1. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానం మేర‌కు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ అంజెలా మెర్కెల్ భార‌త‌దేశంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న అక్టోబ‌ర్ 31నుంచి నవంబ‌ర్ 1వ‌ర‌కూ కొన‌సాగింది. ఇరుదేశాల ప్ర‌భుత్వాల మ‌ధ్య‌న ఏర్పాటు చేసిన ఐదో ద‌ఫా చ‌ర్చ‌ల్లో ఆమె పాల్గొన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఛాన్స‌ల‌ర్ మెర్కెల్ తోపాటు ఆ దేశానికి చెందిన విదేశీ వ్య‌వ‌హారాలు , శాస్త్ర మ‌రియు విద్య‌, ఆహార మ‌రియు వ్య‌వ‌సాయ రంగాల‌కు చెందిన మంత్రులు, అధికారిక ప్ర‌తినిధులు పాల్గొన్నారు. అంతే కాదు జ‌ర్మ‌నీకి చెందిన ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్థ‌ల ప్ర‌తినిధులు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు. ఈ ప‌ర్య‌ట‌ల‌నో భాగంగా ఛాన్స‌ల‌ర్ మెర్కెల్ భార‌త రాష్ట్ర‌పతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ తో, ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
  2. భార‌త‌దేశ‌, జ‌ర్మ‌నీ దేశాల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం గురించి జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ మెర్కెల్‌, భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి సంబంధించిన ఉమ్మ‌డి విలువ‌లు, నియ‌మాల మీద‌, స్వేచ్ఛగా, నిజాయితీగా జ‌రిగే వాణిజ్యం మీద‌, అంత‌ర్జాతీయ వ్య‌వ‌హార శైలిమీద‌, ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కం, గౌర‌వాల మీద ఆధార‌ప‌డి వుంటుంద‌ని అన్నారు. ఈ చ‌ర్చ‌ల్లో చోటు చేసుకున్న ముఖ్య‌మైన అంశాలను చూస్తే..ప‌రిశోధ‌న మ‌రియు ప్ర‌ధాన‌మైన సాంకేతిక‌త‌ల సాయంతో ముఖ్యంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని ఉప‌యోగించుకొని ఇరుదేశాలు క‌లిసిక‌ట్టుగా డిజిటల్ రంగంలో ప్ర‌గ‌తిని సాధించాలి. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల విష‌యంలో ఒక‌రికొక‌రు స‌హ‌కరించుకుంటూనే ఆర్ధిక వృద్ధిని సుస్థిరం చేయాలి. నైపుణ్య‌త క‌లిగిన కార్మికులు ఇరు దేశాల్లో అధికారికంగా ప‌ని చేసేలా చూడ‌డంద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌న బంధాల‌కు కావల‌సిన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాలి. వివిధ రంగాల‌కు సంబంధించిన సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తూ, ఆధునీక‌రిస్తూ త‌ద్వారా అంత‌ర్జాతీయంగా శాంతిభ‌ద్ర‌త‌ల వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా ఇరుదేశాలు కృషి చేయాలి.

 ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన‌స్ మ‌రియు డిజిట‌ల్ ప్ర‌గ‌తి రంగంలో స‌హ‌కారాన్ని ఇరుదేశాలు బ‌లోపేతం చేయాలి.

 

  1. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ విజ్ఞానం) మ‌రియు డిజిట‌ల్ మార్పు రంగంలో స‌హకారాన్ని బ‌లోపేతం చేయాలి

 

  1. రాబోయే రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌భావం గ‌ణ‌నీయంగా వుంటుంది. ప్ర‌జ‌ల జీవితాల‌పై పెను ప్ర‌భావం చూపుతుంది. ఈ విష‌యాన్ని ఇరు దేశాలు గుర్తించి త‌ద‌నుగుణంగా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తూ ఈ సాంకేతిక‌లకు త‌గిన ప్రోత్సాహం ఇస్తూ స‌హ‌కారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా చేయ‌డంద్వారా ఇరు దేశాల్లో ప‌రిశోధ మ‌రియు సుస్థిర అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది.
