1. అభివృద్ధి సాయం

క్రమ సంఖ్య

శీర్షిక

1.

సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ నౌక బహుమతి

2.

సీషెల్స్ రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, 5 సెట్ల లేజర్ రేడియల్ క్లాస్ పడవలు అందజేత

3.

సీషెల్స్ ప్రభుత్వానికి ఆరు అంబులెన్సుల అప్పగింత

4.

సీషెల్స్ ప్రభుత్వానికి 500 మెట్రిక్ టన్నుల బియ్యం.

5.

సీషెల్స్ ప్రభుత్వానికి 8500 మెట్రిక్ టన్నుల సిమెంట్ అందజేత

2. ప్రకటనలు

క్రమ సంఖ్య

శీర్షిక

1.

భారత్, సీషెల్స్ మధ్య ఉన్న 50 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా స్మారక లోగో ఆవిష్కరణ

2.

వృత్తి, సాంకేతిక విద్యా కేంద్రం కోసం వర్చువల్‌గా శంకుస్థాపన

3.

సీషెల్స్ తీర రక్షక దళం కోసం పూర్తయిన పీఎస్ జొరాస్టర్ పునరుద్ధరణ

4.

గ్లాస్ కాక్‌పిట్‌తో డార్నియర్ ఎయిర్ క్రాఫ్టు నవీకరణ

5.

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)లో చేరిన సీషెల్స్

3. కుదుర్చుకున్న/పునరుద్ధరించిన ఎంవోయూలు

క్రమసంఖ్య

ఒప్పందం

సంక్షిప్త వివరణ

1.

సుష్మా స్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ (ఎస్ఎస్ఐఎఫ్ఎస్), సీషెల్స్ విదేశీ వ్యవహారాలు, ప్రవాస మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్ఏడీ)కు మధ్య అవగాహనా ఒప్పందం

ఈ ఒప్పందం ఇచ్చిపుచ్చుకోవడం, శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య నిర్మాణం ద్వారా సీషెల్స్ ఎంవోఎఫ్ఏడీకీ, ఎస్ఎస్ఐఎఫ్ఎస్‌కూ మధ్య సంస్థాగత సహకారాన్ని సాధ్యం చేస్తుంది. 

2.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, సీషెల్స్ సెంట్రల్ బ్యాంకు మధ్య అవగాహనా ఒప్పందం.

సీషెల్స్‌లో యూపీఐ డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల విస్తరణను ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది. చెల్లింపుల వ్యవస్థలో విస్తృత సహకారానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తుంది. 

3.

జనఔషధి పథకం పరిధిలో హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, సీషెల్స్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం

జనఔషధి పథకం ద్వారా తక్కువ ధరకే లభించే జనరిక్ ఔషధాలను, వైద్య పరికరాలను భారత్ నుంచి సీషెల్స్‌కు ఎగుమతి చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

4.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), సీషెల్స్ వ్యవసాయ విభాగం, మత్స్య, వ్యవసాయం, సముద్ర ఆర్థిక వ్యవస్థ మంత్రిత్వ శాఖ మధ్య వ్యవసాయ పరిశోధన, విద్యలో సహకారంపై అవగాహన ఒప్పందం, 2026–2031 కార్యాచరణ ప్రణాళిక.

ఉమ్మడి పరిశోధన, శిక్షణ, సాంకేతిక అధ్యయనాల్లో ఐసీఏఆర్, సీషెల్స్ వ్యవసాయం విభాగం మధ్య సహకారాన్ని ఏర్పాటు చేయడం, ప్రోత్సహించడం, వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందాన్నీ, కార్యాచరణ ప్రణాళికనూ రూపొందించారు. 

5.

భారత్, సీషెల్స్ మధ్య నేరస్తుల అప్పగింత ఒడంబడిక

అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో, రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థను  విస్తరించడంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ ఒడంబడిక లక్ష్యం.

6.

సీషెల్స్ నౌకల్లో పనిచేస్తున్న నావికా సిబ్బంది శిక్షణ, ధ్రువీకరణ గుర్తింపునకు సంబంధించి సీషెల్స్ రవాణా, పోర్టులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకూ, భారత దేశ పోర్టులు, నౌకా రవాణా, జల మార్గాల మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహనా ఒప్పందం.

సీషెల్స్ నౌకల్లో పనిచేయడానికి భారతీయ నావికుల శిక్షణ, ధ్రువీకరణ గుర్తింపును ఈ ఎంవోయూ సులభతరం చేస్తుంది.

7.

సీషెల్స్ ప్రభుత్వం, ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రుణ ఒప్పందం

సీషెల్స్‌లో ప్రాధాన్య మౌలిక వసతులనూ, అభివృద్ధి కార్యక్రమాలనూ ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా 2026, ఫిబ్రవరిలో అధ్యక్షుడు హెర్మిని పర్యటన నేపథ్యంలో ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (ఎస్ఈపీ) పరిధిలోని ప్రాజెక్టుల అమలుకు సహకరించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

8.

అంతరిక్ష అన్వేషణ, శాంతియుత ప్రయోజనాల కోసం దాని వినియోగంపై భారత ప్రభుత్వం, సీషెల్స్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం.

ఉపగ్రహ అనువర్తనాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ ఎంవోయూ లక్ష్యం.

9

సీషెల్స్ నూతన జాతీయ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక సన్నాహాలపై భారత ప్రభుత్వం, సీషెల్స్ ప్రభుత్వ మధ్య అవగాహన ఒప్పందం.

సీషెల్స్ నూతన జాతీయ ఆసుపత్రికి సంబంధించి ద్వైపాక్షిక సహకారానికి అవసరమైన విధానాన్ని ఈ ఎంవోయూ ఏర్పాటు చేస్తుంది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఆగష్టు 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision