌తం.  భాగ‌స్వామ్యాలు మాత్ర‌మే మ‌న‌ల్ని మ‌న ల‌క్ష్యాల‌ వద్దకు చేర్చుతాయి.  పౌరుల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యాలు, సామాజిక వ‌ర్గాల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యాలు, దేశాల మ‌ధ్య‌ భాగస్వామ్యాలు.. మ‌న‌కు తెలుసు.  దీనికి ప్ర‌తిఫ‌లం గా సుస్థిర‌ అభివృద్ధి ప్ర‌ణాళిక అనేది మ‌న‌కు సిద్దిస్తుంది. 

ఏకాకి ప్ర‌య‌త్నాల‌ నుండి దేశాలు దూరం జ‌రిగాయి.  సామాజిక వ‌ర్గాల‌కు సాధికారిత ను కల్పించడానికి అవి నిబ‌ద్ద‌త‌ తో ప‌ని చేస్తున్నాయి.  త‌మ త‌మ దేశాల్లో ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని, విద్య‌ ను మెరుగుప‌రుస్తున్నాయి.  పేద‌రికాన్ని అణ‌చివేసి, ఆర్ధిక అభివృద్ధి ని ర‌గిలిస్తూ, బ‌లోపేతం చేస్తూ ప్రతి ఒక్క‌రికీ మేలు చేయ‌డానికి కృషి చేస్తున్నాయి.  మాతృమూర్తుల ఆరోగ్యం వారి చిన్నారుల ఆరోగ్యాన్ని నిర్ణ‌యిస్తుంది.  చిన్నపిల్లల ఆరోగ్యం దేశ భ‌విష్య‌త్తు ను నిర్ణ‌యిస్తుంది.  మాతృమూర్తుల, వారి చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి ఏం చేయాలో ఆలోచించి, మార్గాలు త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాం.  ఈ రోజున మ‌న చ‌ర్చ‌ల వ‌ల్ల వెలువ‌డే ఫ‌లితాలు మ‌న భ‌విష్య‌త్తు పై అత్య‌ధిక ప్ర‌భావాన్ని చూపుతాయి.

పార్ట్ నర్స్ ఫోరమ్ దార్శ‌నిక‌త అనేది భార‌త‌దేశ పురాత‌న తాత్విక‌తైన ‘‘వ‌సుధైక కుటుంబకమ్’’ లాగే వుంది.  వ‌సుధైక కుటుంబకమ్ అంటే ప్ర‌పంచ‌ం అంతా ఓ కుటుంబం లాంటిది అని అర్థం.  అంతే కాదు ఈ దార్శ‌నిక‌త అనేది మా ప్ర‌భుత్వ తాత్వికత అయిన‌ ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌’ను ప్ర‌తిబింబిస్తోంది. అంద‌రూ క‌లసి కృషి చేస్తే, భాగ‌స్వామ్యాలు ఏర్ప‌రుచుకుంటే అంద‌రినీ క‌లుపుకు పోగ‌లిగే వృద్ధి ని సాధించ‌డం జ‌రుగుతుంది.