  2. రాబోయే త‌రాలు వాడే సాంకేతిక‌త‌ల విష‌యంలో ఇరు దేశాలు క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌ర్చ‌లు చేస్తూనే స‌మన్వ‌యాన్ని అధికం చేయాలి. ఇందుకుగాను ఇరు దేశాల మ‌ధ్య డిజిట‌ల్ భాగ‌స్వామ్యం నిర్మించాల్సిన ప్రాధాన్య‌తను ఇరు దేశాలు మ‌రోసారి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాయి. ఇరు దేశాల్లో వున్న ప్ర‌తికూల‌త‌లు స‌రిగా ఉప‌యోగించుకోవ‌డంద్వారా రెండు దేశాలు ప‌ర‌స్ప‌ర స‌హ‌కార భాగ‌స్వామ్యాన్ని నిర్మించుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాయి. ఇందుకుగాను స‌మాజానికి మేలు చేకూరేలా ఐఓటి మ‌రియు ఏఐ రంగాలకు సంబంధించిన ప‌రిష్కారాల‌ను అభివృద్ధి చేసుకోవాలి. అంతే కాదు హార్డ్ వేర్‌, సాప్ట్ వేర్ ల‌ను స‌మ‌న్వ‌యాన్ని పెంచాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఇరు దేశాలు గుర్తించాలి.
  3. ఆర్టిఫిషియ‌ల ఇంటెలిజెన్స్ విష‌యంలో ఇరు దేశాలు త‌మ త‌మ దేశాల వ్యూహాల‌ను రూపొందించాలి. అంతే కాదు ఈ రంగంలో ప‌రిశోధ‌న‌,నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు స‌మాజంలో వాటి ఉప‌యోగానికుండే సామ‌ర్థ్య‌న్ని గుర్తించాలి. ఆరోగ్యం, ఇరు దేశాల్లో రెండు దేశాల ప్ర‌జ‌ల సంచారం, ప‌ర్యావ‌ర‌ణం మ‌రియు వ్య‌వ‌సాయం మొద‌లైన ముఖ్య‌మైన రంగాల్లో ఇరు దేశాలు క‌లిస‌క‌ట్టుగా ప‌ని చేస్తే అది రెండు దేశాల‌కు అపార‌మైన అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. త‌ద్వారా ఇరు దేశాల స‌హ‌కారం పెరుగుతుంది.అంతే కాదు తుల‌నాత్మ‌క‌మైన అనుకూల‌త నిర్మాణం జ‌రుగుతుంది. ఇరు దేశాలు త‌మ ద‌గ్గ‌గ‌ల నిపుణుల‌ను, ఉత్త‌మ‌మైన విధానాల్ని ఇచ్చి పుచ్చుకోవ‌డంద్వారా రెండు దేశాల మ‌ధ్య‌న గ‌ల స‌హ‌కార విధానాన్ని మ‌రింత ముంద‌కు తీసుకుపోవ‌డానికి సిద్ధంగా వున్నాయి. ఇందుకోసం ప‌లు రంగాల్లో ప‌రిశోధ‌న అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది. ఇరు దేశాల మ‌ధ్య‌న ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నంగ‌ల రంగాల‌ను గుర్తించ‌డానికిగాను 2020లో బెర్లిన్ లో ఒక ద్వైపాక్షిక వ‌ర్క్ షాప్ ను నిర్వ‌హంచ‌డానికి జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. జ‌ర్మ‌నీ విద్య మ‌రియు ప‌రిశోధ‌న స‌మాఖ్య మంత్రిత్వ‌శాఖ మ‌రియు శాస్త్ర సాంకేతిక రంగాల విభాగం ఈ వ‌ర్క్ షాప్‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఇది ఇండో జ‌ర్మ‌న్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ సెంట‌ర్ ద్వారా జ‌రుగుతుంది.
