షేర్ చేయండి
 
Comments
PM Modi campaigns in Haridwar, Uttarakhand
Dev Bhoomi Uttarakhand does not deserve a tainted and corrupt government: PM Modi
Atal ji created Uttarakhand with great hope and promise but successive governments did not fulfil his dreams: PM
Uttarakhand needs two engines, the state government under BJP and the Central government to take the state to new heights: PM
BJP is dedicated to open up new avenues for youth and ensure welfare of farmers: Shri Modi

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరైన ప్రజలకు శ్రీ మోడీ అభినందనలు తెలిపారు.

ఉత్తరాఖండ్ దైవ భూమి అని, దానికి ఒక కళంకిత మరియు అవినీతి ప్రభుత్వం ఉండకూడదని శ్రీ మోదీ తెలిపారు. "ఉత్తరాఖండ్ ప్రభుత్వం యొక్క అవినీతి గురించి అందరికీ బాగా తెలుసు అయినప్పటికీ వారి నాయకత్వం వాటిని పట్టించుకోవడంలేదు", అని శ్రీ మోదీ అన్నారు.

ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజల ముందున్నది ఎన్నికలు మరియు ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం గురించి కాదు కాని అందరు గర్వించదగ్గ రాష్ట్రంను సృష్టించుకోవడమని ప్రధాని మోదీ అన్నారు. "పిల్లల పదహారు లేదా పదిహేడు సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు వారు తమ జీవితంలో చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తారు. అలాగే 2000లో ఆవిర్భవించి 17 ఏళ్ళలో అడుగుపెట్టిన ఉత్తరాఖండ్ కు రానున్న ఇదు సంవత్సరాలు కూడా చాలా కీలకమైనవి.”

ఉత్తరాఖండ్ ఏర్పడటానికి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి యొక్క సహకారంను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. "అటల్ జీ గొప్ప ఆశయం మరియు హామీతో ఉత్తరాఖండ్ ను రూపొందించారు. ఈ రాష్ట్రాన్ని చూసుకోవడం కేంద్రం యొక్క విధియై ఉంది. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వాలు అలా చేయలేదు. వారు అటల్ జీ కలలు తీర్చలేకపోయారు. " అని కూడా అభిప్రాయపడ్డారు.

శ్రీ మోడీ కూడా సెంటర్ ఉత్తరాఖండ్ అభివృద్ధిని కేంద్రం కోరుకుంటుందని అందుకే చార్ ధామ్ ను మంచి రహదారులతో అనుసంధానం చేసేందుకు రూ.12,000 కోట్లు కేటాయించిందని కూడా మోదీ అన్నారు. “ఉత్తరాఖండ్ కు రెండు ఇంజిన్లు అవసరం అవి బిజెపి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళే కేంద్ర ప్రభుత్వం” అని కూడా ప్రధాని అన్నారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధే బిజెపికి ప్రధానమని శ్రీ మోదీ తెలిపారు. యువత కోసం నూతన మర్ఘాలను తెరిచేందుకూ మరియు రైతుల సంక్షేమానికి బిజెపి అంకితమయ్యిందని అన్నారు. ఇటీవల భూకంపం సంభవించినప్పుడు కేంద్రం ఎలా వెంటనే స్పందించిందో ఆయన గుర్తుచేస్తూ, “కొన్ని రోజుల క్రితం భూకంపం వచ్చినప్పుడు, పిఎంఒ పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించింది. రక్షణ దళాలను వెంటనే రాష్ట్రానికి పంపింది.  కేదార్నాథ్ మరియు ఉత్తరాఖండ్ లోని ఇతర ప్రాంతాలలో విషాదం జరిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ కూడా లేకుండా విదేశాలలో ఉన్నారు.” అని ఆయన అన్నారు.

ఉత్తరాఖండ్ ఒక సాహసోపేత భూమి అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. “సాయుధ దళాల శౌర్యంను కాంగ్రెస్ గౌరవించలేదు. వారు అధికారంలో వుండి కూడా నలభై ఏళ్ళు ఓఆర్ఓపి సమస్యను పరిష్కరించలేదు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు, మాజీ సైనికుల సమస్యలను వినాలని నిర్ణయించుకున్నాము మరియు ఓఆర్ఓపిని అమలు చేశాము.

"మన సాయుధ దళాలు వాస్తవాధీన అంతటా వ్యూహాత్మక దాడులు నిర్వహించాయి. వారు తమ శక్తిని  ప్రదర్శించారు కాని కొందరు దానిని కూడా అంగీకరించడం లేదు. వారు ప్రమాణాలు కోసం అడుగుతున్నారు! ఇదేనా మన సాయుధ దళాలకు వారిచ్చే గౌరవము? అని శ్రీ మోదీ ప్రశ్నించారు.

అనేకమంది బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the

Media Coverage

Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the "coolest" person
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 మార్చి 2023
March 27, 2023
షేర్ చేయండి
 
Comments

Blessings, Gratitude and Trust for PM Modi's Citizen-centric Policies