ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొరియా లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి నేడు ప్ర‌సంగించారు.

వారు త‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికినందుకు గాను ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

భార‌త‌దేశాని కి మ‌రియు కొరియా కు మ‌ధ్య ఉన్న‌టువంటి బంధాలు కేవ‌లం వ్యాపార ప‌ర‌మైన ప్రాతిప‌దిక‌ ను క‌లిగిన‌వి కాద‌ని ఆయ‌న అన్నారు.  ఇరు దేశాల కు మ‌ధ్య ఉన్నటువంటి సంబంధానికి ప్ర‌ధాన ప్రాతిప‌దిక గా ప్ర‌జా సంబంధాలు ఉన్నాయని ఆయ‌న తెలిపారు.

భార‌త‌దేశాని కి మ‌రియు కొరియా కు మ‌ధ్య యుగాల నాటి నుండి ఉన్న లంకెల ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  రాణి సూర్య‌ర‌త్న అయోధ్య నుండి వేలాది కిలో మీట‌ర్లు ప‌య‌నించి కొరియా రాజు ను పెళ్ళాడిన విషయాన్ని ఆయ‌న గుర్తు కు తెచ్చారు.  కొరియా ప్ర‌థ‌మ మ‌హిళ శ్రీ‌మ‌తి కిమ్ జుంగ్‌-సూక్ ఇటీవ‌ల దీపావ‌ళి రోజు న అయోధ్య ను సంద‌ర్శించిన విష‌యాన్ని సైతం ఆయ‌న జ్ఞ‌ప్తి కి తెచ్చారు.

బౌద్ధం ఉభ‌య దేశాల కు మ‌ధ్య ఉన్న‌టు వంటి మైత్రి బంధాన్ని మ‌రింతగా బ‌లోపేతం చేసినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

కొరియా లో అభివృద్ధి కి, ప‌రిశోధ‌న కు మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌కు భార‌తీయ స‌ముదాయం తోడ్పాటు ను అందిస్తున్న‌ద‌ని తెలుసుకోవ‌డం త‌న‌కు సంతోషాన్ని ఇచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కొరియా లో యోగా కు మ‌రియు భార‌తీయ పండుగ‌ల కు ఉన్న‌ లోక ప్రియ‌త్వాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.  భార‌తీయ వంట‌కాలు కొరియా లో వేగం గా ప్రజాద‌ర‌ణ పాత్రమవుతున్నాయ‌ని కూడా ఆయ‌న అన్నారు.   భార‌తీయ క్రీడ అయిన ‘క‌బ‌డ్డీ’ లో కొరియా ఏశియ‌న్ గేమ్స్ లో అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌ ను ఇచ్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  

 

ప్ర‌పంచం అంత‌టా విస్త‌రించిన భార‌తీయ స‌ముదాయం భార‌తదేశాని కి రాయ‌బారుల వంటి వార‌ంటూ ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు.  వారి యొక్క క‌ఠోర శ్ర‌మ, ఇంకా క్ర‌మ‌శిక్ష‌ణ లు ప్ర‌పంచ‌వ్యాప్తం గా భార‌త‌దేశ ప్ర‌తిష్ట‌ ను పెంచినట్లు ఆయన వెల్లడించారు.

భార‌త‌దేశం ఈ సంవ‌త్స‌రం మ‌హాత్మ గాంధీ 150వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.  ప్ర‌పంచం బాపూ ను గురించి మ‌రిన్ని విష‌యాల‌ ను తెలుసుకొనితీరాల‌ని, మ‌రి ఈ ల‌క్ష్యాన్ని అనుస‌రించ‌డం మ‌న క‌ర్త‌వ్య‌ం గా ఉందని ఆయ‌న చెప్పారు.  

కొరియా తో భార‌త‌దేశం బంధాలు ప‌టిష్ట‌ం అవుతున్నాయ‌ని, ఈ ప్రాంతం లో శాంతి కోసం, స్థిర‌త్వం కోసం మ‌రియు స‌మృద్ధి కోసం ఉభ‌య దేశాలూ క‌ల‌సి ప‌ని చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌తీయ బ్రాండ్ లు ప్ర‌స్తుతం కొరియా లో స్థానాన్ని సంపాదించుకొన్నాయ‌ని, మ‌రి అలాగే కొరియా కు చెందిన బ్రాండ్ లు భార‌త‌దేశం లో ఇంటింటా ప‌రిచ‌యాని కి నోచుకొన్న‌వేన‌ని కూడా ఆయ‌న తెలిపారు.
 
భార‌త‌దేశం లో ఇటీవ‌ల చోటుచేసుకొన్న ఆర్థికాభివృద్ధి ని గురించి ప్ర‌ధాన మంత్రి సుదీర్ఘం గా వివ‌రించారు.  

భార‌త‌దేశం త్వ‌ర‌లోనే 5 ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ కానుంద‌ని ఆయ‌న చెప్పారు. 

 

‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం’ మ‌రియు ‘జీవించ‌డం లో సౌల‌భ్యం’ అంశాల లో గొప్ప పురోగ‌తి జ‌రిగిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  జిఎస్‌టి, ఇంకా న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ల వంటి సంస్క‌ర‌ణ‌ల‌ ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశం లో అన్ని వ‌ర్గాల‌ వారికి ఆర్థిక సేవ‌ల అంద‌జేత విప్ల‌వాన్ని ప్ర‌పంచ దేశాలు గ‌మ‌నిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఈ సంద‌ర్భం గా బ్యాంకు ఖాతాల‌ ను గురించి, బీమా ను గురించి, ఇంకా ముద్ర రుణాల‌ ను గురించి ఆయ‌న వివరించారు.

అనేక కార్య సాధ‌న‌ ల కార‌ణం గా భార‌త‌దేశం యొక్క ప్ర‌తిష్ట పెరుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  పేద‌ల‌ కు ఉచితంగా వ్యాధి చికిత్స ను అందించడం గురించి, ప్ర‌పంచం లోకెల్లా అత్యంత ఎత్తయిన విగ్ర‌హం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని గురించి, ఇంకా ‘డిజిట‌ల్ ఇండియా’ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.  

 

 

ప‌రిశుభ్ర‌మైన శ‌క్తి రంగం లో భార‌తదేశం లో చోటుచేసుకొన్న ప‌రిణామాల ను గురించి మ‌రియు అంత‌ర్జాతీయ సౌర వేదిక ఏర్పాటు ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం లో ఒక కొత్త శ‌క్తి చోటు చేసుకున్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రేప‌టి రోజు న తాను భార‌తదేశ ప్ర‌జ‌ల త‌ర‌పున, మ‌రి ప్రవాసీ భార‌తీయుల ప‌క్షాన సియోల్ శాంతి బ‌హుమ‌తి ని స్వీక‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌యాగ్‌రాజ్ లో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కుంభ్ మేళా ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, ఈసారి కుంభ్ లో స్వ‌చ్ఛత కు ప్రాముఖ్యం ఇచ్చిన సంగ‌తి ని ప్ర‌పంచం గ‌మ‌నిస్తోంద‌న్నారు.  కొరియా లో నివ‌సిస్తున్న భార‌తీయ స‌ముదాయం వారి స్వీయ ప్ర‌య‌త్నాల ద్వారా భార‌త‌దేశం లో ప‌ర్య‌ట‌న రంగాన్ని ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న ఉద్బోధించారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.