There was a period when only 15 paise out of one rupee reached the beneficiaries. But now the poor directly get benefits without intervention of the middlemen: PM
Our Government has always given priority to the interests of our farmers: PM Modi
Due to the efforts of the government, both the production and export of spices from India has increased considerably: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్నాట‌క లోని తుమ‌కూరు లో ఈ రోజు న జ‌రిగిన ఒక సార్వ‌జ‌నిక స‌భ లో ప్ర‌గ‌తిశీల రైతుల కు వ్య‌వ‌సాయ మంత్రి యొక్క కృషి క‌ర్మ‌ణ్ పుర‌స్కారాల ను మ‌రియు రాష్ట్రాల కు ప్ర‌శ‌స్తి పుర‌స్కారాల ను ప్ర‌దానం చేశారు. ఆయ‌న 2019వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నుండి 2020 వ సంవ‌త్స‌రం మార్చి మాసం మ‌ధ్య ఉన్న కాలాని కి గాను పిఎం కిసాన్ (ప్ర‌ధాన మంత్రి స‌మ్మాన్ నిధి) యొక్క మూడ‌వ వాయిదా అయిన 2000 రూపాయ‌ల ను కూడా ఈ సంద‌ర్భం గా విడుద‌ల చేశారు. ఇది సుమారు 6 కోట్ల మంది ల‌బ్ధిదారుల కు ప్ర‌యోజ‌న‌కరం గా ఉంటుంది. క‌ర్నాట‌క లో ఎంపిక చేసిన రైతుల కు కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసిసి)ను కూడా ప్ర‌ధాన మంత్రి అంద‌జేశారు. 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన ల‌బ్ధిదారుల కు పిఎం కిసాన్ లో భాగం గా ధ్రువ ప‌త్రాల ను కూడా ప్ర‌ధాన మంత్రి అంద‌జేయ‌నున్నారు. త‌మిళ నాడు కు చెందిన ఎంపిక చేసిన రైతుల కు డీప్ సీ ఫిషింగ్ వెసెల్స్‌, ఫిషింగ్ వెసెల్ ట్రాన్స్‌ పాండ‌ర్స్ యొక్క తాళం చెవుల‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి అంద‌జేశారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఒక నూత‌న ద‌శాబ్ది ఆరంభం లో క్రొత్త సంవ‌త్స‌రం లో అన్న‌దాతలు అయిన‌టువంటి మ‌న రైతు సోద‌రీమ‌ణుల ను మ‌రియు సోద‌రుల ను చూడ‌టం త‌న‌కు ఒక మ‌హా భాగ్య‌మ‌ని పేర్కొన్నారు. 130 కోట్ల మంది దేశవాసుల త‌ర‌ఫున ప్ర‌ధాన మంత్రి దేశ రైతుల కు వారి శ్ర‌మ‌కు గాను ధ‌న్య‌వాదాలు ప‌లికారు.

దేశం లో సుమారు 6 కోట్ల మంది రైతుల వ్య‌క్తిగ‌త ఖాతాల లోకి నేరుగా పిఎం కిసాన్ ప‌థ‌కం లో భాగం గా డ‌బ్బు చేరే ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన ఘ‌ట్టాన్ని క‌ర్నాట‌క గ‌డ్డ సైతం వీక్షించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప‌థ‌కం యొక్క మూడో వాయిదా లో భాగం గా మొత్తం 12 వేల కోట్ల రూపాయ‌ల ను జ‌మ చేయ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న ను అమ‌లు చేయ‌న‌టువంటి రాష్ట్రాలు దీని ని అమ‌లు చేస్తాయ‌ని మ‌రియు త‌మ త‌మ రాష్ట్రాల లో రైతుల‌ కు స‌హాయ‌ప‌డేటందుకు రాజ‌కీయ ప‌క్షాలు రాజ‌కీయాల కు అతీతం గా వ్య‌వ‌హ‌రిస్తాయ‌న్న‌టువంటి ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

దేశం లోని పేద‌ల‌ కు ఒక రూపాయి పంపించ‌గా, అందులో కేవ‌లం 15 పైస‌లు ల‌బ్ధిదారుల‌ కు అందిన కాలం అంటూ ఒక‌టి ఉండేద‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. మ‌రి ఇప్పుడు డ‌బ్బు మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండానే నేరుగా పేద‌ల కు చేరుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

