PM Modi inagurates Government projects at Silvassa, distributes assistive Devices to Divyangjans
Every Indian must have access to housing facilities, says PM Modi
In less than a year, the number of beneficiaries under the Ujjwala scheme for LPG has crossed 2 crore: PM
PM Modi urges people to download the BHIM App for cashless transactions

ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ ఈ రోజు దాద్రా మరియు నగర్ హవేలీ లోని సిల్ వాసాలో అనేక ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. వీటిలో ప్రభుత్వ భవనాలు, సోలార్ పివి సిస్టమ్ లు, జన ఔషధి కేంద్రాలు, ఇంకా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఉన్నాయి.

ఆయన దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను, సహాయక ఉపకరణాలను కూడా వారికి పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు వాటికి సంబంధించిన పత్రాలను సైతం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన మంత్రిగా తాను మొట్టమొదటిసారి దాద్రా మరియు నగర్ హవేలీ కి వచ్చానన్నారు. అయితే, గతంలో అనేక సార్లు తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత దాద్రా మరియు నగర్ హవేలీలో అభివృద్ధి పథకాల ప్రభావం ఏ విధంగా ఉన్నదీ వివరాలను తెలుసుకోవాలని కోరుకొన్నానని ఆయన అన్నారు; అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవలసిన రంగాలపైన కసరత్తు చేసిందని ప్రధాన మంత్రి వెల్లడించారు.

అభివృద్ధి అంశాలను గురించి ఆయన మాట్లాడుతూ, గృహ‌ వసతిప్రతి భారతీయుడి అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. వంట గ్యాస్ వినియోగానికి సంబంధించిన ఉజ్జ్వల పథకంలో భాగమైన లబ్దిదారుల సంఖ్య ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే 2 కోట్లకు మించిపోయిందని ఆయన చెప్పారు.

పేదలను, మధ్యతరగతి వర్గాల వారిని కేంద్ర ప్రభుత్వం ఎన్నటికీ దోపిడీకి గురి కానివ్వబోదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల కోసం ఉద్దేశించిన ‘భీమ్ యాప్’ను డౌన్ లోడ్ చేసుకోవాలని సభకు వచ్చిన ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Smartphone PLI plan exceeds targets, value addition quadruples': Industry informs govt

Media Coverage

'Smartphone PLI plan exceeds targets, value addition quadruples': Industry informs govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 జూలై 2026
July 08, 2026

1,000 Years of Heritage, One Future of Partnership: PM Modi Strengthens India-Indonesia Bonds in Jakarta