The fundamentals of our economy are sound. We are well set to become a 5 trillion dollar economy in the near future: PM
In the last four years, we have jumped 65 places in the World Bank’s Ease of Doing Business ranking, to 77th: PM Modi
Research and innovation would be the driving force in 4th industrial revolution era: PM Modi

వాణిజ్యం, పరిశ్రమ మరియు శక్తి శాఖ మంత్రి శ్రీ యున్ మో సుంగ్,

సుప్ర‌సిద్ధులైన వ్యాపార నాయకులు,

మిత్రులారా,

శుభ మధ్యాహ్నం. ఈ రోజు న సియోల్ లో మీ అంద‌రితో భేటీ అవుతున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. గత 12 నెలల కాలం లో కొరియా వ్యాపార‌వేత్త‌ల‌తో నేను స‌మావేశం కావ‌డం ఇది మూడో సారి. ఇది ఒక అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మం. మ‌రింత ఎక్కువ మంది కొరియా వ్యాపార‌వేత్త‌లు భార‌తదేశం పైన దృష్టి పెట్టాల‌ని నేను కోరుతున్నాను. నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్నప్పుడు కూడాను కొరియా లో ప‌ర్య‌టించాను. కొరియా ఇప్ప‌టికీ ఆర్థికాభివృద్ధి విష‌యం లో నాకు ఒక ఆద‌ర్శ‌వంత‌మైనటువంటి న‌మూనా.

మిత్రులారా,

భార‌త‌దేశం ఈ రోజు న 125 కోట్ల మంది జ‌నాభా గల దేశం. నిరంత‌రాయం గా చ‌క్క‌ని ప‌రివ‌ర్తన ను సాధిస్తోంది.

భార‌త‌దేశం ప్ర‌స్తుతం

· వ్య‌వ‌సాయ ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ నుండి పారిశ్రామిక, సేవల ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా,

· గ‌తం లో విదేశీ కంపెనీల ప్ర‌వేశాని కి ఎన్నోనిబంధ‌న‌లు ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ నుండి అంత‌ర్జాతీయ అనుసంధానం గల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా,

· అవ‌రోధాల‌కు మారుపేరుగా నిలిచిన ఆర్థిక వ్య‌వ‌స్థ నుండి ఎర్ర‌ తివాచీ ప‌రచి మరీ ఆహ్వానం ప‌లికే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా మారుతోంది.

భార‌త‌దేశం అవ‌కాశాల గ‌ని గా రూపొందింది. “భారత స్వప్నా”న్ని సాకారం చేసుకొనే దిశ‌ గా మేం వేసే అడుగు లో ఒకే ర‌క‌మైన ఆలోచ‌న దృక్ప‌థం గల వారు భాగ‌స్వాములు గా చేరాల‌ని కోరుతున్నాం. అలాంటి వారిలో ద‌క్షిణ కొరియా మాకు స‌హ‌జ‌సిద్ధ‌మైన భాగ‌స్వామి. గత ద‌శాబ్ది కాలం లో భారత- కొరియా సంబంధాల లో ఎంతో పురోగ‌తి చోటుచేసుకొంది. కొరియా కు ప‌ది అగ్ర‌గామి వ్యాపార భాగ‌స్వాముల లో ఒక‌టి గా భార‌తదేశం నిలచింది. కొరియా వ‌స్తువుల ఎగుమ‌తుల‌ కు భార‌తదేశం ఆరో పెద్ద గ‌మ్యస్థానం గా ఉంది. 2018వ సంవ‌త్స‌రం లో ఉభయ‌ దేశాల మ‌ధ్య వాణిజ్యం 2150 కోట్ల డాల‌ర్ల‌ కు చేరింది. 2030వ సంవ‌త్స‌రం కల్లా ద్వైపాక్షిక వాణిజ్యం 5000 కోట్ల డాల‌ర్ల‌ కు చేర్చ‌డం ల‌క్ష్యం గా స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందం స్థాయి ని పెంచేందుకు సంప్ర‌దింపులు వేగం పుంజుకొన్నాయి. ఒక్క వాణిజ్య‌మే కాదు, పెట్టుబ‌డుల విభాగం లో కూడాను మ‌నం ఎంతో సానుకూల‌మైన మార్పు ను చూస్తున్నాం. భార‌త‌దేశం లో కొరియా మొత్తం పెట్టుబ‌డులు 600 కోట్ల డాల‌ర్ల‌ కు చేరాయి.

