వారాణ‌సీ మరియు పట్నా ల మధ్య రాకపోకలు జరిపే రైలు సర్వీసు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌ందువాదీహ్ రైల్వే స్టేష‌న్ లో ప్రారంభ సూచక జెండా ను చూపారు. ఆయన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ప్రారంభించారు. వారాణ‌సీ లోని డిఎల్‌డ‌బ్ల్యు మైదానంలో ఏర్పాటైన ఒక జ‌న స‌భ‌ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్ర‌సంగించారు.

కాశీ ప్ర‌జ‌లు ఫ్రెంచ్ అధ్య‌క్షులు శ్రీ ఇమాన్యుయల్ మాక్రాన్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికినందుకు వారికి ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. వారాణ‌సీ లో పారిశ్రామిక అభివృద్ధికి ప్ర‌తీక‌గా నిల‌చిన డిఎల్‌డ‌బ్ల్యు స్థాయిని పెంచ‌డంతో పాటు డిఎల్‌డ‌బ్ల్యు నిరంత‌ర పురోగ‌తి కి భార‌త ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొన్నట్లు ఆయ‌న చెప్పారు.

గృహ నిర్మాణ రంగం లోను, గృహ వ‌స‌తిని మ‌రింత ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గాను రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కృషి ని ఆయ‌న మెచ్చుకొన్నారు.

స‌భా స్థ‌లం వ‌ద్ద ‘‘వ్య‌ర్థాల నుండి సంప‌ద‌’’ తాలూకు వేరు వేరు కార్య‌క్ర‌మాలతో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న ప్ర‌శంసించారు.

వారాణ‌సీ లో ప‌ర్యాట‌కపరంగా విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొంటూ, న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయవలసిందిగా సూచించారు.

ఇటీవ‌లే ప్ర‌క‌టించిన ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం ఆరోగ్య రంగంలో పరివర్తనను తీసుకువస్తుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ ప‌థ‌కం పేద‌ల‌కు ఉన్నత స్థాయి నాణ్య‌త కలిగిన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ను అందిస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

అనేక ప‌థ‌కాల‌ను ఎంతో చ‌క్క‌గా అమ‌లుచేస్తున్న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాన మంత్రి అభినందించారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Standing for medical science, together with AIIMS

Media Coverage

Standing for medical science, together with AIIMS
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 ఏప్రిల్ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship