Every festival brings our society together: PM Modi
This Diwali, let us celebrate the accomplishments of our Nari Shakti. This can be our Lakshmi Pujan: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వార‌క‌ లో గ‌ల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జ‌రిగిన ద‌స‌రా ఉత్స‌వాల‌ లో పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి విజ‌య ద‌శ‌మి సంద‌ర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, భార‌త‌దేశం ప‌ర్వ‌దినాల భూమి అన్నారు.   మ‌న సచేతన సంస్కృతి కార‌ణం గా భార‌త‌దేశం లోని ఏదో ఒక మూల‌ న ఎల్లప్పుడూ ఏదైనా ఒక సందర్భమో లేదా ప‌ర్వ‌దిన‌మో చోటు చేసుకొంటూనే ఉంటుంది. భార‌త‌దేశం లో పండుగ‌ ల ద్వారా మ‌నం భార‌తీయ సంస్కృతి యొక్క ముఖ్య పార్శ్వాల ను వేడుక గా జ‌రుపుకొంటూవుంటాము.   వీటి వ‌ల్ల మ‌న కు క‌ళ‌, సంగీతం, ఆట పాట‌ల తాలూకు వివిధ రూపాల ను గురించిన అవగాహన లభ్యమవుతుంది అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం శ‌క్తి సాధ‌న యొక్క భూమి గా వుంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌డ‌చిన తొమ్మిది రోజులు గా మ‌నం మాత ను ఆరాధించాము. అదే స్ఫూర్తి ని ముందుకు తీసుకు పోతూ, మ‌హిళ‌ల గౌర‌వాన్ని పెంపొందింపచేసే దిశగాను, మహిళ ల సాధికారిత ను ఇనుమడింపచేసే  దిశ గాను కృషి చేయవలసిన అవసరం ఉంది అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

‘మ‌న్ కీ బాత్’ (‘మ‌న‌సు లో మాట‌’) కార్య‌క్ర‌మం లో భాగం గా గృహ ల‌క్ష్మి అనే అంశం పై తాను మాట్లాడిన అంశాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెస్తూ, రానున్న దీపావ‌ళి పండుగ నాడు మ‌న నారీ శ‌క్తి యొక్క కార్యసిద్ధుల ను వేడుక గా జ‌రుపుకొందామంటూ పిలుపునిచ్చారు. ఈ రోజు న విజ‌య ద‌శ‌మి తో పాటు వైమానిక ద‌ళ దినోత్స‌వం కూడా అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం త‌న వైమానిక ద‌ళాన్ని చూసుకొని అమితం గా గ‌ర్విస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మ‌హాత్మ గాంధీ 150వ జయంతి ని జ‌రుపుకొంటున్న వేళ, విజ‌య ద‌శమి సంద‌ర్భం గా ఒక విష‌య‌మై ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్ధించారు. ఈ సంవ‌త్స‌రం లో ఒక ఉద్య‌మాన్ని మొదలుపెట్టి మ‌రి దానిని పూర్తి చేయడం కోసం శ్ర‌ద్ధ తీసుకోవలసిందిగా ప్ర‌జ‌ల కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ఉద్య‌మం – ఆహారాన్ని వృథా చేయ‌క‌పోవ‌డం, శ‌క్తి ని ఆదా చేయ‌డం, నీటి ని సంర‌క్షించ‌డం – వీటి లో ఏదైనా కావ‌చ్చు అని ఆయ‌న అన్నారు. మ‌నం గ‌నుక స‌మ‌ష్టి స్ఫూర్తి తాలూకు శ‌క్తి ని అర్థం చేసుకోవాలని అనుకొన్నామంటే గనక అందుకు మ‌నం భ‌గ‌వాన్ శ్రీ రాముడు  మరియు భ‌గ‌వాన్ శ్రీ కృష్ణుడు ల నుండి ప్రేర‌ణ ను పొందే తీరాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ద్వార‌క లోని శ్రీ రామ లీల స‌మాజం నిర్వ‌హించిన రామ్ లీల కార్యక్రమాన్ని ప్ర‌ధాన మంత్రి వీక్షించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా– చెడు పైన మంచి సాధించిన గెలుపున కు సంకేతం గా– ఏర్పాటు చేసిన రావ‌ణ, కుంభ‌క‌ర్ణ మ‌రియు మేఘ‌నాథు ల పెద్ద పెద్ద బొమ్మ‌ల ను ద‌హ‌నం చేయ‌డాన్ని కూడా ఆయ‌న తిల‌కించారు.

 

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, India sees highest Q1 smartphone exports by value

Media Coverage

Led by iPhones, India sees highest Q1 smartphone exports by value
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 జూలై 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond