సభాకార్యకలాపాలు

*    బిమ్స్‌టెక్ వాణిజ్య మండలి ఏర్పాటు.
*    బిమ్స్‌టెక్ సభాకార్యకలాపాల శిఖరాగ్ర సదస్సును ఏటా నిర్వహించడం.
*   బిమ్స్‌టెక్ ప్రాంతంలో స్థానిక కరెన్సీలో వ్యాపార నిర్వహణ  సాధ్యపడుతుందా అనే అంశాన్ని అధ్యయనం చేయడం.

ఐటీ

*   డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో సంపాదించిన అనుభవాన్ని పంచుకోవడానికి బిమ్స్‌టెక్ సభ్యదేశాల అవసరాలను తెలుసుకొనేందుకుగాను ఒక ప్రయోగాత్మక అధ్యయనాన్ని చేపట్టడం.
*   యూపీఐకి, బిమ్స్‌టెక్ ప్రాంతంలో చెల్లింపు వ్యవస్థలకు మధ్య సంధానాన్ని ఏర్పరచడం.

విపత్తుల నిర్వహణ, ఉపశమన చర్యలు

*   విపత్తులు సంభవించిన సందర్భాల్లో నిర్వహణ- ఉపశమన చర్యలు, పునరావాస కల్పనలో సహకారాన్ని అందించడానికి భారత్‌లో బిమ్స్‌టెక్ ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేయడం.
*   భారత్‌లో ఈ సంవత్సరం బిమ్స్‌టెక్ ప్రాంత విపత్తు నిర్వహణ అధికారుల మధ్య నాలుగో సంయుక్త కార్యాచరణను ఏర్పాటు చేయనున్నారు.

భద్రత

*   హోం మంత్రుల మొట్టమొదటి సమావేశాన్ని భారత్‌‌లో నిర్వహించనున్నారు.

అంతరిక్ష రంగం

*   బిమ్స్‌టెక్ దేశాల మావన వనరుల శిక్షణ, నానో శాటిలైట్ నిర్మాణం-ప్రయోగం, రిమోట్ డేటా ఉపయోగం.. వీటి కోసం గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం.

సామర్థ్యాలు పెంచే కార్యక్రమాలు, శిక్షణ

*   ‘బిమ్స్‌టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (బీఓడీహెచ్ఐ.. ‘బోధి’) కార్యక్రమాన్ని అమలుచేయడం. ఈ కార్యక్రమంలో భాగంగా, బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన 300 మంది యువజనులకు ప్రతి సంవత్సరం ఇండియాలో శిక్షణనిస్తారు.

*   ఫారెస్ట్రీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బిమ్స్‌టెక్ విద్యార్థులకు ఉపకార వేతనాలతోపాటు, నలందా విశ్వవిద్యాలయంలో అమలవుతున్న ఉపకార వేతన పథకం విస్తరణ.

*   బిమ్స్‌టెక్ దేశాల యువ దౌత్యవేత్తలకు ప్రతి సంవత్సరం శిక్షణ కార్యక్రమం.

*   బిమ్స్‌టెక్ దేశాల్లో క్యాన్సర్ సంబంధిత సంరక్షణలో శిక్షణ కార్యక్రమాలకు, సామర్థ్యాల్ని పెంచే కార్యక్రమాలకు టాటా మెమోరియల్ సెంటర్ అండదండలు అందించనుంది.

*   సాంప్రదాయక వైద్యంలో పరిశోధన, వ్యాప్తి.. ఈ ఉద్దేశాలతో ఒక ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేస్తారు.

*   రైతులకు లాభదాయకంగా ఉండేలా జ్ఞానాన్ని, అత్యుత్తమ పద్ధతులను, పరిశోధన ఫలితాలను, సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్‌లో ఒక ఎక్స్‌లెన్స్ సెంటరును ఏర్పాటు చేయనున్నారు.

ఇంధనం

*   బెంగళూరులో బిమ్స్‌టెక్ ఎనర్జీ సెంటర్ పనిచేయడం మొదలుపెట్టింది.

*   విద్యుత్తు గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్‌కు సంబంధించిన పనులు వేగంగా పూర్తి అయ్యేటట్లు చూస్తారు.

యువత భాగస్వామ్యం

*   బిమ్స్‌టెక్ యువ నేతల శిఖరాగ్ర సదస్సును ఈ సంవత్సరంలో నిర్వహించనున్నారు.

*   బిమ్స్‌టెక్ హ్యాకథాన్-యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

క్రీడలు

*   ‘బిమ్స్‌టెక్ అథ్లెటిక్స్ మీట్’ను ఈ సంవత్సరం భారత్‌లో నిర్వహించనున్నారు.

*    2027లో మొట్టమొదటిసారిగా ‘బిమ్స్‌టెక్ గేమ్స్’ను నిర్వహణ.

సంస్కృతి

*   బిమ్స్‌టెక్ సాంప్రదాయక సంగీత ఉత్సవాన్ని ఈ సంవత్సరం భారత్‌లో నిర్వహించనున్నారు.

సంధానం

*   సామర్థ్యాలను పెంచే కార్యక్రమాలు, పరిశోధన, నవకల్పన, సముద్ర సంబంధిత విధానాలలో సమన్వయాన్ని ఇప్పటికన్నా పెంచే దిశలో కృషి చేయడానికి సస్టేనబుల్ మారిటైం ట్రాన్స్‌పోర్ట్ సెంటరును భారత్‌లో ఏర్పాటు చేస్తారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఆగష్టు 2026
August 23, 2026

From Free Coaching to 400+ Space Startups — India’s Atmanirbhar Leap Under PM Modi