ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యుఎస్-ఇండియా స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ఫోరమ్ చైర్మన్ శ్రీ జాన్ చాంబర్స్ గాంధీనగర్ లో ఈ రోజు సమావేశమయ్యారు.
వారు ఉభయులు ఇదివరకు పాల్గొన్న సమావేశాల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం గా గుర్తుకు తెచ్చుకొన్నారు. భారతదేశాని కి, అమెరికా కు మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలు పెరుగుతూ ఉండటాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. భారతదేశాని కి, అమెరికా కు మధ్య సమన్వయం విస్తరిస్తోందని, అలాగే, రెండు పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం లో తయారీ రంగం లో యుఎస్ పెట్టుబడి మరింత గా అధికం కావడాన్ని సైతం ఆయన స్వాగతించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ లో అవకాశాల ను అన్వేషించవలసిందిగా యుఎస్ కంపెనీ లను ఆయన ఆహ్వానించారు.


