వరుస సంఖ్య

శీర్షిక

వివరణ

1

రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన (జేడీడీఎస్‌సీ)

ప్రస్తుతం ఉన్న భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను (2009) ఇది పునరుద్ధరిస్తుంది. దళాల పరస్పర నిర్వహణ, సామర్థ్య పెంపుదల, సముద్ర తీర పరిధి, రక్షణ పారిశ్రామిక సహకారం, సైబర్ భద్రత- సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, హెచ్ఏడీఆర్‌లతో పాటు యూఎన్‌సీఎల్ఓఎస్, ఆసియాన్, పీఐఎఫ్, ఐఓఆర్ఏలలో ఏకీకృత విధానాన్ని అనుసరించడాన్ని ఇది సహకార రంగాలుగా గుర్తిస్తుంది.

2

సముద్ర తీర భద్రతా సహకార ప్రణాళిక (ఎంఎస్‌సీఆర్)

సమాచార మార్పిడి, సామర్థ్య పెంపు, కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా ఇది సముద్ర తీర భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

3

ఇంధన భద్రతపై భారత్-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన భద్రత పట్ల ఇరు దేశాల నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.

4

భారత్-ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందం పరిపాలనాపరమైన ఏర్పాట్ల విషయంలో తుది నిర్ణయం

ఇది 2014లో కుదిరిన భారత్-ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేస్తుంది.

5

సైబర్, కీలక సాంకేతికతలు, సరఫరా గొలుసుల విషయంలో ఆస్ట్రేలియా-ఇండియా భాగస్వామ్యం (పీఏసీటీఎస్)

ఇది సైబర్, సైబర్ ఆధారిత కీలక సాంకేతిక సహకారంపై 2020 నాటి ముసాయిదా తయారీని మరింత ముందుకు తీసుకెళ్తుంది. జాతీయ, ప్రాంతీయ భద్రతకు మద్దతు ఇవ్వడం.. కీలకమైన సరఫరా గొలుసులు మరింత పటిష్ఠంగా ఉండేలా సహకారాన్ని పెంపొందించడం.. కీలక సాంకేతికతలు, సైబర్ భద్రత, డిజిటల్ దృఢత్వంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

6

భారత కోస్ట్ గార్డ్ (ఐసీజీ), ఆస్ట్రేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్ (ఎంబీసీ) మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

ఐసీజీ, ఎంబీసీల మధ్య సముద్ర చట్టాల అమలు, సముద్ర పరిధిపై అవగాహన, సముద్ర తీర సరిహద్దు రక్షణ రంగాలలో ఇది సహకారాన్ని పెంపొందిస్తుంది.

7

2028-29 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారత సైనిక ఇన్‌స్ట్రక్టర్‌కు ఆస్ట్రేలియా ఆహ్వానం

2028-29 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజీలో ఒక భారతీయ సైనిక ఇన్‌స్ట్రక్టర్ నియమించనున్నట్లు ఇది ప్రకటిస్తుంది.

8

గనుల తవ్వకం, గనుల తవ్వకానికి సంబంధించిన పరికరాలు, సాంకేతికత, సేవల్లో (ఎంఈటీఎస్) ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు కోసం భారత నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్ డీఈ), పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన 'టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్'ల (టీఏఎఫ్ఈ) మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

మైనింగ్ కార్యకలాపాలు, గనుల భద్రత, ఖనిజాల ప్రాసెసింగ్, గనుల యంత్రాలు వంటి ఉప రంగాలలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసం భువనేశ్వర్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో (ఎన్‌ఎస్‌టీఐ) 'మైనింగ్ పరికరాలు, సాంకేతికత, సేవల' కోసం ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఇది ఏర్పాటు చేస్తుంది. ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్‌ల (టీఏఎఫ్ఈ) మధ్య విద్యార్థులు, శిక్షణార్థుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పిస్తుంది.

9

భారతదేశంలో (బెంగళూరు) తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ఫ్లిండర్స్ యూనివర్సిటీకి ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) అందజేత

ఇది బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది.

10

నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ), ఆస్ట్రేలియన్ స్కిల్స్ క్వాలిటీ అథారిటీ (ఏఎస్‌క్యూఏ) మధ్య ఎల్‌ఓఐపై (లెటర్ ఆఫ్ ఇంటెంట్) సంతకాలు

సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణలో (టీవీఈటీ) నాణ్యతా ప్రమాణాల ప్రాముఖ్యతను ఇది గుర్తిస్తుంది. ఇది వృత్తి విద్యా శిక్షణ వ్యవస్థలలో నియంత్రణ చట్రాలను బలోపేతం చేస్తుంది. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో వృత్తిపరమైన ప్రమాణాల ఉమ్మడి అభివృద్ధి, సమన్వయానికి తోడ్పడుతుంది. అధికారుల సామర్థ్య పెంపు, సిబ్బంది పరస్పర మార్పిడి, సంయుక్త వర్క్‌షాప్‌లు, పరిశోధనా కార్యకలాపాలకు వీలు కల్పిస్తుంది.

