షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వరి 24వ, 25వ తేదీల లో భార‌త‌దేశం లో ఆధికారికం గా ప‌ర్యటించారు.

 

కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబ‌ల్ స్ట్ర‌టీజిక్ పార్ట్‌ న‌ర్ శిప్

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మరియు అద్య‌క్షుడు శ్రీ ట్రంప్ సార్వ‌భౌమ మ‌రియు గ‌తిశీల ప్రజాస్వామ్య దేశాల నేత‌ ల హోదా లో పౌరులు అంద‌రి కీ స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, మాన‌వ‌హ‌క్కుల తో పాటు చ‌ట్టం ప‌ట్ల క‌ట్టుబాటు ల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తెరుగుతూ, ప‌ర‌స్ప‌ర విశ్వాసం, ఉమ్మ‌డి హితాలు, సౌహార్దత, ఇంకా ఇరు దేశాల పౌరుల ప్ర‌గాఢ‌మైన అనుబంధాల తో పెన‌వేసుకొని ఉన్న‌ ఒక ఇండియా- యుఎస్ కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబ‌ల్ స్ట్ర‌టీజిక్ పార్ట్‌ న‌ర్ శిప్ ను బ‌ల‌ప‌ర‌చాల‌ని సంక‌ల్పించారు.

 

భ‌ద్ర‌త మ‌రియు ర‌క్ష‌ణ సంబంధిత స‌హ‌కారాన్ని గాఢ‌త‌రం చేసుకోవాల‌ని, ప్ర‌త్యేకించి స‌మాచారాన్ని ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం వెల్ల‌డించుకోవ‌డం, అంత‌రిక్షం మ‌రియు స‌ముద్ర సంబంధిత అవ‌గాహ‌న ను పెంపొందింప చేసుకోవాల‌ని; సంయుక్త స‌హ‌కారాని కి పెద్ద‌ పీట ను వేయాల‌ని; సైనిక సంబంధాల సిబ్బంది ని ఆదాన ప్ర‌దానాల కు అనుమ‌తించాల‌ని; ప్ర‌త్యేక బ‌ల‌గాలు మ‌రియు అన్ని ద‌ళాల మ‌ధ్య విన్యాసాల‌ ను మ‌రియు అధునాత‌న శిక్ష‌ణ ను విస్త‌రించాల‌ని; ర‌క్ష‌ణ రంగాని కి సంబంధించిన ఆధునిక విడి భాగాల‌ ను, సామ‌గ్రి ని, ఇంకా ప్లాట్‌ ఫార్మ్ ల‌ను క‌ల‌సి ఉత్ప‌త్తి చేయాల‌ని; త‌త్సంబ‌ంధిత స‌హ అభివృద్ధి ప్రక్రియ లో స‌న్నిహిత స‌మ‌న్వ‌యాన్ని నెల‌కొల్పుకోవాల‌ని; అలాగే ర‌క్ష‌ణ రంగ ప‌రిశ్ర‌మ‌ల లో భాగ‌స్వామ్యాన్ని క‌లిగివుండాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ  మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ప్ర‌తిన‌బూనారు.

 

ఇండో-ప‌సిఫిక్ ప్రాంతం లో శాంతి ని, స్థిర‌త్వాన్ని, నియ‌మావ‌ళి పై ఆధార‌ప‌డిన క్ర‌మానుగ‌త వ్య‌వ‌స్థ ను ఒక బ‌ల‌మైన మ‌రియు స‌మర్ధమైన భార‌త‌దేశ సైన్యం స‌మ‌ర్ధిస్తుంద‌ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ గ‌మ‌నం లోకి తీసుకొని, భార‌త‌దేశాని కి అధునాతన యుఎస్ మిలిట‌రీ టెక్నాల‌జీ ని బ‌ద‌లాయించేందుకు మద్దతిస్తానంటూ త‌న వాగ్దానాన్ని పున‌రుద్ఘాటించారు. ఎహెచ్-64ఇ అపాచీ హెలికాప్టర్స్ తో పాటు ఎమ్‌-60ఆర్ నావ‌ల్ హెలికాప్టర్స్ ను కొనుగోలు చేయాల‌ని భార‌త‌దేశం ఇటీవ‌ల తీసుకొన్న నిర్ణ‌యాన్ని ఆయ‌న ఆహ్వానించారు. ఈ శ‌క్తియుక్తులు ఉభ‌య దేశాల మ‌ధ్య పారిశ్రామిక సంబంధ స‌హ‌కారాన్ని, కొలువుల లో వృద్ధి ని పెంపొందించ‌డ‌మే కాక భ‌ద్ర‌త ప‌ర‌మైన ప్ర‌యోజ‌నాల ను కూడా వ‌ర్ధిల్ల‌జేయగలవు. భార‌త‌దేశం న‌వీనమైన ర‌క్ష‌ణ రంగ సామ‌ర్ధ్యాల ను స‌మీక‌రించుకొనేందుకు కృషి చేస్తున్న క్ర‌మం లో అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ఒక ప్ర‌ధాన‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్య దేశం గా భార‌త‌దేశాని కి ఉన్న హోదా ను మ‌రొక్క మారు స్ప‌ష్టీక‌రించారు. సాంకేతిక విజ్ఞాన బ‌దిలీ మ‌రియు సాంకేతిక విజ్ఞాన కొనుగోలు.. ఈ అంశాల లో భార‌త‌దేశాన్ని అత్యున్న‌తం గా ప‌రిగ‌ణించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. బేసిక్ ఎక్స్ చేంజ్ ఎండ్ కోఆప‌రేశన్‌ అగ్రిమెంట్ స‌హా ర‌క్ష‌ణ రంగాని కి సంబంధించిన స‌హ‌కార‌ భ‌రిత ఒప్పందాల ను త్వ‌ర‌లో ఒక కొలిక్కి తెచ్చుకోవాల‌ని నేత‌లు ఇరువురూ ఆశిస్తున్నారు.

 

సైబ‌ర్ స్పేస్ లో నేరాలు, మ‌త్తు ప‌దార్థాల అక్ర‌మ ర‌వాణా, ఉగ్ర‌వాదం, హింసాత్మ‌క అతివాదం, మాన‌వుల అక్ర‌మ త‌ర‌లింపు ల వంటి అంత‌ర్జాతీయ నేరాల పై క‌ల‌సిక‌ట్టుగా పోరాడ‌డం మ‌రియు ఆయా అంశాల లో స‌హ‌క‌రించుకోవ‌డం ద్వారా త‌మ స్వ‌దేశాల లో భ‌ద్ర‌త ను ఇతోధికం చేసుకోవాలి అని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ తీర్మానించారు. హోమ్‌ లాండ్ సెక్యూరిటీ డైలాగ్ ను పునఃపుష్టి చేసుకోవాల‌ని భార‌త దేశీయ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ, యుఎస్ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోమ్‌ లాండ్ సెక్యూరిటీ లు తీసుకొన్న నిర్ణ‌యాన్ని వారు స్వాగ‌తించారు. చ‌ట్ట విరుద్ధ మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల త‌మ పౌరుల కు ఎదురవుతున్న ముప్పు పై పోరాడాల‌న్న త‌మ ఉమ్మ‌డి నిబ‌ద్ధ‌త ను చాటి చెప్పే క్ర‌మం లో చ‌ట్టం అమ‌లు ఏజెన్సీ ల మ‌ధ్య ఒక నూత‌న కౌంట‌ర్ నార్ కోటిక్స్ వ‌ర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని వారు వ్యక్తం చేశారు.

 

భార‌త‌దేశం-యునైటెడ్ స్టేట్స్ సంబంధాల లో వాణిజ్యం మ‌రియు పెట్టుబ‌డి పార్శ్వానికి గ‌ల ప్రాముఖ్యం అధికం అవుతూ ఉండ‌టాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్  గ‌మ‌నించారు. ఇటు భార‌త‌దేశం, అటు అమెరికా.. ఈ రెండు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల కు లాభ‌దాయ‌కం గా ఉండే విధం గా దీర్ఘకాల వ్యాపార స్థిర‌త్వం నెల‌కొనాల్సిన ఆవ‌శ్య‌క‌త ను కూడా వారు గుర్తించారు. ప్ర‌స్తుతం సాగుతున్న సంప్ర‌దింపుల ను స‌కాలం లో పూర్తి చేసుకోవాల‌ని వారు అంగీకారాని కి వ‌చ్చారు. త‌త్ఫ‌లితం గా ఒక సంపూర్ణ ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందం తాలూకు ఒక‌టో ద‌శ రూపుదాల్చుతుంద‌ని వారు ఆశించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల యొక్క పూర్తి స‌త్తా ను, వాస్త‌వ ఆకాంక్ష ను ఈ ద‌శ ప్ర‌తిబింబిస్తుంది. అంతేకాదు, ఉభయ దేశాల లో ఉద్యోగ క‌ల్ప‌న‌, పెట్టుబ‌డి, ఇంకా సమృద్ధి ల పెంపుద‌ల ను కూడా ఇది సూచిస్తుంది.

 

హైడ్రోకార్బ‌న్ ల వ్యాపారం మ‌రియు సంబంధిత పెట్టుబ‌డి ఈ అంశాల లో భార‌త‌దేశాని కి మ‌రియు యునైటెడ్ స్టేట్స్ కు మ‌ధ్య అవ‌కాశాలు పెరుగుతూ ఉండ‌టాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ హ‌ర్షించారు. స్ట్ర‌టీజిక్ ఎన‌ర్జీ పార్ట్‌ న‌ర్ శిప్ ద్వారా శ‌క్తి భ‌ద్ర‌త ను పెంపొందించుకోవాల‌ని, శ‌క్తి ఉత్పాద‌న ను విస్త‌రించుకోవాల‌ని, ఆయా శ‌క్తి రంగాలన్నిటి లో నూత‌న ఆవిష్క‌ర‌ణ లంకెల ను ముమ్మ‌రం చేసుకోవాల‌ని, వ్యూహాత్మ‌క ఏకీక‌ర‌ణ ను ఉన్న‌తీక‌రించుకోవాల‌ని, ప‌రిశ్ర‌మ కు మ‌రియు ఇత‌ర సంబంధిత వ‌ర్గాల‌న్నిటి మ‌ధ్య అనుబంధాన్ని గాఢతరం చేసు

కోవాల‌ని నేత‌లు అభిల‌షించారు. కోకింగ్ కోల్, మెట‌ల‌ర్జిక‌ల్ కోల్ మ‌రియు స‌హ‌జ వాయువు ల తాలూకు దిగుమ‌తి ప‌రిధి ని విస్త‌రించుకోవాల‌న్న భార‌త‌దేశం యొక్క ల‌క్ష్యాన్ని నెరవేర్చేందుకు యుఎస్ కు ఉన్న‌ అవ‌కాశాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ గుర్తించారు. భార‌తదేశ విప‌ణి లో ఎల్ఎన్‌జి ల‌భ్య‌త స్థాయి ని పెంచేందుకు ఉద్దేశించిన ఇటీవ‌లి వాణిజ్య ప‌ర‌మైన ఏర్పాటుల ను వారు ఆహ్వానించారు. భార‌త‌దేశం లో ఆరు న్యూక్లియ‌ర్స్ రియాక్ట‌ర్స్ నిర్మాణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం కోసం వెస్టింగ్ హౌస్ ఇలెక్ట్రిక్ కంపెనీ మ‌రియు న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేశ‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాటి సాంకేతిక ప‌ర‌మైన మ‌రియు వాణిజ్యప‌ర‌మైన ప్ర‌తిపాద‌న ను ఖాయం చేసుకోవాలి అంటూ ఆ సంస్థ‌ల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ  మరియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ప్రోత్స‌హించారు.

 

విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌లో అభ్యాస పూర్వ‌క స‌హ‌కారం చిర‌కాలం గా కొన‌సాగుతుండటం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. 2022వ సంవ‌త్స‌రం లో ఒక సంయుక్త సాహ‌స యాత్ర ను ప్రారంభించ‌డం కోసం నేశ‌న‌ల్ ఏరోనాటిక్స్ ఎండ్ స్పేస్ అడ్మినిస్ట్రేశ‌న్ (ఎన్ఎఎస్ఎ) మ‌రియు భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ) ల ప్రయ‌త్నాన్ని వారు స్వాగ‌తించారు. ఈ యాత్ర లో భాగం గా ప్ర‌పంచం లో కెల్లా ఒక‌టో డ్యూయ‌ల్-ఫ్రీక్వెన్సీ సింథ‌టిక్ ఎపర్చర్‌ రాడార్ శాటిలైట్ ను అభివృద్ధి ప‌ర‌చ‌నున్నారు. అంతేకాకుండా ధ‌రిత్రి ప‌రిశీల‌న‌, అంగార‌క మ‌రియు గ్ర‌హ స్థితి సంబంధిత అన్వేష‌ణ‌, హీలియో ఫిజిక్స్‌, మాన‌వ స‌హిత రోద‌సి యానం, ఇంకా అంత‌రిక్షం లో వాణిజ్య సంబంధిత స‌హ‌కారం.. ఈ రంగాల లో ఇతోధిక స‌హ‌కారం సంబంధిత చ‌ర్చ‌లు పురోగ‌మించడం ప‌ట్ల నేత‌లు ఇరువురూ ప్ర‌శంస ను వ్య‌క్తం చేశారు.

 

యునైటెడ్ స్టేట్స్ లో భార‌త‌దేశ విద్యార్థుల సంఖ్య ఇటీవ‌ల కాలం లో వృద్ధి చెంద‌డాన్ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. ఉన్న‌త విద్య తాలూకు స‌మ‌న్వ‌యాన్ని పెంపు చేసుకోవాల‌ని, మ‌రియు ‘‘యంగ్ ఇన‌వేట‌ర్స్‌’’ ఇన్‌ట‌ర్న్‌ శిప్ ద్వారాను, అన్య విద్యారంగ సంబంధిత ఆదాన ప్ర‌దాన అవ‌కాశాల ను వేగిర ప‌ర‌చుకోవాల‌ని కూడా వారు ఆకాంక్షించారు.

 

నావెల్ క‌రోనా వైర‌స్ (novel COVID-19) వంటి వ్యాధుల ను గుర్తించ‌డం, దీటు గా ప్ర‌తిస్పందించ‌డం మ‌రియు నివారించ‌డం కోసం జ‌రుగుతున్న ప్ర‌పంచ స్థాయి య‌త్నాల ను అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ తో పాటు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స‌మ‌ర్ధించారు. అటువంటి విప‌రిణామాల ప‌ట్ల స‌త్వ‌ర నిర్ధార‌ణ‌, నివార‌ణ ల‌లో స‌ఫ‌ల ప్ర‌య‌త్నాల ను కొన‌సాగిద్దాం అంటూ వారు కంక‌ణం క‌ట్టుకొన్నారు. యుఎస్ మ‌రియు భార‌తదేశం వినియోగ‌దారుల కోసం ఉన్న‌త నాణ్య‌త తో కూడిన‌, సుర‌క్షిత‌మైన, ప్ర‌భావశీల‌మైన మ‌రియు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఔష‌ధాల ల‌భ్య‌త ను ప్రోత్స‌హించాల‌ని త‌ల‌పోస్తున్న ఒక ద్వైపాక్షిక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు) సాకారం కావ‌డం ప‌ట్ల వారు హ‌ర్షాన్ని వెలిబుచ్చారు. మాన‌సిక స్వ‌స్థ‌త ప‌ర‌మైన స‌వాళ్ళ ను ఎదుర్కోవ‌డం లో వినూత్న‌మైన పోక‌డ‌ల తో స‌హ‌క‌రించుకోవాల‌ని ఉద్దేశించినటువంటి ఒక ఒప్పందం ఇరు దేశాల కు స‌హాయ‌కారి కాగ‌ల‌దంటూ  సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

 

స్ట్ర‌టీజిక్ క‌న్వర్జన్స్ ఇన్ ద ఇండో-ప‌సిఫిక్‌

 

ఒక శాంతియుత‌మైన, స్వేచ్ఛాయుత‌మైన‌, బాహాట‌మైన, క‌లుపుకొని పోయే మ‌రియు స‌మృద్ధ‌మైన‌ ఇండో-ప‌సిఫిక్ ప్రాంతాని కి భార‌త‌దేశం, యునైటెడ్ స్టేట్స్ ల మ‌ధ్య స‌న్నిహిత భాగ‌స్వామ్యం అనేది కేంద్ర బిందువు గా ఉంది. ఈ స‌హ‌కారం ఆసియాన్ యొక్క కేంద్రీయ స్థానాని కి గుర్తింపు ల‌భించ‌డం పైన, అంత‌ర్జాతీయ చ‌ట్టాని కి మ‌రియు సుప‌రిపాల‌న కు క‌ట్టుబ‌డి ఉండ‌టం; స్వేచ్ఛాయుత మార్గ‌నిర్దేశం; ఇంకా భ‌ద్ర‌త కు తోడ్పాటు; స‌ముద్ర ప్రాంతాల ను చ‌ట్ట ప‌రిధి లో వినియోగించుకోవ‌డం; చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వాణిజ్యాని కి ఏవిధ‌మైన‌టువంటి అవ‌రోధాలు ఉండ‌క‌పోవ‌డం; సముద్ర సంబంధ వివాదాల ను అంత‌ర్జాతీయ చ‌ట్టాని కి అనుగుణం గా శాంతియుత రీతిన ప‌రిష్క‌రించుకోవాల‌ని అనేట‌టువంటి వాదం వంటివి ఆధారం గా బలపడనుంది.

 

హిందూ మ‌హా స‌ముద్ర ప్రాంతం లో భద్రత కు నికర పూచీదారు దేశం గాను, అభివృద్ధియుత‌మైన మ‌రియు మాన‌వీయ దృక్ప‌థం తో కూడిన స‌హాయాన్ని అందించే దేశం గాను  భార‌త‌దేశం పోషిస్తున్నటువంటి పాత్ర ను యునైటెడ్ స్టేట్స్ ప్ర‌శంసిస్తున్న‌ది. ఈ ప్రాంతం స్థిరం గా, పార‌ద‌ర్శ‌కం గా, నాణ్య‌మైన మౌలిక స‌దుపాయాల తో అభివృద్ధి చెందాలి అనే ఆశ‌యం పట్ల యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌త‌దేశం నిబ‌ద్ధ‌త తో ఉన్నాయి. భార‌త‌దేశం లో అక్ష‌య శ‌క్తి ప‌థ‌కాల‌ కు గాను 600 మిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక స‌హాయాన్ని యుఎస్ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ డివెల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేశన్ (డిఎఫ్‌సి) ప్ర‌క‌టించ‌డాన్ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స్వాగ‌తించారు. ఈ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం లో ఒక శాశ్వ‌త ఉనికి ని ఏర్ప‌ర‌చాలంటూ డిఎఫ్‌సి తీసుకొన్న నిర్ణ‌యాన్ని కూడా వారు ఉభ‌యులూ ఆహ్వానించారు.

 

ఇండో– ప‌సిఫిక్ ప్రాంతం లో మ‌రియు ప్రపంచం లో స‌మ‌ర్ధ‌మైన అధునాతన అభివృద్ధి పూర్వ‌క సేవ‌ల కు త‌మ దేశాలు ఉమ్మ‌డి గా వచనబ‌ద్ధ‌త ను వ్య‌క్తం చేయ‌డాన్ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌స్తావించారు. తృతీయ ప్ర‌పంచ దేశాల లో స‌హ‌కారం కోసం భారతదేశానికి చెందిన డివెల‌ప్‌ మెంట్ పార్ట్ న‌ర్ శిప్ అడ్మినిస్ట్రేశ‌న్ కు మ‌రియు యుఎస్ఎఐడి కి మ‌ధ్య క్రొత్త భాగ‌స్వామ్యం ఆరంభం కావ‌డం కోసం వేచివున్నట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మరియు  అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ప్ర‌క‌టించారు.