మాతృమూర్తుల‌, న‌వ‌జాత శిశువుల‌, చిన్నారుల ఆరోగ్యం కోసం పార్ట్ నర్స్ ఫోరమ్ అనేది ఒక వినూత్న‌, ప్ర‌తిభావంత‌ వేదిక‌.  ఒక్క స‌రి అయిన ఆరోగ్యం కోసమే మ‌నం ఇక్క‌డ చ‌ర్చ‌లు జరపడం లేదు.  వేగం గా వృద్ధిని సాధించడానికి సైతం మ‌నం ఇక్క‌డ వాద‌న‌లను వినిపిస్తున్నాం.  వృద్ధి ని శీఘ్రం గా  సాధించ‌డానికి గ‌ల నూత‌న మార్గాల‌ కోసం ప్ర‌పంచం వెదకుతోంది.  కాబ‌ట్టి మ‌హిళ‌లు ఆరోగ్యంగా వుండేలా చూడ‌డ‌మ‌నేది కూడా ఆ మార్గాల్లో ఒక ఉత్త‌మ‌మైన మార్గం.  గ‌త కొన్ని సంవ‌త్స‌రాల్లో మ‌నం చాలా ప్ర‌గ‌తి ని సాధించ‌గ‌లిగాం.. చేయాల్సింది ఇంకా ఎంతో వుంది.  భారీ బ‌డ్జెటుల నుండి ఉత్త‌మ ఫ‌లితాల‌ వ‌ర‌కు, ఆలోచ‌న విధానం లో మార్పు నుండి ప‌ర్య‌వేక్ష‌ణ వ‌ర‌కు చేయవలసింది చాలా ఉంది. 
భార‌త‌దేశం గాథ ఆశాజ‌న‌కం గా ఉంది.  ఎదుర‌వుతున్న అడ్డంకుల‌ను అధిగమించగ‌ల‌మ‌నే ధీమా మ‌న‌కు ఉంది.  వ్య‌వ‌హార శైలి లో మార్పు తెచ్చుకోగ‌లం.  శీఘ్ర‌ గ‌తి న ప్ర‌గ‌తి ని సాధించ‌వ‌చ్చ‌నే ఆశాభావం మ‌న‌లో దండిగా ఉంది.

స‌హ‌స్రాబ్ది అభివృద్ధి ల‌క్ష్యాల‌ను రూపొందించుకున్న స‌మ‌యం లో భార‌త‌దేశం లో మ‌హిళ‌లు, చిన్నారుల మ‌ర‌ణాల రేటు అధికంగా ఉండేది.  ఈ రేటు ను త‌గ్గించ‌డానికి గాను చేసిన స్థిర‌మైన య‌త్నాల కార‌ణం గా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు గా మ‌ర‌ణాల రేటు వేగం గా త‌గ్గ‌డం తో ఎస్ డిజి ల‌క్ష్యాల‌ను అందుకునే దిశ‌ గా భార‌త‌దేశం ప్ర‌యాణిస్తోంది.  మాతృమూర్తుల‌, చిన్నారుల ఆరోగ్యం విష‌యం లో 2030వ సంవత్సరం కల్లా సాధించాలని పెట్టుకున్న ల‌క్ష్యాల‌ను ఇంకా ముందే సాధించగ‌లం. 

యుక్త‌వ‌య‌స్సు లోని వారి ని దృష్టి లో పెట్టుకొని ప‌ని చేస్తున్న దేశాల్లో భార‌త‌దేశం ముందు వ‌రుస‌ లో ఉంది.  యుక్త‌వ‌య‌స్సు లోని వారి కోసం విస్తృత‌మైన ఆరోగ్య కార్య‌క్ర‌మాలను, రోగ నివార‌ణ కార్య‌క్ర‌మాల‌ను మ‌న దేశం అమ‌లు చేస్తోంది.  ఈ కృషి కార‌ణం గా 2015వ సంవత్సరం లో ఆమోదించిన మ‌హిళ‌ల‌, చిన్నారుల‌, యుక్త‌వ‌య‌స్సు వారి ఆరోగ్య వ్యూహం లో మ‌న యువ‌త‌కు స‌రైన‌ గుర్తింపు ల‌భించింది.

ఈ స‌ద‌స్సు లో భాగంగా లాటిన్ అమెరికా, క‌రీబియ‌న్ ప్రాంతం, భార‌త‌దేశం తాము అనుస‌రిస్తున్న అంత‌ర్జాతీయ వ్యూహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ విష‌యం తెలిసింది.  నాకు సంతోషంగా ఉంది.  ఈ వ్యూహాలు ఇత‌ర దేశాల‌కు, ప్రాంతాల‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటాయని, ఇలాంటి వ్యూహాల‌ను ముందు ముందు త‌యారు చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నేను భావిస్తున్నాను. 

