Our government brought in soil health card which has proven extremely beneficial for the farmers: PM Modi
Even when we were not in power, we were with the people of Morbi & served the society, says the PM
PM Modi says development for us is not winning polls, but serving citizens
Our Govt worked to bring SAUNI Yojana and large pipelines that carry Narmada water: PM Modi
Congress expressed displeasure when Dr. Rajendra Prasad had come to Gujarat for inauguration of the Somnath Temple: PM Modi
If there was no Sardar Patel, Somnath Temple would never have been possible, says PM Modi
PM in Gujarat: Congress is seeking votes of the OBC communities but they should also answer why they did not allow OBC Commission to get Constitutional Status?

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని మొర్బి, ప్రాచి, పాలిటానా మరియు నవ్సరీలలో బహిరంగ సభలలో ప్రసంగించారు. అవినీతి మరియు వంశావళి రాజకీయాల్లో భారీగా మునిగిపోయిందని కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని ప్రారంభించేందుకు గుజరాత్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపిన అసహనాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.

మొర్బిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మోర్బి ప్రజలకు వారి మంచి-చెడ్డల్లో జన సంఘ్ మరియు బిజెపి అండగా నిలిచాయని, అయితే, కాంగ్రెస్ లేదా వారి నాయకుల గురించి ఇదే మాట ఎవరూ చెప్పలేరని ప్రధాని అన్నారు.

"మాకు, ప్రజాశ్రేయస్సు ముఖ్యం. మేము అధికారంలో లేనప్పుడు కూడా మోర్బి ప్రజలతో ఉన్నాము మరియు సమాజ సేవ చేశాము." అని కూడా అన్నారు.

కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతూ, "కాంగ్రెస్ కు, 'అభివృద్ధి' అంటే చేతి పంపులు ఇవ్వడం అని, కాని అదే బిజెపికి, సౌనియా యోజన మరియు నర్మదా జలాలను మోసే పెద్ద పైప్లైన్లు. చెక్ డ్యామ్లపై కూడా మేము దృష్టి సారించాము." అని ప్రధాని పేర్కొన్నారు.

"కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లయితే నర్మదా జలాలు ఇక్కడకి ఎప్పటికి వచ్చిఉండేవి కాదు మరియు రైతులు ఎంతో నష్టపోయేవారు. కాంగ్రెస్ ప్రాజెక్ట్ను ఆలస్యం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నించాలి.", అని పాలిటానాలో ప్రధాని ప్రస్తావించారు.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు నీటి కొరత కచ్ మరియు సౌరాష్ట్రలో ప్రధాన సమస్యగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. "తగినంత నీటి లేకపోవడం సమాజంపై ప్రభావం చూపింది మరియు బిజెపి ప్రభుత్వం దీనిని మార్చింది మరియు ఈ ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకువచ్చింది", అని శ్రీ మోదీ అన్నారు.

సౌనియా యోజన గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, "సౌనియాయోజన ద్వారా మేము భారీ పైప్లైన్లను నిర్మించాము. సౌనాయోజన కారణంగా సౌరాష్ట్రంలో డ్యాములు నింపబడుతున్నాయి. కాని, కాంగ్రెస్ వీటన్నింటిని చూడగలదని నేను అనుకోను. " అని అన్నారు.

ఈ కార్యక్రమంలో, రైతులకు, వ్యవసాయ రంగం వృద్ధి చెందడానికి చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన గురించి ప్రస్తావిస్తూ, "కిసాన్ సంపద యోజన ద్వారా రైతులకు విలువైన అదనంగా సహాయపడటానికి మరియు మరింత సంపాదన ప్రయత్నాలకు సహాయం అందిస్తున్నాము.” అని అన్నారు.

ప్రాచి నుంచి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, సోమనాథ్ దేవాలయం ప్రారంభోత్సవం కోసం గుజరాత్ కు రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వారు చూపించిన అసంతృప్తిని గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ దేవాలయ నిర్మాణంకోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని ఆయన హైలైట్ చేశారు.

"సర్దార్ పటేల్ లేనట్లయితే, సోమనాథ్ ఆలయం ఎన్నటికీ సాధ్యమయ్యేదే కాదు.   నేడు కొంతమంది సోమనాథ్ను గుర్తు చేసుకుంటున్నారు, నేను వారిని అడగదలుసుకున్నాను - మీరు మీ చరిత్రను మర్చిపోయారా? అని. మీ కుటుంబ సభ్యులు, మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలనే ఆలోచన పట్ల ఇష్టంగా లేరు ... సోమనాథ్ దేవాలయం ప్రారంభించటానికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు, పండిట్ నెహ్రూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు "అని ప్రధాని పేర్కొన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ఒబిసి వర్గాల ఓట్లను కోరుకుంటుందని, దానికి ముందు ఇన్నేళ్ళుగా ఒబిసి కమిషన్ కు రాజ్యాంగ హోదా ఎందుకు ఇవ్వలేదో తెలపాలని ఆ పార్టీని శ్రీ మోదీ కోరారు. "మేము దీనిని ముందుకు తీసుకువచ్చాము, దానికి లోక్సభ ఆమోదించింది కాని కాంగ్రెస్ మెజారిటీ ఉన్న రాజ్యసభలో నిలిచిపోయింది" అని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని పరిశీలిస్తామని శ్రీ మోదీ అన్నారు, ఓబిసి వర్గాలకు అందవలసిన వాటిని వారికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతికి పాల్పడినట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. "70 ఏళ్లపాటు దేశమును దోచుకోగలిగిన వారికి నాకు అధికారం రావడం దుర్వార్తగా ఉంది." అని ఆయన ప్రాచిలో అన్నారు.