  4. అత్యంత ప్రాధాన్య‌త‌గ‌ల ప‌రివోధ‌న కార్య‌క్ర‌మాలు అభివృద్ధిచెందాలంటే కావాల్సిన ముఖ్య‌మైన అంశం అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని గుర్తించ‌డం. ఈ ప‌ని చేసిన రెండు దేశాలు ఏఐ అభివృద్ధి మ‌రియు వినియోగానికి సంబంధించి రెండు దేశాలు క‌లిసి ఉమ్మ‌డిగా ద్వైపాక్షిక మ‌రియు బ‌హుళ పాక్షికగానీ, ద్వైపాక్షిక లేదా బ‌హుళ‌పాక్షిక ప‌రిశోధన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాయి. అంత‌ర్జాతీయంగా ఒకే విలువ‌గ‌లిగిన ఇరు దేశాల కంపెనీల మ‌ధ్య‌న స‌హ‌కారం కూడా ఇందులో భాగ‌మేన‌ని రెండు దేశాలు నిర్ణ‌యించాయి. ఆరోగ్య‌రంగంలో ఏఐ వినియోగించే విష‌యంలో ఇరు దేశాల‌కు ల‌భించిన విశిష్ట అవ‌కాశం గురించి ఇరు దేశాలు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాయి. దీనివ‌ల్ల ఇరుదేశాలు క‌లిసి ప‌ని చేయ‌డం మ‌రింత బలోపేత‌మ‌వుతుంది. ఈ విష‌యంలో దీనికి సంబంధించిన బాధ్యులంద‌రితో క‌లిపి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో జ‌రిగిన స‌మావేశాన్ని ఇరు దేశాలు స్వాగ‌తించాయి. అలాంటి స‌మావేశాన్ని భార‌త‌దేశంలో కూడా నిర్వ‌హించ‌డానికి ఇరుదేశాలు అంగీక‌రించాయి.
  5. వ్య‌వ‌సాయ‌రంగంలో ఇరుదేశాలు క‌లిసి ఏఐని ఉపయోగించాల‌నే ఆలోచ‌న‌ను ఇరు దేశాల నేత‌లు ఆహ్వానించారు. దీనివ‌ల్ల పంట‌ల‌సాగులో ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. అంతే కాదు సామ‌ర్థ్యం పెరుగుతుంది. వ‌న‌రుల ఆదా జ‌రుగుతుంది. దాంతో ఆహార ప‌దార్థాలు వ్య‌ర్థం కావు. ఏఐ వినియోగానికి సంబంధించి ఓప‌న్ ట్రెయినింగ్ డాటా సెట్స్ ను ఏర్ప‌ర‌చ‌డంపై ఇరు దేశాల వ్య‌వ‌సాయ శాఖ మంత్రులు దృష్టి పెడ‌తారు. దీనివ‌ల్ల న్యాయ‌ప‌రమైన చిక్కులు తొల‌గుతాయి. నీతి ఆయోగ్, జ‌ర్మ‌నీ కంపెనీల మ‌ధ్య‌న ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని ఇరు దేశాలు స్వాగ‌తించాయి. భార‌త‌దేశ వ‌య‌వ‌సాయ రంగంలో డిజిట‌ల్ సాంకేతిక‌త‌ల్ని, ఏఐని ఉప‌యోగించ‌డం, అవ‌కాశాల‌పై ఈ స‌మావేశం నిర్వ‌హించారు. ప్రైవేటు రంగ భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించ‌డం కూడా జ‌రిగింది. ఆఫీసుల్లో ఏఐ వినియోగంద్వారా ఏర్ప‌డ‌బోయే సంక్లిష్ట విష‌యాల మీద జ‌రిగిన ప‌రిశోధ‌న‌ను ఒక ఉమ్మ‌డి వ‌ర్క్ షాపుద్వారా పంచుకోవాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. అంతే కాదు ఆర్ధికరంగంపైనా, స‌మాజంపైనా ఏఐ చూపే ప్ర‌భావంపై కూడా ఈ వ‌ర్క్ షాపులో చ‌ర్చిస్తారు.