మిత్రులారా,

‘య‌త్ర నార్య‌స్తు పూజ్యంతే ర‌మంతే త‌త్ర దేవ‌తా’ అని మ‌న పురాణాల్లో ఉంది.  ఎక్క‌డైతే స్త్రీల‌కు గౌర‌వం ల‌భిస్తుందో అక్క‌డ దైవత్వం విల‌సిల్లుతుంద‌ని దీని భావం.  ఏ దేశ‌మైనా ప్ర‌గ‌తి ని సాధించాలంటే ఆ దేశం లోని పౌరులు విద్యావంతులు అయి వుండాలి.  ముఖ్యం గా మ‌హిళ‌లు, చిన్నారులు చ‌దువుకోవాలి.  వారు స్వేచ్ఛ‌ గా జీవిస్తూ, సాధికారిత కలవారై, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని సాగించాలి. 
భార‌త‌దేశ టీకా కార్య‌క్రమం నాకు ఎంతో ఇష్ట‌మైన అంశం.  ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ స‌ద‌స్సు లో విజ‌య‌వంత‌మైన గాథ గా తీసుకోవ‌డం నాకు ఎంతో సంతోషం గా ఉంది.  గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో మిశన్ ఇంధ్ర‌ధ‌నుష్ లో భాగం గా 32.8 మిలియ‌న్ చిన్నారుల‌కు, 8.4 మిలియ‌న్ గ‌ర్భిణీల‌కు సేవ‌లు అందించ‌డం జ‌రిగింది.  సార్వ‌త్రిక టీకా కార్య‌క్ర‌మం లో ఇచ్చే టీకా ల‌ను 7నుండి 12కు పెంచ‌డమైంది.  ప్రాణాంత‌కంగా ప‌రిణ‌మించిన న్యుమోనియా, డ‌యేరియా లాంటి వ్యాధుల‌ను నివారించే టీకాల‌ను కూడా ఇవ్వ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా, 

2014వ సంవత్సరం లో మా ప్ర‌భుత్వం పాల‌న ప‌గ్గాల‌ను చేప‌ట్టే స‌మ‌యానికి ప్ర‌స‌వ స‌మ‌యం లో మ‌ర‌ణించే మాతృమూర్తుల సంఖ్య ప్ర‌తి ఏడాది 44 వేల‌ కంటే ఎక్కువ‌గా ఉండేది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో గ‌ర్భిణీల‌కు విశిష్ట‌మైన ఆరోగ్య సేవ‌ల‌ను అందించ‌డానికి గాను ప్ర‌ధాన మంత్రి సుర‌క్షిత్ మాతృత్వ అభియాన్ ను ప్రారంభించాం.  ఈ భారీ కార్య‌క్ర‌మం లో త‌మ వంతుగా పాల్గొనాల‌ని ప్ర‌తి వైద్యుడు ప్ర‌తి నెలా ఒక రోజు సేవ‌లను అందించాల‌ని మా ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది.  ఈ ఉద్య‌మం లో భాగం గా గ‌ర్భిణీల‌కు16 మిలియ‌న్ ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ను  చేయ‌డం జ‌రిగింది.

ఈ దేశంలో 25 మిలియ‌న్ న‌వ‌జాత శిశువులు ఉన్నారు.  అప్పుడే పుట్టిన శిశువుల‌కు ఆరోగ్య భ‌ద్రత కై బ‌ల‌మైన సౌక‌ర్యాలు గ‌ల వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉంది.  న‌వ‌జాత శిశువుల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేలా ఒక మిలియ‌న్‌ కు పైగా న‌వ‌జాత శిశువుల‌కు 794 ఆధునిక ఆరోగ్య యూనిట్ ల ద్వారా ఈ నమూనా విజ‌య‌వంతం గా సేవ‌లను అందిస్తోంది.  నాలుగేళ్ల క్రితం ప‌రిస్థితి తో పోల్చి చూద్దాం..  మా ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల కార‌ణంగా 5 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌ను తీసుకుంటే వీరి లో ప్ర‌తి రోజూ 840 మంది ని అద‌నం గా ర‌క్షించ‌డం జ‌రుగుతోంది.
 
చిన్నారుల పోష‌ణ అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి పోష‌ణ్ అభియాన్ ను ప్రారంభించాం.  ప‌లు ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను, చ‌ర్య‌ల‌ను ఒక చోటు కు తీసుకు వచ్చి అంద‌రి ఉమ్మ‌డి ల‌క్ష్య‌మైన పోష‌కాహార లేమి ర‌హిత దేశం కోసం ప‌ని చేయ‌డం జ‌రుగుతోంది.  చిన్నారులకు నాణ్య‌మైన జీవితాన్ని అందివ్వ‌డానికి రాష్ట్రీయ బాల్ స్వ‌ాస్థ్య కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం.  దీని ద్వారా ఈ నాలుగేళ్ల‌ లో 800 మిలియ‌న్ ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాం. 20 మిలియ‌న్ చిన్నారుల‌కు ఉచిత చికిత్స‌లు అందించాం. 

నిత్యం ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమిటంటే ఆరోగ్య ర‌క్ష‌ణ‌ కోసం కుటుంబాలు పెట్టే ఖ‌ర్చు బాగా ఎక్కువైపోయి అది ఆదాయానికి మించి ఉండ‌డం.  ఈ స‌మ‌స్య‌ నుండి బయట‌ప‌డ‌డానికి గాను ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌ ను ప్రారంభించాం.  ఇది రెండంచెల వ్యూహం. 

మొద‌టి ద‌శ‌ లో స‌మ‌గ్ర‌మైన ప్రాథమిక ఆరోగ్య భ‌ద్ర‌త‌ ను ద‌గ్గ‌ర‌ లోని ఆరోగ్య కేంద్రం ద్వారా అందించ‌డం జ‌రుగుతోంది.  ఇందులో భాగం గా ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం పై త‌గిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వ సూచ‌న‌లు ఉంటాయి.  అంతే కాదు ఆరోగ్య కేంద్రాల ద్వారా యోగా ను నేర్ప‌డం జ‌రుగుతుంది.  ఆరోగ్యం గా ఉండ‌డానికి గాను అమ‌లు చేస్తున్న వ్యూహం లో ‘‘ఫిట్ ఇండియా’’, ‘‘ఈట్ రైట్’’ ఉద్య‌మాలు కూడా కీల‌క‌మైన‌వి.  అంతే కాదు హైప‌ర్ టెన్ష‌న్, మ‌ధుమేహం, రొమ్ము, స‌ర్విక్స్‌, ఇంకా నోటి కి వ‌చ్చే మూడు ర‌కాల కేన్స‌ర్ లకు ఉచిత ప‌రీక్ష‌లను, చికిత్స ను అందివ్వ‌డం జ‌రుగుతుంది.  రోగులు వారి ఇంటి కి ద‌గ్గ‌ర‌ లోనే ఉచిత మందుల‌ను, రోగ నిర్ధార‌ణ సహాయాన్ని పొందుతారు.  2022 వ సంవత్సరం కల్లా ఇలాంటివి 150 వేల ఆరోగ్య కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నాం.
 
ఇక ఆయుష్మాన్ భార‌త్ లో మ‌రొక అంశం ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న‌.  దీని ద్వారా ప్ర‌తి కుటుంబం ఏటా 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌వ‌ర‌కు న‌గ‌దు ర‌హిత‌, ఆరోగ్య బీమా ను పొందుతుంది.  దాదాపు 500 మిలియ‌న్ అత్యంత పేదలు, రోగాల బారిన పడే పౌరులకు ఇది ఉపయోగపడుతుంది.  ఈ సంఖ్య కెన‌డా, మెక్సికో, అమెరికా ల జ‌నాభా క‌లిపి ఎంత ఉంటుందో దాదాపుగా అంత ఉంటుంది.  దీనిని ప్రారంభించిన ప‌ది వారాలలో 5 లక్షల కుటుంబాల‌కు 700 కోట్ల రూపాయల విలువైన ఉచిత చికిత్స‌ ల‌ను మేం అందించాం.  ఈ రోజు గ్లోబ‌ల్ హెల్త్ క‌వ‌రేజ్ డే.. ఈ సంద‌ర్భం గా నేను మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాను అంద‌రికీ ఆరోగ్య సేవ‌ ల‌ను అందించ‌డానికి గాను మేం పని చేస్తూనే ఉంటామని. 