11

భారతీయ పురాతన కళాఖండాల స్వదేశీ పునరాగమనం

మూడు భారతీయ పురాతన వస్తువులను తిరిగి స్వదేశానికి తీసుకొస్తుంది:

ఎ. శివుని వాహనమైన పవిత్ర నంది [వివరణ: తమిళనాడు, భారతదేశం, 11- 12వ శతాబ్దపు గ్రానైట్ శిల]

బి. శుభప్రదమైన కాళీతో (భద్రకాళి) కూడిన త్రిశూలం [వివరణ: తమిళనాడు, భారతదేశం, 11వ శతాబ్దపు కాంస్యం]

సి. ఆరు తలల స్కందుడు (కార్తికేయుడు) [వివరణ: తమిళనాడు, భారతదేశం, 12వ శతాబ్దపు బసాల్ట్ శిల]

12

రూఫ్‌టాప్ సోలార్ ట్రైనింగ్ అకాడమీ కార్యాకలాపాలు ప్రారంభం

వాతావరణ మార్పులు- పర్యావరణం- నీటి విభాగం (డీసీఈఈడబ్ల్యూ), భారతదేశానికి చెందిన సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ (ఎస్‌ఎస్‌సీజీజే), ‘రెన్యూ'ల సంయుక్త భాగస్వామ్యంతో గాంధీనగర్‌లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీలో ఇది ఏర్పాటై కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని ద్వారా 2000 మంది మహిళలు, యువతకు సోలార్ టెక్నీషియన్లు, ఇన్‌స్టాలర్లు, హెల్పర్లుగా శిక్షణ ఇవ్వాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఇది గౌరవ ప్రధానమంత్రి 2024 జనవరిలో ప్రారంభించిన 'పీఎం సూర్య ఘర్ యోజన'కు, భారతదేశ హరిత ఇంధన ప్రయాణానికి మద్దతుగా నిలుస్తుంది.

13

ఆస్ట్రేలియా-కెనడా-ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఏసీఐటీఐ) భాగస్వామ్యం కింద అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

ఆస్ట్రేలియా-కెనడా-ఇండియా సాంకేతికత, ఆవిష్కరణల (ఏసీఐటీఐ) భాగస్వామ్యం కింద అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం దీని ముఖ్య ఉద్దేశం.

14

జియోసైన్స్ ఆస్ట్రేలియా (జీఏ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

ఇది 2015లో కుదిరిన శాస్త్రీయ, సాంకేతిక సహకార అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) మరింత ముందుకు తీసుకెళ్తుంది. అధునాతన అన్వేషణ పద్ధతులను అవలంబించడం, సామర్థ్య పెంపుదల- నైపుణ్యాభివృద్ధి, జీఎస్‌ఐ మౌలిక సదుపాయాల విషయంలో సాంకేతిక ఆధునికీకరణ- పెంపుదలకు వీలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

15

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), ఐపీ ఆస్ట్రేలియా మధ్య ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టీకేడీఎల్) యాక్సెస్ ఒప్పందం

ఇది ఐపీ ఆస్ట్రేలియాకు టీకేడీఎల్ (ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ) డేటాబేస్ యాక్సెస్ కల్పిస్తుంది.

16

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

ఔషధ లక్ష్యాల గుర్తింపు దిశగా ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ట్రైనీ కార్యక్రమాలు, బోధనా సిబ్బంది పరస్పర మార్పిడి కార్యక్రమాలతో సహా భవిష్యత్తు సహకారం కోసం ఇరు సంస్థల మధ్య ఇది అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది.

17

కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్‌ఎఫ్‌టీఐ), ఆస్ట్రేలియాకు చెందిన సౌత్ బ్రిస్బేన్‌లోని గ్రిఫిత్ ఫిల్మ్ స్కూల్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)

సంయుక్త విద్యాసంబంధిత కార్యకలాపాలు- వర్క్‌షాప్‌లు, సినిమా- దాని అనుబంధ రంగాలలో ఉమ్మడి ప్రాజెక్టుల అభివృద్ధి, స్వల్పకాలిక వర్క్‌షాప్‌లు లేదా సమ్మర్ స్కూల్స్‌లో పరస్పర సహకారంతో సహా ఒక ఫ్లెక్సిబుల్, బహిరంగ భాగస్వామ్య చట్రాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది.

18

విక్టోరియా యూనివర్సిటీకి అనుమతి పత్రం (ఎల్‌ఓఏ- లెటర్ ఆఫ్ అప్రూవల్) అందజేత

ఇది విక్టోరియా యూనివర్సిటీ గురుగ్రామ్‌లో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి అనుమతిస్తుంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఆగష్టు 2026
August 23, 2026

From Free Coaching to 400+ Space Startups — India’s Atmanirbhar Leap Under PM Modi