 

సౌత్ చైనా సీ లో ఒక అర్థ‌వంత‌మైన‌టువంటి కోడ్ ఆఫ్ కండ‌క్ట్ నెల‌కొనే దిశ గా సాగుతున్న ప్ర‌య‌త్నాల ను యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌త‌దేశం గ‌మ‌నం లోకి తీసుకొన్నాయ‌ని, ఇది అన్ని దేశాల చ‌ట్ట‌బ‌ద్ధ హ‌క్కులకు మ‌రియు హితాల కు, అంత‌ర్జాతీయ చ‌ట్టాని కి అనుగుణం గా ఎటువంటి ప‌క్ష‌పాతాన్ని చూప‌కూడ‌ద‌ని వారు దృఢం గా విన్న‌వించారు.

 

ఇండియా-యుఎస్-జ‌పాన్ త్రైపాక్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నాలు; భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ విదేశీ వ్యవహారాలు, ఇంకా రక్షణ మంత్రుల నడుమ 2+2 మంత్రిత్వ స్థఆయి సమావేశ సంబంధి యంత్రాంగం మ‌రియు ఇండియా-యుఎస్-ఆస్ట్రేలియా-జ‌పాన్ చతుస్ప‌క్ష సంప్ర‌దింపుల ద్వారా చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ను ప‌టిష్ట ప‌ర‌చాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ  మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ నిర్ణ‌యించారు. యునైటెడ్ స్టేట్స్, భార‌త‌దేశం, ఇంకా ఇత‌ర భాగ‌స్వామ్య దేశాల న‌డుమ స‌ముద్ర రంగ సంబంధిత చైత‌న్యం మ‌రింత గా వృద్ధి చెందేట‌ట్లు చూడాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ  మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ఆశించారు.

 

ప్ర‌పంచ నాయ‌క‌త్వం కోసం భాగ‌స్వామ్యం

 

ఐక్య రాజ్య స‌మితి మ‌రియు ఇత‌ర అంత‌ర్జాతీయ సంస్థ‌ల ను సంస్క‌రించి, వాటి యొక్క న్యాయవ‌ర్త‌న ను పెంపొందింప చేసేందుకు క‌ల‌సి కృషి చేయాల‌ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ సంక‌ల్పించారు. సంస్క‌ర‌ణ కు లోనైన ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లి లో భార‌త‌దేశాని కి శాశ్వ‌త స‌భ్య‌త్వం విష‌యం లో యునైటెడ్ స్టేట్స్ మ‌ద్దతిస్తుంది అని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ పున‌రుద్ఘాటించారు. ఎంత మాత్రం జాప్యానికి తావు లేని రీతి లో న్యూక్లియ‌ర్ సప్ల‌య‌ర్స్ గ్రూపు లో భార‌త‌దేశం శీఘ్ర ప్ర‌వేశాని కి సైతం యుఎస్ మ‌ద్దతిస్తుందని కూడా ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల లోను, అల్పాదాయ దేశాల లోను సార్వ‌భౌమ రుణం పేరుకు పోతుండ‌టాన్ని అరిక‌ట్ట‌డం కోసం రుణ స్వీక‌ర్త‌ల కు మ‌రియు రుణ‌దాత‌ల కు  బాధ్య‌తాయుత‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన మ‌రియు స్థిర ప్రాతిప‌దిక‌ తో కూడిన ఆర్థిక స‌హాయ అభ్యాసాలు నెల‌కొనేలా చూడటం ఎంత‌యినా ముఖ్యమ‌ని యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌త‌దేశం గుర్తించాయి. ప్ర‌పంచ శ్రేణి మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి అధిక నాణ్య‌త‌ తో కూడిన విశ్వ‌స‌నీయ‌మైన ప్ర‌మాణాల ను ప్రోత్స‌హించ‌డం కోసం ప్ర‌భుత్వాలు, ప్రైవేటు రంగం మ‌రియు పౌర స‌మాజం.. ఈ మూడిటి ని ఒక చోటు కు చేర్చే బ‌హుళ భాగ‌స్వామ్య‌యుత కార్య‌క్ర‌మం ‘బ్లూ డాట్ నెట్ వ‌ర్క్’  ఆలోచ‌న ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ఆస‌క్తి ని వ్య‌క్తం చేశారు.

 

బాలిక‌ లు మ‌రియు మ‌హిళ‌ లు విద్య ప‌రంగా, ఆర్థిక సాధికారిత ప‌రం గా మ‌రియు న‌వపారిశ్రామిక‌త్వం ప‌రంగా ముందంజ వేయ‌డానికి గల ప్రాధాన్యాన్ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ లెక్క‌ లోకి తీసుకొన్నారు. దీని కోసం ఆర్థిక సాయం, శిక్ష‌ణ‌, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వంటి చొర‌వ‌ల‌ తో పాటే భార‌త ప్ర‌భుత్వం యొక్క ‘బేటీ బ‌చావో బేటీ పఢావో’ కార్య‌క్ర‌మం మ‌రియు యునైటెడ్ స్టేట్స్ యొక్క విమెన్స్ గ్లోబ‌ల్ డివెల‌ప్‌ మెంట్ ఎండ్ ప్రాస్ప‌రిటీ (డబ్ల్యు-జిడిపి) ల‌కు అనుగుణం గా ఆర్థిక వ్య‌వ‌స్థ లో బాలికల మరియు మహిళల పూర్తి స్థాయి స్వేచ్ఛాయుత‌మైన ప్రాతినిధ్యాన్ని ప్రోత్స‌హించే చ‌ర్య‌ లు కూడా అవ‌స‌రమన్న సంగతి ని వారు ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొన్నారు.

 

ఒక ఐక్య‌మైన‌టువంటి, సార్వ‌భౌమ‌త్వం క‌లిగిన‌టువంటి, ప్ర‌జాస్వామిక‌మైన‌టువంటి, అన్ని వ‌ర్గాల‌ ను క‌లుపుకొని పోయేట‌టువంటి, స్థిర‌మైన‌టువంటి మ‌రియు స‌మృద్ధ‌మైన‌టువంటి అఫ్గానిస్తాన్ ఆవిష్క‌రింపబ‌డాల‌ని యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌త‌దేశం దృఢం గా త‌ల‌పోశాయి. చిర ప్రాతిపదికన శాంతి; హింస కు స్వ‌స్తి; ఉగ్ర‌వాద ఆశ్ర‌యాల అంతం; అలాగే, గ‌డ‌చిన 18 సంవ‌త్స‌రాలు గా ఒన‌గూరిన లాభాల ప‌రిర‌క్ష‌ణ ల‌కు దారి తీయగల అఫ్గాన్ నాయ‌క‌త్వం లో, అఫ్గాన్ యాజ‌మాన్యం లో సాగే రాజీ ప్ర‌క్రియ‌, శాంతి లకు ఇరు ప‌క్షాలు మ‌ద్దతు ను వెలిబుచ్చాయి. అఫ్గానిస్తాన్ లో సంధానాన్ని స‌మ‌కూర్చ‌డానికి మరియు స్థిరీకరించడానికి భార‌త‌దేశం భ‌ద్ర‌త ప‌రం గాను, అభివృద్ధి ప్రధానంగా ను స‌హాయాన్ని అందించడాన్ని కొనసాగిస్తుండటాన్ని అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ఆహ్వానించారు.