అనేక ద‌శాబ్దాల పాటు నిల‌చిపోయిన సాగునీటి ప‌థ‌కాలు ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. పంట‌ల బీమా, సాయిల్ హెల్త్ కార్డులు మ‌రియు 100 శాతం వేప‌పూత తో కూడిన యూరియా ల వంటి ప‌థ‌కాల ద్వారా మ‌న రైతుల కు ప్ర‌యోజ‌నం అందించ‌డాని కి కేంద్రం ఎల్‌నవేళ‌లా ప్రాధాన్యాన్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లు కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వ కృషి ఫ‌లితం గా భార‌త‌దేశం నుండి మ‌సాలా దినుసుల ఉత్ప‌త్తి మ‌ర‌యు ఎగుమ‌తి రెండూ కూడా గ‌ణ‌నీయ స్థాయి లో పెరిగాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘భార‌త‌దేశం లో మ‌సాలా దినుసుల ఉత్ప‌త్తి 2.5 మిలియ‌న్ ట‌న్నుల‌ కు పైగా పెరిగింది. త‌త్ఫ‌లితం గా ఎగుమ‌తి సైతం దాదాపు గా 15 వేల కోట్ల రూపాయ‌ల నుండి ర‌మార‌మి 19 వేల కోట్ల రూపాయ‌ల కు పెరిగింది’’ అని ఆయ‌న అన్నారు.

తోట పంట‌ల సాగు తో పాటు, ద‌క్షిణ భార‌త‌దేశాని కి కాయ‌ధాన్యాలు, చ‌మురు మ‌రియు ముత‌క ధాన్యాల ఉత్ప‌త్తి లో ఒక పెద్ద వాటా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘క‌ర్నాట‌క‌, ఆంధ్ర‌, కేర‌ళ‌, త‌మిళ నాడు మ‌రియు తెలంగాణ ల‌లో ఉన్న‌టువంటి 30 కేంద్రాల లో సీడ్ హ‌బ్స్ ను నిర్మించ‌డం జ‌రిగిందని’’ ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

మ‌త్స్య ప‌రిశ్ర‌మ లో ప్ర‌భుత్వ కృషి ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ఈ రంగాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం కోసం ప్ర‌భుత్వం మూడు ద‌శల లో కృషి చేస్తోంద‌ని తెలిపారు.

వాటిలో ఒక‌టో ద‌శ – మ‌త్స్య‌కారుల కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డం ద్వారా గ్రామాల లో మ‌త్స్య ప‌రిశ్రమ ను ప్రోత్స‌హించ‌డం,

రెండో ద‌శ – బ్లూ రివ‌ల్యూష‌న్ స్కీమ్ లో భాగం గా చేప‌లు ప‌ట్టే ప‌డ‌వ‌ల‌ ను ఆధునికీక‌రించ‌డం,

ఇక మూడవ ద‌శ – చేప‌ల వ్యాపారాని కి సంబంధించిన‌టువంటి అధునాత‌న మౌలిక స‌దుపాయాల నిర్మాణం.

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ‘‘మత్స్య‌కారు ల‌ను కిసాన్ క్రెడిట్ కార్డు స‌దుపాయం తో సంధానించ‌డమైంది. చేప‌ల రైతుల సౌక‌ర్యార్థం పెద్ద న‌దుల లోను, స‌ముద్రం లోను, నూత‌న ఫిషింగ్ హార్బ‌ర్ ల‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంది. ఆధునిక మౌలిక స‌దుపాయాల ను ఏర్పాటు చేయ‌డం కోసం 7.50 వేల కోట్ల రూపాయ‌ల తో ఒక ప్ర‌త్యేక నిధి ని ఏర్పాటు చేయ‌డ‌మైంది. స‌ముద్రం లోత‌ట్టు ప్రాంతాల లో చేప‌ల వేట కు అనువుగా మ‌త్స్య‌కారుల ప‌డ‌వుల‌ ను ఆధునికీక‌రించ‌డం జ‌రుగుతోంది. మ‌త్స్య‌కారుల ర‌క్ష‌ణ కై ఇస్రో స‌హాయంతో ప‌డవల లో మార్గ నిర్దేశ‌క ఉప‌క‌ర‌ణాల ను అమ‌ర్చ‌డం జ‌రుగుతోంది’’ అని వివ‌రించారు.

దేశ పోష‌క సంబంధ భ‌ద్ర‌త ను దృష్టి లో పెట్టుకొని, తోట పంట‌లు, సేంద్రియ వ్య‌వ‌సాయం మ‌రియు న్యూట్రీ సిరియ‌ల్స్ ల‌కై కృషి క‌ర్మ‌ణ్ అవార్డుల లో ఒక క్రొత్త కేట‌గిరి ని నెల‌కొల్పాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఇది ఆయా రంగాల లో చ‌క్క‌ని కృషి ని చేస్తున్న వారికి, మ‌రియు రాష్ట్రాల కు ఉత్తేజాన్ని అందించ‌గ‌లుగుతుంది అని ఆయ‌న అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi