It is wonderful how Daman has become a mini-India. People from all over the country live and work here: PM
I congratulate the people and local administration for making this place ODF. This is a big step: PM
The Government is taking several steps for the welfare of fishermen, says PM Modi
Our entire emphasis on the 'blue revolution' is inspired by the commitment to bring a positive difference in the lives of fishermen: PM

రూ.1000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను ఈ రోజు దమన్ & దీవ్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.   ఆయా పథకాల లబ్ధిదారులకు ధ్రువపత్రాలను ఆయన ప్రదానం చేశారు.  దమన్ కళాశాల మైదానంలో జరిగిన ఒక జన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

దమన్ లో జన సభ ను.. ఆ సభ సందర్భంగా తనను కలుసుకోవడానికి వచ్చినటువంటి ప్రజల సంఖ్య విషయంలో మాత్రమే కాకుండా అక్కడ నుండి మొదలుపెడుతున్న అభివృద్ధి పథకాల విషయంలో కూడా.. ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమంగా ప్రధాన మంత్రి అభివర్ణించారు. 

పరిశుభ్రత ఉన్న చోట పర్యాటకానికి అవకాశాలు పెరుగుతాయని, అందువల్ల పరిశుభ్రతకు అగ్రతాంబూలాన్ని ఇవ్వడాన్ని కొనసాగించవలసిందంటూ దమన్ ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  దమన్ ను బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జన రహితంగా తీర్చిదిద్దినందుకుగాను స్థానిక ప్రజలను మరియు స్థానిక పరిపాలన యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.  ఇ-రిక్షా లను మరియు సిఎన్ జి ని ఉపయోగించడం ద్వారా దమన్ లో పరిశుభ్రతను ఒక సామూహికోద్యమంగా మార్చివేసిన తీరు మన అందరికీ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.

దమన్ యొక్క సమ్మిళిత సంస్కృతిని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, దమన్ ఒక బుల్లి భారతదేశంగా మారిందని, దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చి పని చేస్తూ మనుగడ సాగిస్తున్నారని పేర్కొన్నారు.  మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, మత్స్యకారుల జీవితాలలో ఒక సకారాత్మకమైనటువంటి వ్యత్యాసాన్ని తీసుకొనిరావాలన్న నిబద్ధత నుండి ప్రేరణను పొందిన కారణంగా తాను ‘నీలి విప్లవా’న్ని గురించి నొక్కి వక్కాణిస్తున్నానని ప్రధాన మంత్రి వివరించారు.

దీవ్ ను అహమదాబాద్ తో కలుపుతూ రాకపోకలు జరిపే ఎయర్ ఒడిశా యొక్క విమాన సర్వీసును ప్రధాన మంత్రి ఉడాన్ పథకంలో భాగంగా ప్రారంభించారు.  దమన్ నుండి దీవ్ కు పవన్ హన్స్ హెలికాప్టర్ సర్వీసుల ప్రారంభ సూచకంగా ఒక జెండాను ఆయన- ఒక వీడియో లింక్ ద్వారా చూపి- ప్రారంభించారు.

బేటీ బచావో బేటీ పఢావో యోజన లో భాగంగా శుభాకాంక్షల కిట్ ను నవ జాత శిశువుకు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు.  దమన్ మరియు దీవ్ పాలనా యంత్రాంగం నుండి మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ సంబంధ ధ్రువపత్రాలను, బడికి వెళ్లే బాలికలకు సైకిళ్లను ఆయన అందజేశారు.  సిఎన్ జి తో నడిచే వాహనాలకు పర్మిట్ లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు.  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ మరియు పట్టణ, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన మరియు ప్రధాన మంత్రి ముద్ర యోజన ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలను ఆయన పంపిణీ చేశారు.  ఇ- రిక్షా, పహలీ సవారీ మరియు అంబులెన్స్ లకు జెండా చూపి వాటిని ప్రధాన మంత్రి  ప్రారంభించారు.

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba

Media Coverage

Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 జూన్ 2026
June 17, 2026

PM Narendra Modi's Dual Legacy: Commanding Global Respect While Delivering Health Miracles, Rail Revolution & Digital Leadership