We have agreed to strengthen our cooperation in areas of renewable energy, we welcome Saudi Arabia in the International Solar Alliance: Prime Minister Modi
The barbaric terrorist attack in Pulwama last week is anti-humanitarian: PM Modi
Destroying the infrastructure of terrorism and those supporting terror organisations is very important: Prime Minister

యువ‌ర్ రాయ‌ల్ హైనెస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ అల్-సౌద్,

స‌దేకీ,

మ‌ర్‌ హ‌బా బికుమ్ ఫిల్ హింద్‌,

మిత్రులారా,

రాయ‌ల్ హైనెస్, మ‌రి వారి ప్ర‌తినిధివ‌ర్గం భార‌త‌దేశం లో వారి యొక్క తొలి ఆధికారిక ప‌ర్య‌ట‌న కు విచ్చేసిన సంద‌ర్భం లో వారి కి స్వాగ‌తం ప‌లుకుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. భార‌త‌దేశం మ‌రియు సౌదీ అరేబియా ల ఆర్థిక, సామాజిక‌ మరియు సాంస్కృతిక సంబంధాలు శ‌తాబ్దాల పాతవి. మ‌రి అవి ఎల్ల‌ప్పుడూ సౌహార్దం గానూ, స్నేహ‌పూర్వ‌కం గానూ ఉంటున్నాయి. మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న స‌న్నిహిత‌మైనటువంటి మరియు గాఢ‌మైనటువంటి బంధం మ‌న దేశాల కు ఒక స‌జీవ సేతువు వలె ఉన్నాయి. యువ‌ర్ మెజెస్టీస్ ఎండ్ రాయ‌ల్ హైనెస్‌, మీ యొక్క స్వీయ అభిమతం మ‌రియు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం మ‌న ద్వైపాక్షిక సంబంధాల లో మ‌రింత గాఢ‌త ను, శ‌క్తి ని కొనితెచ్చాయి. ప్ర‌స్తుత 21 వ శ‌తాబ్దం లో భార‌త‌దేశాని కి అత్యంత విలువైన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశాల లో ఒక‌టి గా సౌదీ అరేబియా ఉంది. ఇది మా యొక్క విస్తృతమైన‌ ఇరుగు పొరుగు దేశాల లో ఒక‌టి గా, ఒక ఆప్త మిత్ర దేశం గా, మరి అలాగే భార‌త‌దేశాని కి శ‌క్తి భ‌ద్ర‌త ను అందిస్తున్న‌ ఒక ముఖ్య‌ వ‌న‌రు గా కూడా ఉంది. 2016వ సంవ‌త్స‌రం లో నేను సౌదీ అరేబియా లో ప‌ర్య‌టించిన‌ప్పుడు మ‌న సంబంధాల కు- ప్ర‌త్యేకించి శ‌క్తి, మ‌రియు భ‌ద్ర‌త రంగాల కు- మనం నూత‌న పార్శ్వాల ను జోడించుకొన్నాం. రెండు నెల‌ల క్రితం అర్జెంటీనా లో మీ తో స‌మావేశ‌మైన ఫ‌లితంగా మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం యొక్క సారం అనేది భ‌ద్ర‌త‌, వ్యాపారం, మ‌రియు పెట్టుబ‌డి రంగాల లో నూత‌న కోణాల ను చిత్రించుకొన్నది. మీరు సూచించిన రూప‌రేఖ కు అనుగుణంగా మ‌నం ద్వివార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని మరియు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి ని ఏర్పాటు చేసుకోవాలని సమ్మతించాం. వీటి ద్వారా మ‌న సంబంధాల కు బ‌లం, వేగం మ‌రియు పురోగ‌తి అందుతాయి.

మిత్రులారా,

ఈ రోజున మనం ద్వైపాక్షిక సంబంధాల తాలూకు అన్ని అంశాల ను విస్తృతం గా, అర్థ‌వంతం గా చ‌ర్చించుకొన్నాము. మనం మన యొక్క ఆర్థిక స‌హ‌కారాన్ని కొత్త శిఖ‌రాల కు తీసుకు పోవాల‌ని నిర్ణ‌యించుకొన్నాం. సౌదీ అరేబియా నుండి మా ఆర్థిక వ్య‌వ‌స్థ లోకి సంస్థాగ‌త పెట్టుబ‌డి ప్ర‌వ‌హించేందుకు మార్గాన్ని సుగ‌మం చేసేలా ఒక ఫ్రేంవ‌ర్క్ ను నెల‌కొల్పాల‌ని మనం అంగీక‌రించాం. భార‌త‌దేశ మౌలిక స‌దుపాయాల రంగం లోకి సౌదీ అరేబియా పెట్టుబ‌డి ని నేను స్వాగ‌తిస్తున్నాను.

యువ‌ర్ రాయ‌ల్ హైనెస్,

మీ యొక్క ‘విజ‌న్ 2030’ తో పాటు మీ నాయ‌క‌త్వం లో అమ‌ల‌వుతున్న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ లు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ల వంటి భార‌త‌దేశ ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌ కు పూర‌కాల వంటివి. మ‌న శ‌క్తి సంబంధాల‌ ను ఒక వ్యూహాత్మ‌క‌మైన‌టు వంటి భాగ‌స్వామ్యం గా మ‌ల‌చుకోవ‌ల‌సిన త‌రుణం ఇదే. ప్ర‌పంచం లోకెల్లా అత్యంత పెద్ద‌దైన శుద్ధి క‌ర్మాగారం లో మ‌రియు వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వుల లో సౌదీ అరేబియా యొక్క ప్ర‌మేయం మ‌న శ‌క్తి సంబంధాల ను కొనుగోలుదారు-అమ్మ‌కందారు సంబంధాల క‌న్నా ఎంతో ముందుకు తీసుకుపోనుంది. న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో మ‌న స‌హ‌కారాన్ని ప‌టిష్టప‌ర‌చుకోవ‌డాని కి మ‌నం అంగీక‌రించాం. సౌదీ అరేబియా ను అంత‌ర్జాతీయ సౌర కూట‌మి లోకి మేము ఆహ్వానిస్తున్నాం. అణు శ‌క్తి ని శాంతియుత ప్ర‌యోజ‌నాల‌ కు వినియోగించుకోవ‌డం, ప్ర‌త్యేకించి జ‌ల‌ నిర్ల‌వ‌ణీక‌ర‌ణ కోసం మ‌రియు ఆరోగ్యం కోసం వినియోగించుకోవ‌డం మ‌న స‌హ‌కారం లో మ‌రొక పార్శ్వం కానుంది. ప్ర‌త్యేకించి మ‌న వ్యూహాత్మ‌క వాతావ‌ర‌ణం ప‌రం గా చూసిన‌ప్పుడు, ప‌ర‌స్ప‌ర ర‌క్ష‌ణ సంబంధ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డం గురించి మ‌రియు విస్త‌రించుకోవ‌డం గురించి కూడా మ‌నం విజ‌య‌వంతం గా చ‌ర్చించుకొన్నాం. గ‌త సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం, సౌదీ అరేబియా లో జ‌రిగిన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన జ‌నాద్రియాహ్ ఉత్స‌వం లో ‘గౌర‌వ అతిథి’ దేశం గా పాలుపంచుకొంది. ఈ రోజు న మ‌నం మ‌న సాంస్కృతిక బంధాల ను ప‌టిష్టం చేసుకోవాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొన్నాం. వ్యాపారాన్ని మ‌రియు ప‌ర్య‌ట‌న రంగాన్ని పెంచుకోవ‌డం కోసం ఇ-వీజా సౌక‌ర్యాన్ని సౌదీ అరేబియా పౌరుల కు విస్త‌రిస్తున్నాం. భార‌తీయుల‌ కు హ‌జ్ కోటా ను పెంచినందుకు హిజ్ మేజెస్టి ఎండ్ రాయ‌ల్ హైనెస్ కు మేము కృత‌జ్ఞుల‌మై ఉన్నాం. సౌదీ అరేబియా లో 2.7 మిలియ‌న్ మంది భార‌త జాతీయులు శాంతియుతం గా మ‌రియు ప్ర‌యోజ‌న‌క‌రం గా మ‌నుగ‌డ సాగించ‌డం మ‌న మ‌ధ్య ఒక ముఖ్య‌మైన లంకె గా ఉంది. సౌదీ అరేబియా యొక్క పురోగ‌తి లో వారి సకారాత్మ‌క‌మైన తోడ్పాటు ను రాయ‌ల్ హైనెస్ మెచ్చుకొన్నారు. వారి యొక్క అభ్యున్న‌తి ప‌ట్ల మీరు స‌దా శ్ర‌ద్ధ వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇందుకు గాను వారి యొక్క కృత‌జ్ఞ‌త భావన మ‌రియు ఆశీర్వాదాలు మీకు ల‌భిస్తుంటాయి.

మిత్రులారా,

గ‌త వారం లో పుల్‌వామా లో జరిగిన ఉగ్ర‌వాదుల‌ బర్బర దాడి, ఈ మాన‌వాళి కి వ్యతిరేకమైనటువంటి ముప్పు ను జ్ఞ‌ప్తి కి తెచ్చే మ‌రో ఘ‌ట‌న‌. ఇది యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌మ్ముకున్న‌టువంటి ఉపద్రవానికి ఒక క్రూర‌మైన సంకేతం లా ఉంది. ఈ అపాయాన్ని ప్రభావవంతం గా ఎదుర్కోవ‌డం కోసం ఏ రూపం లోని ఉగ్ర‌వాదానికైనా మ‌ద్ద‌తిస్తున్న దేశాల మీద సాధ్య‌మైనంత వ‌ర‌కు అన్ని ర‌కాలు గాను ఒత్తిడి ని పెంచ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌నం ఒప్పుకొంటున్నాం. ఉగ్ర‌వాదం యొక్క మౌలిక సదుపాయాల ను నాశనం చేయడం మ‌రి అదే విధంగా దాని కి ల‌భిస్తున్న మ‌ద్ద‌తు ను అంత‌మొందించ‌డం, ఉగ్ర‌వాదుల‌ ను మ‌రియు వారి మ‌ద్ద‌తుదారుల‌ ను శిక్షించ‌డం చాలా ముఖ్యం. అదే స‌మ‌యం లో, అతివాదాని కి వ్య‌తిరేకం గా స‌హ‌క‌రించుకోవ‌డం, దానితో పాటే ఇందుకోసం ఒక కార్యాచ‌ర‌ణ ను రూపొందించుకోవ‌డం కూడా ఎంతో అవ‌స‌రం. దీని ద్వారా హింసాత్మక శక్తులు, భ‌యాన్ని క‌లుగ‌జేసే శ‌క్తులు మ‌న యువ‌త ను పెడ‌దారి ప‌ట్టించ‌లేకపోవాలి. ఈ విష‌యం లో సౌదీ అరేబియా మ‌రియు భార‌త‌దేశం ఒకే విధమైనటువంటి ఆలోచ‌న‌ల ను కలిగివున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

మిత్రులారా,

ప‌శ్చిమ ఆసియా లో, గ‌ల్ఫ్ లో శాంతి మరియు స్థిర‌త్వం నెల‌కొనేలా శ్ర‌ద్ధ వ‌హించ‌డం లోనే మ‌న ఇరు దేశాల హితం ముడి పడి ఉంది. ఈ రోజు న మ‌నం జ‌రిపిన చ‌ర్చ‌ల లో మ‌న కృషి ని స‌మ‌న్వ‌యప‌ర‌చుకోవ‌డానికి, అలాగే ఈ రంగం లో మ‌న భాగ‌స్వామ్యాన్ని వేగ‌వంతం చేసుకోవ‌డానికి అంగీకారం కుదిరింది. మ‌నం ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డం లో, స‌ముద్ర సంబంధ భ‌ద్ర‌త‌, సైబ‌ర్ సెక్యూరిటీ ల వంటి రంగాల లో మరింత బలమైనటువంటి ద్వైపాక్షిక స‌హ‌కారం ఉభ‌య దేశాల కు ల‌బ్ది ని చేకూర్చగలుగుతుంద‌నే అంశం లో కూడాను మ‌నం సమ్మతి ని తెలిపాం.

యువ‌ర్ రాయ‌ల్ హైనెస్‌,

మీ యొక్క యాత్ర మ‌న సంబంధాల లో శీఘ్ర వికాసాని కై ఒక కొత్త పార్శ్వాన్ని అందించింది. మా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు రాయ‌ల్ హైనెస్ కు నేను మ‌రో మారు ధ‌న్య‌వాదాలు చెప్తున్నాను. వారి యొక్క మ‌రి వారి ప్ర‌తినిధివ‌ర్గం లోని స‌భ్యులంద‌రి కి భార‌త‌దేశం లో హాయినిచ్చే ప్రవాసం లభించాల‌ని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

అస్వీక‌ర‌ణ‌ం: ప్ర‌ధాన మంత్రి హిందీ లో ఉప‌న్యాస‌మిచ్చారు. ఆయ‌న ఉప‌న్యాసాని కి ఇది రమారమి అనువాదం.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the passing of Shri PG Baruah Ji
December 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri PG Baruah Ji, Editor and Managing Director of The Assam Tribune Group.

In a post on X, Shri Modi stated:

“Saddened by the passing away of Shri PG Baruah Ji, Editor and Managing Director of The Assam Tribune Group. He will be remembered for his contribution to the media world. He was also passionate about furthering Assam’s progress and popularising the state’s culture. My thoughts are with his family and admirers. Om Shanti.”