దేశం లో ఒక మిలియ‌న్ వ‌ర‌కు సామాజిక ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు లేదా ఎఎస్ హెచ్ఎ వర్కర్ ల పేర్ల‌ ను న‌మోదు చేసుకున్నారు.  అంతే కాదు 2.32 ల‌క్ష‌ల మంది ఆంగ‌న్ వాడీ ఆయాలు ఉన్నారు.  మొత్తం క‌లిపితే ఆరోగ్య రంగం లో ముందుండి సేవ‌లందించే మ‌హిళా కార్య‌క‌ర్త‌ల సంఖ్య గణనీయ‌మైన స్థాయి లో ఉంది.  వారే మా కార్య‌క్ర‌మాల‌కు బ‌లం.
 
భార‌త‌దేశం చాలా పెద్ద దేశం.  దేశం లోని కొన్ని రాష్ట్రాలు, జిల్లాలు అభివృద్ధి చెందిన దేశాల‌తో స‌మానం గా స‌త్తా ను చాటుతున్నాయి.  మిగ‌తా వాటి కి ఉండవలసినంత ప‌ని లేదు. 117 ‘మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లా’ల‌ను గుర్తించ‌వలసిందిగా నేను నా అధికారుల‌కు సూచించాను.  అలాంటి ప్ర‌తి జిల్లా కు ఒక బృందాన్ని కేటాయిస్తాం.  వారు ఆ జిల్లా లో విద్య‌, నీరు, పారిశుధ్య రంగాల్లో ప‌ని చేస్తారు.  ఆరోగ్యానికి, పోష‌ణ‌ కు అత్య‌ధిక ప్రాధాన్య‌ం ఇచ్చేలా గ్రామీణాభివృద్ధి ని సాధించ‌డానికి ఆ బృందం ప‌ని చేస్తుంది.  ఇత‌ర విభాగాల‌ ద్వారా మ‌హిళ‌లే కేంద్రం గా ప‌థ‌కాల‌ను రూపొందించే ప‌ని లో నిమ‌గ్న‌మై ఉన్నాం.  2015వ సంవత్సరం వ‌ర‌కు భార‌తీయ‌ స్త్రీల‌ లో స‌గానికి పైగా మ‌హిళ‌లు వంట‌ కు సంబంధించి స్వ‌చ్ఛ ఇంధ‌నాని కి దూరం గా ఉన్నారు.  ఉజ్వ‌ల యోజ‌న ద్వారా ఈ ప‌రిస్థితి లో మార్పు ను తెచ్చాం.  58 మిలియ‌న్ మ‌హిళ‌ లకు పొగ ర‌హిత పొయ్యి ల‌ను అందించి కాలుష్యం లేకుండా వంట చేసుకునేలా చేయ‌గ‌లిగాం.
 
2919వ సంవత్సరం క‌ల్లా భార‌త‌దేశం లో బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న లేకుండా చేయ‌డానికిగాను స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌ న ప్రారంభించాం.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య వాతావ‌ర‌ణం 39 శాతాన్నుండి 95 శాతానికి పెరిగింది. 
పెద్ద‌లు చెప్పిన ఈ మాట మ‌నంద‌రికీ తెలుసు. మ‌గ‌వాడి కి విద్య‌ ను అందిస్తే అతడొక్కడినే విద్యావంతుడిని చేసిన‌ట్ట‌ు అవుతుంది.  అదే ఒక మ‌హిళ‌ కు విద్య‌నందిస్తే ఆమె కుటుంబానికంతటికీ విద్య‌నందించిన‌ట్టేన‌ని పెద్ద‌లు అన్నారు.  ఈ మాట‌ల్ని మేం ఆచర‌ణ‌ లో పెట్టాం.  బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో కార్య‌క్ర‌మం చేప‌ట్టాం.  ఇది బాలిక‌ లకు ఉత్త‌మ‌మైన నాణ్య‌మైన జీవితాన్ని, విద్య‌ ను అందించ‌డానికి ఉద్దేశించిన కార్య‌క్ర‌మం.  దీనికి తోడు ‘‘సుక‌న్య స‌మృద్ధి యోజ‌న’’ అనే చిన్న త‌ర‌హా పొదుపు ప‌థకాన్ని అమ‌లు చేస్తున్నాం.  దీని ద్వారా 12. 6 మిలియ‌న్ ఖాతా లు ప్రారంభ‌మ‌య్యాయి.  బాలిక‌ల భ‌విష్య‌త్తు భ‌ద్రం గా ఉండ‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ప్ర‌ధాన మంత్రి మాతృ వంద‌న యోజ‌న ప‌థ‌కాన్ని మా ప్ర‌భుత్వం ప్రారంభించింది.  ఈ ప‌థ‌కం 50 మిలియ‌న్ గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు, పాలు ఇచ్చే స్త్రీల‌ కు ల‌బ్ది ని చేకూరుస్తోంది.  ప్ర‌సవానికి ముందు, ప్రసవం అనంతరం మ‌హిళ‌ ల‌కు అవ‌స‌ర‌మైన విశ్రాంతి, పోష‌ణ ల‌భించ‌డానికి గాను వారి బ్యాంకు ఖాతా లకు ప్ర‌భుత్వం నేరు గా కొంత సొమ్ము ను బ‌దిలీ చేస్తుంది.
 
గ‌తంలో మాతృత్వ సెల‌వులు 12 వారాలు ఉండేవి.  వాటిని 26 వారాల‌కు పెంచ‌డం జ‌రిగింది.  ఆరోగ్య రంగం లో భార‌త‌దేశం చేయ‌బోయే వ్య‌యం 2025వ సంవత్సరాని కల్లా జిడిపి లో 2.5 శాతం ఉండేలా- అంటే వంద బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు వుండేలా- నిబ‌ద్ద‌త‌ తో కృషి చేస్తున్నాం.  అంటే ప్ర‌స్తుతం చేస్తున్న ఖ‌ర్చు తో పోల్చిన‌ప్పుడు 8 ఏళ్ల త‌రువాత ఈ ఆరోగ్య రంగం లో ప్ర‌భుత్వ ఖ‌ర్చు 345 శాతం పెర‌గ‌నుంది.  ప్ర‌జల సంక్షేమం కోసం నిరంత‌రం కృషి చేస్తూనే ఉంటాం.  మా ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే ప్ర‌తి ప‌థ‌కం లో, తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యం లో, కార్య‌క్ర‌మం లో, విధానం లో మ‌హిళ‌ల‌కు, చిన్నారుల‌కు, యువ‌త‌కు ప్రాధాన్య‌మిస్తూనే ఉంటాం. 
 విజ‌యం సాధించ‌డానికిగాను బ‌హుళ వాటాదార్ల భాగ‌స్వామ్యాల అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని నేను గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను.  మ‌నం చేసిన  ప్ర‌తి కృషి ని తీసుకుంటే.. ప్ర‌తిభావంత‌మైన ఆరోగ్య భ‌ద్ర‌త‌, ముఖ్యం గా మ‌హిళ‌ ల‌కు, చిన్నారుల‌కు అందివ్వ‌డం స‌మ‌ష్టి కృషి ద్వారానే సాధ్య‌మైంది. 

మిత్రులారా,

ఈ రెండు రోజుల్లో ఈ స‌ద‌స్సు లో మీరు ప్ర‌పంచ‌ వ్యాప్తం గా సాధించిన 12 విజ‌య‌ గాథ లను గురించి చ‌ర్చిస్తార‌ని నాకు తెలిసింది.  ఇది నిజం గా ఒక మంచి అవ‌కాశం.  దేశాల మ‌ధ్య‌న జ‌రిగే చ‌ర్చోప‌చ‌ర్చ‌ల కార‌ణం గా ఒకరి నుండి మ‌రొక‌రం ఉన్న‌త‌మైన విష‌యాల‌ను నేర్చుకోగ‌లుగుతాం.  తోటి దేశాల‌కు సాయం చేయ‌డానికి భార‌త‌దేశం సిద్ధంగా ఉంది.  నైపుణ్యాల‌ను, శిక్ష‌ణ‌ ను అందించే కార్య‌క్ర‌మాల‌ ద్వారా, అంద‌రికీ అందుబాటులో ఉండే మందుల‌ను అందివ్వ‌డం ద్వారా, టీకాల‌ను ఇవ్వ‌డం ద్వారా, విజ్ఞాన బ‌దిలీల ద్వారా, ఇచ్చి పుచ్చుకునే కార్య‌క్ర‌మాల‌ ద్వారా తోటి దేశాలు త‌మ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం లో మా సాయం త‌ప్ప‌క ఉంటుంది.  ఈ చ‌ర్చ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేందుకు గాను నిర్వ‌హించిన మంత్రిత్వ‌స్థాయి స‌ద‌స్సు ఫ‌లితాలను గురించి తెలుసుకోవ‌డానికి నేను ఆస‌క్తికిగా ఎదురు చూస్తున్నాను. ఎంతో ఉత్తేజ‌క‌ర‌మైన ఈ వేదిక మ‌న‌కు స‌రైన గ‌మ‌నాన్ని అందిస్తుంది.  ఉనికి ని సాధించు- జీవించు- మార్పును సాధించు అనే మ‌న నిబ‌ద్ద‌త‌ ను ఇది బ‌లోపేతం చేస్తుంది.

 

అంద‌రికీ ఆరోగ్యాన్ని అందివ్వ‌డానికిగాను మ‌న ముందు స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ఉంది.  అంకిత‌భావం తో ప‌ని చేయడాన్ని మ‌నం కొన‌సాగిస్తాం.  త‌న భాగ‌స్వాములంద‌రితో క‌లసి సామ‌ర‌స్యం తో ప‌ని చేయ‌డానికి భార‌త‌దేశం స‌దా సిద్దం.

ఇక్క‌డకు హాజ‌రైన వారికి, ఈ కార్య‌క్ర‌మాన్ని ఇంట‌ర్ నెట్ ద్వారా వీక్షిస్తున్న‌ వారికి అంద‌రికీ నేను పిలుపునిస్తున్నాను..  నిజ‌మైన స్ఫూర్తి తో మ‌నం ప‌ని చేద్దాం, త‌ద్వారా యావత్తు మాన‌వాళి కి మ‌నం సాయం చేయ‌గ‌లుగుతాం అని. 
ఈ ఉన్న‌త‌ ఆశ‌యాన్ని సాధించడం కోసం చేయి చేయి క‌లపుపుదాం రండి.. మ‌న‌ం ఏమిటన్నది చాటిచెపుదాం మరి.

మీకు ఇవే ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi extends greetings to Sashastra Seema Bal personnel on Raising Day
December 20, 2025

The Prime Minister, Narendra Modi, has extended his greetings to all personnel associated with the Sashastra Seema Bal on their Raising Day.

The Prime Minister said that the SSB’s unwavering dedication reflects the highest traditions of service and that their sense of duty remains a strong pillar of the nation’s safety. He noted that from challenging terrains to demanding operational conditions, the SSB stands ever vigilant.

The Prime Minister wrote on X;

“On the Raising Day of the Sashastra Seema Bal, I extend my greetings to all personnel associated with this force. SSB’s unwavering dedication reflects the highest traditions of service. Their sense of duty remains a strong pillar of our nation’s safety. From challenging terrains to demanding operational conditions, the SSB stands ever vigilant. Wishing them the very best in their endeavours ahead.

@SSB_INDIA”