నవ్సరీలో, కాంగ్రెస్ పార్టీ యొక్క వంశపారంపర్య రాజకీయాలను విమర్శిస్తూ, "మూడు ఎన్నికలు జరుగుతున్నాయి-ఒకటి యుపి స్థానిక సంస్థలలో, గుజరాత్లో రెండవది, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడవది. మొదటి రెండిటిలో బిజెపి గెలవగలదని ఖచ్చితంగా ఉంది. కాని, మూడవ దానిలో, ఒక కుటుంబానికి చెందినవారు తప్ప ఎవరూ విజయం సాధించరు." అని అన్నారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇద్దరు నాయకులు ప్రచారం కోసం ముందుకు వచ్చారు. వారిని మీడియా పైకెత్తింది. మోదీ పని అయిపోయిందని వారు రాశారు. కాని ఏమి జరిగిందో అందరూ చూశారు. ఆ ఇద్దరు నాయకులూ ఉత్తర ప్రదేశ్లో ఏమన్నారు? గుజరాతీయులను గాడిదలు అని పిలిచారు.

పాలిటానాలో ఒక సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ 'కులతత్వం, కుటుంబతత్వం మరియు అవినీతి' లలో కూరుకుపోయిందని ప్రధాని అన్నారు. ట్యాంకర్ వ్యాపారాన్ని నియంత్రించారని చెప్తూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రధాని తూర్పారబెట్టారు. "ఈ ప్రాంతంలో నీటి కొరత గురించి మీకు గుర్తుందా? అది ఎందుకంటే కాంగ్రెస్ నియంత్రణలో వున్న ట్యాంకర్ వ్యాపారం కారణంగానే. దీనిని గత 22 ఏళ్లలో బిజెపి మార్చింది. మేము ట్యాంకర్ పరిశ్రమను అసంబద్ధం చేశాము." అని ప్రధాని అన్నారు.

తీవ్రంగా శ్రమించే ప్రతి ఒక్కరినీ కాంగ్రెస్ అపహాస్యం చేసిందని, పేద ప్రజల పట్ల వారి ద్వేషం ఆశ్చర్యకారమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. , "మనకు ఫకీర్ మహాత్మ గాంధీ యొక్క గొప్ప వారసత్వం ఉంది – వారికి రాచరికం వారసత్వంగా ఉంది. వారు అన్ని భోగాలతో జన్మించారు మరియు మూలాలతో సంబంధం లేకుండా ఉన్నారు... వారు అభివృద్ధిని ద్వేషిస్తారు, వారు గుజరాతిని ద్వేషిస్తున్నారు, వారు మోదీని ద్వేషిస్తున్నారు, వారు ఇప్పుడు చెమటను కూడా ద్వేషిస్తున్నారు. ఎందుకంటే వారు ఎన్నడూ జీవితంలో చెమటపట్టేలా కష్టపడి పని చేయలేదు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ అపహాస్యం చేస్తారు. ఇది వారి మనస్తత్వం. పేదలపట్ల వారి ద్వేషం ఆశ్చర్యకరమైనది. " అని ప్రధాని అన్నారు.

వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విషయాన్ని పరిష్కరించకుండా నలభై ఏళ్లపాటు పెండింగ్లో ఉండాల్సిన అవసరం ఏముందని ప్రధాని మోదీ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. "ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు, ఓఆర్ఓపి వాస్తవిక అవసరాన్ని ఎంతో ఉండగా కేవలం రూ.500 కోట్లు మాత్రమే ప్రకటించారు. ఇది అత్యధికంగా తప్పుదోవ పట్టించేదిగా ఉంది"అని ఆయన తెలిపారు.

దోక్లం సమస్యపై కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ, "కాంగ్రెస్, మన రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాకుండా చైనీస్ ను ఎందుకు నమ్మింది?" అని అన్నారు.

కాంగ్రెస్ తో సహా ప్రతి రాజకీయ పార్టీ ఏకాభిప్రాయంతో జిఎస్టి నిర్ణయం తీసుకున్నామని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పక్కకు తప్పుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు. "మేము ప్రజలను గుర్తు చేసుకున్నప్పుడు, మేము మహాత్మా గాంధీ, బుద్ధుడు, సర్దార్ పటేల్, నేతాజీ బోస్, భగత్ సింగ్లను గుర్తుచేసుకుంటాము అయితే వారు గబ్బర్ సింగ్ ను గుర్తు చేసుకుంటారు.” అని అన్నారు.

బహిరంగ సభలలో, కేంద్రం యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు గురించి మరియు దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను ఎలా పరివర్తిస్తున్నారో ప్రధానమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi today laid a wreath and paid his respects at the Adwa Victory Monument in Addis Ababa. The memorial is dedicated to the brave Ethiopian soldiers who gave the ultimate sacrifice for the sovereignty of their nation at the Battle of Adwa in 1896. The memorial is a tribute to the enduring spirit of Adwa’s heroes and the country’s proud legacy of freedom, dignity and resilience.

Prime Minister’s visit to the memorial highlights a special historical connection between India and Ethiopia that continues to be cherished by the people of the two countries.