మిత్రులారా,

నేను 2015వ సంవత్సరం లో కొరియా లో ప‌ర్యటించిన అనంతరం మేం కొరియా పెట్టుబ‌డిదారుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు “ఇన్ వెస్ట్ ఇండియా” లో భాగం గా ప్ర‌త్యేకంగా “కొరియా ప్ల‌స్” విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆ విభాగం కొరియా వ్యాపార‌వేత్త‌ల‌ కు వారి వ్యాపారాలు కొన‌సాగుతున్నంత కాలం చ‌క్క‌ని మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందిండం తో పాటు స‌హాయ‌ స‌హ‌కారాలను కూడా అందిస్తుంది. హ్యుండయ్, శాంసంగ్, ఎల్ జి ఎల‌క్ట్రానిక్స్ సంస్థ‌ లు భార‌తదేశం లో విశ్వ‌స‌నీయ బ్రాండ్ లు గా మారాయి. కియా కూడా త్వ‌ర‌లో ఈ క్ల‌బ్ లో చేర‌నుంది. భార‌త‌దేశం లో 600కు పైగా కొరియా కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. మ‌రిన్ని సంస్థల ను ఆహ్వానించాల‌ని మేం ఆస‌క్తి గా ఉన్నాం. మీకు మార్గం సుగ‌మం చేసేందుకు గత ఏడాది అక్టోబ‌ర్ నుండి కొరియా జాతీయుల‌ కు వీజా ఆన్ అరైవ‌ల్ స‌దుపాయాన్ని క‌ల్పించాం. కొరియా వాణిజ్య కార్యాల‌యాలు భార‌త‌దేశం లో ఏర్పాటు చేసేందుకు మేం ప్రోత్స‌హించాం. ఇటీవ‌లే కొట్రా ఆరో కార్యాల‌యం అహమదాబాద్ లో ప్రారంభ‌ం అయింద‌ని చెప్ప‌డానికి నేను సంతోషిస్తున్నాను. భార‌త‌దేశం లో ఇప్పుడేం జ‌రుగుతోందో నేను కొంత ప్ర‌స్తావించాల‌నుకుంటున్నాను. భార‌త‌దేశ ఆర్తిక వ్య‌వ‌స్థ మూలాలు ప‌టిష్ఠం గా ఉన్నాయి. స‌మీప భ‌విష్య‌త్తు లోనే భారత ఆర్థిక వ్య‌వ‌స్థ 5 ల‌క్షల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా ప‌రివ‌ర్తన చెందనుంది. ప్ర‌పంచం లోని ఏ ఒక్క ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఏడాది కి 7 శాతం వృద్ధి ని సాధించ‌డం లేదు. వ‌స్తువులు, సేవల ప‌న్ను (జిఎస్ టి) ని ప్ర‌వేశ పెట్ట‌డం స‌హా ఎన్నో క‌ఠిన నిర్ణ‌యాల ను మేం తీసుకున్నాం. గత నాలుగేళ్ల కాలం లో ప్ర‌పంచ‌ బ్యాంకు వ్యాపారానుకూల ర్యాంకింగ్ ల‌లో 65 స్థానాలు ఎగువ‌కు దూసుకుపోయి ప్ర‌స్తుతం 77వ స్థానం లో ఉన్నాం. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ కు తలుపులు తెరచిన దేశాలలో భార‌త‌దేశం కూడా ఉంది. 90 శాతాని కి పైగా రంగాల లో ఈ రోజు న ఆటోమేటిక్ రూట్ లో అనుమ‌తులు ఇస్తున్నాం. ఈ విశ్వాసం ఫ‌లితంగానే గత నాలుగేళ్ల కాలంలో భార‌తదేశం 250 బిలియన్ డాల‌ర్ల ఎఫ్ డీఐ లను అందుకొంది.

మిత్రులారా,

భారతదేశం సమ్మిళిత వృద్ధి బాట లో పయనిస్తోంది. ఇందులో భాగం గానే ఆర్థిక కార్యకలాపాలలో అందరి ని భాగస్వాముల ను చేసేందుకు మేం పటిష్ఠమైన చర్యల ను తీసుకున్నాం. ఇంతవరకు బ్యాంకు ఖాతా లు లేని 300 బిలియన్ మంది తో బ్యాంకు ఖాతాల ను తెరిపించాం. ఈ రోజున భారతదేశం జనాభా లో 99 శాతం మంది బ్యాంకు ఖాతాలలో 12 బిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్ చేశారు. వారందరికీ ప్రస్తుతం అందుబాటు ధరల లో పెన్షన్, బీమా సదుపాయాలు ఉన్నాయి. ముద్రా పథకం లో భాగం గా 128 మిలియన్ మంది కి గత మూడు సంవత్సరాల కాలంలో 90 బిలియన్ డాలర్లకు పైగా సూక్ష్మ రుణాల ను అందించాం. వాటిలో 74 శాతం మహిళల కు అందాయి. బయోమెట్రిక్ గుర్తింపు విధానం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ ల శక్తి ని ఉపయోగించుకొని ఇదివరలో బ్యాంకు సదుపాయం లేని వారందరికీ సబ్సిడీ లను, సేవల ను అందజేస్తున్నాం. ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు పైబడి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. లీకేజిల కు తెర పడింది. గ్రామీణ విద్యుదీకరణ లో కూడా మేం ఎంతో పురోగమించాం. 2018 నాటికి గ్రామీణ ప్రాంతాలన్నింటికీ విద్యుత్తు సౌకర్యాన్ని అందుబాటు లోకి తెచ్చిన విజయ గాథల లో ఒకటి గా భారతదేశం కార్యసాధన ను అంతర్జాతీయ శక్తి సంస్థ గుర్తించింది. నవీకరణ యోగ్య శక్తి రంగం లో ప్రపంచంలోనే ఆరో పెద్ద ఉత్పత్తిదారు గా భారతదేశం మారింది. ఈ చొరవ కు తోడు మేం తీసుకున్న అంతర్జాతీయ సౌర కూటమి స్థాపన కారణం గా ప్రపంచం లో హరిత ఆర్థిక వ్యవ స్థగా పరివర్తన చెందుతున్న దేశాలలో భారతదేశం అగ్రగామి గా మారింది. హరిత, స్థిర భవిత కు మా కట్టుబాటు ఇది. ఈ చర్యల ద్వారా దేశం లోని అన్ని ప్రాంతాల ప్రజల జీవితాల లో మార్పు వచ్చింది. పాలన, ప్రభుత్వ సేవల లో పరిపూర్ణమైన పరివర్తన వచ్చింది.

మిత్రులారా,

ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల తో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. రవాణా, విద్యుత్తు, నౌకానిర్మాణం, నౌకాశ్రయాలు, గృహనిర్మాణం, పట్టణ మౌలిక వసతులన్నింటికీ భారతదేశం లో భారీ డిమాండు ఉంది. ఆయా విభాగాల్లో కొరియా కు సాంకేతిక సమర్థత, సామర్థ్యాలు ఉన్నాయి. 2022వ సంవత్సరం కల్లా భారతదేశం లో మౌలిక వసతుల రంగం లో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం కాగలదని మా అంచనా. సాగరమాల ప్రాజెక్టు లో భాగం గా- వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో 1000 కోట్ల డాలర్ల పెట్టుబడుల తో పోర్టు ప్రాజెక్టుల ను మేం గుర్తించాం. పట్టణ మౌలిక వసతుల కు అవసరమైన మార్గదర్శకం అందించడం చాలా ప్రధానం. సుస్థిరమైన, స్వచ్ఛ భవిష్యత్తు కోసం స్మార్ట్ సిటీస్ ఏర్పాటు కు చర్యలు తీసుకున్నాం. 2025వ సంవత్సరం కల్లా భారతదేశం జనాభా లో 500 మిలియన్ మంది కి పైగా పట్టణ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. భారతదేశం లో స్మార్ట్ సొల్యూశన్స్ నిర్మాణం లో సహకారం విస్తృతి కి ఇది చక్కని నిదర్శనం. భారతదేశం లో మౌలిక వసతుల అభివృద్ధి కి మద్దతు గా కొరియా ఆర్థిక అభివృద్ధి సహకార నిధి, ఎగుమతి క్రెడిట్ కింద 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుల కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవకాశాలు ఉన్నట్లు భారతదేశం, కొరియా లు గుర్తించాయి. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సిద్ధాంతం ప్రాతిపదిక న ఆర్థికాభివృద్ధి లో వేగం పుంజుకోవాలని మేం భావిస్తున్నాం. ఉదాహరణ కు ఆటోమొబైల్ రంగాన్ని తీసుకుంటే అందరూ భరించగల ధరల లో, సమర్థవంతమైన ఇలెక్ట్రిక్ వాహనాల ను తయారుచేయాలన్నది జాతీయ ఇలెక్ట్రిక్ మొబిలిటీ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇలెక్ట్రిక్ వాహనాల తయారీ లో అగ్రగామి అయిన కొరియా కు ఈ రంగంలో భారతదేశం లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా,

4వ పారిశ్రామిక విప్లవ శకం లో పరిశోధన, నవ్య ధోరణు లే చోదక శక్తులు గా ఉంటాయి. అందుకు అవసరం అయిన మద్దతు వ్యవస్థల ను ఏర్పాటు చేయడం లో ప్రభుత్వ పాత్ర ఎంతో మాకు తెలుసు. ఇందుకు అనుగుణంగానే మేం స్టార్ట్- అప్ ఇండియా పేరిట దేశం లో స్టార్ట్- అప్ లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం నాలుగు సంవత్సరాల కాలం లో 1.4 బిలియన్ డాలర్ల విలువ గల భారీ కార్యక్రమం చేపట్టాం. అలాగే స్టార్ట్- అప్ లకు అవసరమైన మూలధనాన్ని అందించడానికి, వెంచర్ ల కు అనుకూల మైన వాతావరణాన్ని కల్పించడానికి 2020వ సంవత్సరం కల్లా 9.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించే ఒక కార్యక్రమాన్ని అధ్యక్షులు శ్రీ మూన్ సమర్థ నాయకత్వం లో కొరియా ఆవిష్కరించింది. విధానాల లోని ఈ సారూప్యాలే భారతదేశం, కొరియా ల మధ్య ఉమ్మడి ప్రయోజనాల కు అద్దం పడుతున్నాయి. భారతదేశం లో కొరియా స్టార్ట్- అప్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొరియా స్టార్ట్- అప్ లు, భారతదేశం లోని ప్రతిభావంతులు ఒకరితో మరొకరు సంప్రదించుకోగల వేదిక ను కల్పించాలని మేం భావించాం. భారతదేశం లో కొరియా స్టార్ట్- అప్ లకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు దక్షిణ కొరియా జాతీయ ఐటి ప్రోత్సాహక ఏజెన్సీ బెంగళూరు లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇనవేశన్ విభాగం లో కూడా ఉమ్మడి కార్యకలాపాల కోసం ‘ఇండియా-కొరియా ఫ్యూచర్ స్ట్రాటజీ గ్రూపు’ మరియు ‘ఇండియా-కొరియా సెంటర్ ఫర్ రిసర్చ్ అండ్ ఇనవేశన్ కోఆపరేశన్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భవిష్యత్తు కు అవసరం అయిన పరిశోధన, నూతన ఆవిష్కరణ, నవ పారిశ్రామికత్వం ఆధారిత సహకారం అందించే వ్యవస్థ గా ఇది నిలుస్తుంది.

మిత్రులారా,

మా పౌరుల కలలను పండించడానికి కొరియా రిపబ్లిక్ తో కలసి పని చేయాలన్నది మా ప్రగాఢ అభిలాష. ప్రభుత్వాలు చేసే పనులు- మీ వంటి వ్యాపారవేత్తలు కూడా ఆ యొక్క కలల ను పంచుకోలేకపోతే- సాకారం కాబోవు. అందుకే కొరియా ప్రగాఢం గా విశ్వసించేటువంటి

हुंजा खाम्योन पल्ली खाजीमन

हमके खाम्योन मल्ली खम्निदा

మీరు ఒక్కరే అయితే వేగం గా ప్రయాణించగలరు;

కానీ, కలసి ప్రయాణం చేస్తే ఎంత దూరం అయినా ప్రయాణించగలరు

అనే మాటల యొక్క భావం తో నేను సంపూర్ణం గా ఏకీభవిస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

మీకు ఇవే అనేకానేక ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”