 

సీమాంతర ఉగ్ర‌వాదాన్ని– దాని యొక్క అన్ని రూపాల‌ లో– ఎంత మాత్రం స‌హించేది లేదంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మరియు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అదేవిధం గా ప‌రోక్ష మార్గాల లో ఉగ్ర‌వాద చ‌ర్య‌ల కు తెగ‌బ‌డ‌టాన్ని సైతం వారు నిరసించారు.  పాకిస్తాన్ ఆధీనం లోని ఏ భూ భాగాన్నయినా సరే ఉగ్ర‌వాద దాడుల ను మొద‌లు పెట్టేందుకు వినియోగించ‌కుండా చూడ‌వ‌ల‌సింది గాను, 26/11 ముంబ‌యి మ‌రియు ప‌ఠాన్ కోట్ ఘ‌ట‌న‌లు స‌హా వారు ఆ త‌ర‌హా దాడుల కు ఒడిగట్టే వారి పై త‌క్ష‌ణ‌ చ‌ట్ట‌ప‌ర చర్య‌లు తీసుకోవలసిందిగాను వారు పిలుపునిచ్చారు. అల్‌-కాయిదా, ఐఎస్ఐఎస్, జైశ్-ఎ-మొహమ్మద్, ల‌ష్క‌ర్‌-ఎ-తయ్యిబా, హిజ్బ్ -ఉల్ ముజాహిదీన్, ద హ‌క్కానీ నెట్ వ‌ర్క్‌, టిటిపి, డి-కంపెనీ, ఇంకా వాటి అన్ని అనుబంధ సంస్థ‌లు స‌హా ఉగ్ర‌వాద మూక‌లు అన్నిటి పైనా ఏకీకృత చ‌ర్య తీసుకోవాలంటూ వారు  పిలుపునిచ్చారు.

 

వ్యాపారాన్ని మ‌రియు క‌మ్యూనికేశన్ ను సుల‌భ‌త‌రం చేస్తున్న‌టువంటి, అర‌మ‌రిక‌లు లేనటువంటి, ఆధార‌ ప‌డ‌ద‌గిన‌టువంటి మ‌రియు సురక్షితం అయిన‌టువంటి ఇంట‌ర్ నెట్ కు తాము నిబ‌ద్ధ‌మై ఉన్న‌ట్లు యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌తదేశం పేర్కొన్నాయి. స‌మాచారం మ‌రియు డేటా.. ఇవి ప‌దిల‌మైన రీతి లో, ఆధార‌ ప‌డ‌ద‌గిన విధం గా అందుబాటు లోకి వ‌చ్చేందుకు మార్గాన్ని సుగ‌మం చేయ‌గ‌లిగిన ఒక వినూత్న‌ డిజిట‌ల్ ఇకోసిస్ట‌మ్ ఆవిష్క‌రించ‌బ‌డడం ఎంత‌యినా అవ‌స‌రమని యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌తదేశం గుర్తించాయి. కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాలు మ‌రియు వ్యూహాత్మ‌క‌మైన సామగ్రి ఆంక్షలకు తావు లేకుండాను, భ‌ద్రం గాను ల‌భ్యం అయ్యేట‌ట్లు త‌మ త‌మ ప‌రిశ్ర‌మ మ‌రియు విద్య రంగాల లో స‌హ‌కారాన్ని మ‌రింత గా పెంపొందింప చేసుకోవాల‌న్న అభిమ‌తాన్ని నేత‌లు వ్య‌క్తం చేశారు. క్రొత్త‌ గా అందివ‌స్తున్న సాంకేతిక‌త‌ల ను ఉప‌యోగించుకోవ‌డం లో దాగి ఉన్న న‌ష్ట భ‌యాల ను ఏ పక్షానికి ఆ పక్షం స్వ‌తంత్రం గా అంచ‌నా వేయాల‌న్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు.

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM Modi to embark on 3-day visit to US to participate in Quad Leaders' Summit, address UNGA

Media Coverage

PM Modi to embark on 3-day visit to US to participate in Quad Leaders' Summit, address UNGA
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 సెప్టెంబర్ 2021
September 21, 2021
షేర్ చేయండి
 
Comments

Strengthening the bilateral relations between the two countries, PM Narendra Modi reviewed the progress with Foreign Minister of Saudi Arabia for enhancing economic cooperation and regional perspectives

India is making strides in every sector under PM Modi's leadership