8 డిజిట‌ల్ రంగంలో వ్యాపార‌ప‌ర‌మైన స‌హ‌కారాన్ని పెంపొందించాల‌ని జ‌ర్మ‌నీ, ఇండియాలు కోరుకుంటున్నాయి. కాబ‌ట్టి ఇరుదేశాల‌కు చెందిన డిజిట‌ల్ కంఎపీలు క‌లిసి ఈ దిశ‌గా ప‌ని చేస్తాయి. త‌ద్వారా మార్కెట్ అవ‌కాశాలు పెర‌గ‌డ‌మే కాకుండా ద్వైపాక్షిక పెట్టుబ‌డులకు అవ‌కాశాలు పెరుగుతాయి. రెండు దేశాల్లో ఏర్ప‌డిన టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ‌ల‌కు మ‌ధ్య‌న విశిష్ట‌మైన అనుబంధం ఏర్ప‌డుతుంది.

  1. ఇరు దేశాలు క‌లిసి 2017 మే 30న బెర్లిన్ వేదిక‌గా డిజిట‌లీక‌ర‌ణ రంగంలో ఉమ్మ‌డి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ఇరు దేశాలు ఈ రంగంలో కొన‌సాగుతున్న డిజిట‌ల్ చ‌ర్చ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఇరుదేశాల‌కు చెందిన వ్యాపార‌వ‌ర్గాలు క‌లిసి డిజిట‌ల్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యాన్ని ఇరు దేశాలు స్వాగ‌తించాయి. ఈ బృందంలో ప‌రిశోధ‌నా సం్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు, ప్రైవేటు సం్థ‌ల ప్ర‌తినిధులు వుంటాయి. వీరు ప‌ర‌స్ప‌ర స‌హ‌కార అంశాలను వీరు గుర్తిస్తారు. అంతే కాదు ఇరు దేశాలు ఉమ్మ‌డిగా చేప‌ట్ట‌బోయే విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కోసం వీరు సిఫార‌సులు కూడా ఇస్తారు.
  2. జ‌ర్మ‌నీ ప్లాట్ ఫామ్ ప‌రిశ్ర‌మ‌కు, సిఐఐ స్మార్ట్ మ్యాన్యూఫాక్ష‌రింగ్ ప్లాట్ ఫామ్ మ‌ధ్య‌న లింకేజీలు ఏర్పాటు చేడానికి ఇరు దేశాలు అంగీక‌రించాయి. త‌ద్వారా స‌మాచారం ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. వీటితోపాటు ప్ర‌మాణీక‌ర‌ణ‌, నెట్ వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ల్లో ఐటీ భ‌ద్ర‌త‌, టెస్ట్ బెడ్స్ అండ్ యూస్ కేసులు, బిజినెస్ మోడ‌ళ్లు, బిటుబి ప్లాట్‌ఫామ్స్ , భ‌విష్య‌త్ డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌లు మొద‌లైన అంశాల్లో ఈ స‌మాచార స‌హ‌కారం వుంటుంది.ఇరు దేశాల్లో స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌లు ఎంతో వేగంగా  ఒకే వేదిక మీద‌కు రావాల్సిన అవ‌స‌రాన్ని ఇరు దేశాలు గుర్తించాయి. త‌ద్వారా ఔత్సాహిక పారిశ్రామ‌క వేత్త‌లు త‌మ ఆలోచ‌న‌ల్ని పంచుకుంటారు. ప్రాజెక్టుల వివ‌రాల్ని పంచుకుంటారు. ఇందుకోసం జ‌రుగుతున్న కృషిని ఇరు దేశాల నేత‌లు స్వాగ‌తించారు. స్టార్ట‌ప్ ల మ‌ధ్య‌న ఒడంబ‌డిక‌ల్ని ప్రోత్స‌హించడం ఎంత ముఖ్య‌మో ఇరు దేశాల నేత‌లు గుర్తించారు. ఈ విష‌యంలో స్టార్ట‌ప్ ల‌కోసం బూట్ క్యాంప్ ల‌ను ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ఇరు దేశాలు స్వాగ‌తించాయి. త‌ద్వారా డిజిట‌ల్ రంగంలో ఒక ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డి అది నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల్నిమ‌రియు ఔత్సాహిక పారిశ్రామిక త‌త్వాన్ని ప్రోత్స‌హిస్తుంద‌ని గుర్తించారు.
  3. అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం ఒక అంత‌ర్జాతీయ వేదిక నిర్మాణ ఆవ‌శ్య‌క‌తను మ‌రో సారి ఇరు దేశాలు ప్ర‌స్తావించాయి. దీని ద్వారా బాధ్య‌తాయుత‌మైన‌, మాన‌వ కేంద్రీకృత ప్ర‌గతి మ‌రియు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ను సాధించుకోవ‌డంజ‌రుగుతుంది. దీనికి అనుగుణంగా గ్లోబ‌ల్ పార్ట‌న‌ర్ షిప్ ఆన్ ఏఐ (జిపిఏ ఐ)లో పాల్గొనే అవ‌కాశాన్ని ఇరు దేశాలు స్వాగ‌తించాయి.
  4. సైబ‌ర్ రంగంలో భ‌ద్ర‌త విష‌యంలో అనుస‌రించాల్సిన ఉత్త‌మ విధానాల‌ను గుర్తించడానికిగాను ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం సంప్ర‌దించుకోవాల‌ని అంగీక‌రించాయి. ఈ విష‌యంలో వుండాల్సిన స‌హ‌కారానికి సంబంధించిన అంశాల‌ను గుర్తించడానికి ఏం చేయాలో త‌గిన విధానాల‌ను గుర్తించాల‌ని నిర్ణ‌యించారు.

……………

11 నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌రియు విజ్ఞాన రంగాల్లో వాణిజ్య మ‌రియు పెట్టుబ‌డుల అవకాశాల విస్త‌ర‌ణ‌

……………….

  1. ఇరు దేశాల మ‌ధ్య‌న గ‌ల ద్వైపాక్షిక వాణిజ్యం మ‌రియు పెట్టుబ‌డులను విస్త‌రింప చేయాల‌నే కృత‌నిశ్చ‌యాన్ని ఇరు దేశాల నేత‌లు గుర్తించారు. భార‌త‌దేశం, యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య‌న నిల‌క‌డైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏర్పాటు ప్రాధాన్య‌త‌ను ఇరు దేశాలు గుర్తించాయి. ద్వైపాక్షిక వాణిజ్యం మ‌రియు పెట్టుబ‌డుల ఒప్పందానికి సంబంధించి భార‌త‌దేశం, యూరోపియన్ యూనియ‌న్ మ‌ధ్య‌న తిరిగి సంప్ర‌దింపులు జ‌రిగేలా చిత్త‌శుద్ధితో కూడిన కృషి జ‌ర‌గాల‌ని ఇరు దేశాల నేత‌లు నిర్ణ‌యించారు.
  2. డ‌బ్ల్యు టివో కేంద్రంగా నియ‌మాల ఆధారిత అంత‌ర్జాతీయ వాణిజ్య వ్య‌వ‌స్థ‌కు ఇరు దేశాలు త‌మ బ‌ల‌మైన మ‌ద్ద‌తు వుంటుంద‌ని మ‌రోసారి గ‌ట్టిగా చెప్పాయి. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యు టివో వివాద ప‌రిష్కారాల వ్య‌వ‌స్థ పూర్తి స్థాయిలో ప‌ని చేసేలా చేయ‌డానికిగాను గ‌ట్టిగా కృషి చేయాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ఏకాభిప్రాయమే పునాదిగా నిర్ణ‌యం తీసుకోవడం మ‌రియు అభివృద్ధి ల‌క్ష్యాల్లాంటి ప్రాధ‌మిక సూత్రాల‌కు భంగం క‌ల‌గ‌కుండా డ‌బ్ల్యుటివో ని సంస్క‌రించాల‌ని ఇరు దేశాలు కోరాయి. ఈ నేప‌థ్యంలో క‌జకిస్థాన్‌లోని నుర్సుల్థాన్‌లో జ‌ర‌గ‌బోయే డ‌బ్ల్యు టి వో మంత్రిత్వ స్థాయి స‌మావేశాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి.
  3. ద్వైపాక్షిక పెట్టుబ‌డుల విష‌యంలో జ‌రుగుతున్న స్థిర‌మైన వృద్ధిని ఇరు దేశాల నేత‌ల ప్ర‌శంసించారు. భార‌త‌దేశంలోని త‌యారీ మిట్టెల్ స్టాండ్ ( ఎంఐఐఎం) కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని ఇరువురు నేత‌లు ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మం 135 జ‌ర్మ‌న్ మిట్టెల్ స్టాండ్ మరియు కుటుంబ యాజ‌మాన్య కంపెనీల‌కు ల‌బ్ది చేకూర్చింది. ఇందులో పెట్టిన పెట్టుబ‌డుల విలు 1.2 బిలియ‌న్ యూరోల‌పై మాటే. యూరోపియ‌న్ యూనియ‌న్, యూనియ‌న్ స‌భ్య‌త్వ దేశాల‌కు మ‌రియు భార‌త‌దేశానికి మ‌ధ్య‌న పెట్టుబ‌డుల ర‌క్ష‌ణ ఒప్పందం త్వ‌ర‌లోనే కుదర‌డానికి వీలుగా చేస్తున్న కృషిని వేగ‌వంతం చేయాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. భార‌త‌దేశంలో నేరుగా పెట్టుబ‌డులు పెట్టడానికి అర్హ‌త‌గ‌ల‌ కంపెనీల‌కు పెట్టుబ‌డుల గ్యారంటీలు ఇవ్వడానికి వీలుగా జ‌ర్మ‌నీ త‌న విధానాన్ని తిరిగి అమ‌లు చేయ‌డాన్ని భార‌త‌దేశం ఆహ్వానించింది. ఈ చ‌ర్య కార‌ణంగా ఇరుదేశాల మ‌ధ్య‌న ద్వైపాక్షిక ఆర్ధిక బంధాలు మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయి. ఫాస్ట్ ట్రాక్ వ్య‌వ‌స్థ‌ల ప‌ని విధానాన్ని ఇరు దేశాల నేత‌లు ప్ర‌శంసించారు. వీటి కార‌ణంగా వ్యాపారపర‌మైన న‌మ్మ‌కం మ‌రింత బ‌లోపేత‌మైంద‌ని అన్నారు.
  4. ఇరుదేశాల్లో స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య‌న ఇచ్చి పుచ్చుకునేవిధానాన్ని ప్రోత్స‌హించ‌డానికిగాను రూపొందించిన‌ జ‌ర్మ‌నీ ఇండియా స్టార్ట‌ప్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ ( జిఐ ఎన్ ఎస్ ఇపి) విజ‌య‌వంత‌మైంద‌ని ఇరు దేశాల నేత‌లు గుర్తించారు. ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. జిఐఎన్ ఎస్ ఇపి ద్వారా జ‌రుగుతున్న ఈ ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం కొన‌సాగ‌డాన్ని స్వాగ‌తించారు. అంతే కాదు భార‌త‌దేశంలోని జ‌ర్మ‌నీ స్టార్ట‌ప్ లకోసం జ‌ర్మ‌న్ యాగ్జిల‌రేట‌ర్ కార్య‌క్ర‌మం నెక్స్ట్ స్టెప్ ఇండియా (జిఏ) ప్రారంభించ‌డాన్ని కూడా ఇరు దేశాల నేత‌లు స్వాగ‌తించారు.
  5. యువ‌త‌కు స్థిర‌మైన ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికిగాను స‌మ‌ర్థ‌వంత‌మైన నైపుణ్య వ‌న‌రుల నిర్మాణ ప్రాధాన్య‌త‌ల‌ను ఇరు దేశాల నేత‌లు గుర్తించారు. నైపుణ్య మాన‌వ‌వ‌న‌రులకు సంబంధించిన డిమాండ్‌, కొర‌త మ‌ధ్య‌న‌గ‌ల అంత‌రాన్ని పూడ్చ‌డానికి గాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయాల‌నే త‌మ సంక‌ల్పాన్ని ఇరు దేశాలు ప్ర‌క‌టించాయి. ఈ దిశ‌గా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌ప‌ట్ల వారు త‌మ సంతృప్తిని ప్ర‌క‌టించారు. అంతే కాదు ప‌లు రంగాల్లో స‌హ‌కారానికి సంబంధించిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న రెన్యూవ‌ల్ కావ‌డాన్ని స్వాగ‌తించారు. మండ‌లాల ప‌రంగా నిర్మాణాల ఏర్పాటు, పాఠ్య ప్ర‌ణాళిక అభివృద్ధి, శిక్ష‌కుల‌కు శిక్ష‌ణ మ‌రియు ఉమ్మ‌డి శిక్ష‌ణా సంస్థ‌ల అభివృద్ధికి ప్రోత్సామం మొద‌లైన‌వి ఇందులోని రంగాలు. నూత‌న‌, వైవిధ్య మ‌రియు సుస్థిర‌మైన సాంకేతిక‌ల విష‌యంలో నైపుణ్యాభివృద్ధికి మ‌ద్ద‌తు ఇవ్వడానికి గాను ఇరు దేశాలు త‌మ సంసిద్ద‌త‌ను వ్య‌క్తం చేశాయి. పున: వినియోగ ఇంధ‌నం, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఇంధ‌న సామ‌ర్థ్య‌త అనేవి ఈ సాంకేతిక‌త‌లు. అంతే కాదు ఈ కార్య‌క్ర‌మాల్లో ఇరు దేశాల‌కు చెందిన ప్రైవేట్ రంగం సంస్థ‌లు పాల్గొన‌డాన్ని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు.
  6. మేనేజ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మం ద‌శాబ్దానికిపైగా విజ‌య‌వంతంగా కొన‌సాగ‌డాన్ని, ఇరు దేశాల స‌హ‌కారాన్ని ఇద్ద‌రు నేత‌లు ప్ర‌శంసించారు. ఫిట్ ఫ‌ర్ పార్ట‌న‌ర్ షిప్ విత్ జ‌ర్మ‌నీ అనే పేరుతో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మంలో భార‌త‌దేశానికి చెందిన 800ల‌కు పైగా మేనేజ‌ర్లు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం కింద ఇరు దేశాల మ‌ద్య‌న స‌హ‌కారం కొన‌సాగ‌డాన్ని నేత‌లిద్ద‌రూ స్వాగ‌తించారు.
  7. నూత‌న సాంకేతిక‌త‌ల సాయంతో రూపొందిన ప‌ని విధానాలను ఇచ్చిపుచ్చుకునే జాతీయ స్థాయి కార్య‌క్ర‌మాల‌కు ఇరువురు నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. అంతే కాదు బాల కార్మిక వ్య‌వ‌స్థ, వెట్టిచాకిరీ నిర్మూల‌న‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని భావించారు. అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల్లో వీటిని లేకుండా చేయాల‌న్నారు. బాల‌కార్మిక వ్య‌వ‌స్థ‌, వెట్టి చాకిరీ , మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా, ఆధునిక బానిస‌త్వం మొద‌లైన‌వాటి నిర్మూల‌న‌కు సంబంధించి జి20 వ్యూహాన్ని అనుస‌రించాల‌ని నిర్ణ‌యించారు. అర్జెంటీనా జి20 ప్రెసిడెన్సీ కింద ఈ ప‌నులు చేయాల‌ని ప‌లు దేశాలు ఒప్పుకోవ‌డం జ‌రిగింది.
  8. మాన‌వ హ‌క్కుల‌ను గౌర‌వించే బాధ్య‌త వ్యాపార సంస్థ‌ల మీద వుంద‌నే విష‌యాన్ని ఇరు దేశాల నేత‌లు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆయా వ్యాపార సంస్థ‌లు వ్యాపార మ‌రియు మాన‌వ హ‌క్కుల‌కు సంబంధించిన ఐక్యరాజ్య స‌మితి మార్గ‌ద‌ర్శ‌క నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి వుండాల‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. సుస్థిర‌మైన స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ను ప్రోత్స‌హించాల‌నే జి20 ఆకాంక్ష‌ల‌ను ప్ర‌స్తావించారు. సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో ప్రైవేటు రంగం కృషి చేస్తుంద‌ని ఇరు దేశాలు పేర్కొన్నాయి. బాధ్య‌తాయుత‌మైన‌, సుస్థిర‌మైన వ్యాపార విధానాల‌ను అనుస‌రించే వ్ఆపార సంస్థ‌ల‌కు త‌మ స‌హ‌కారం ఎల్ల‌వేళ‌లా వుంటుంద‌ని రెండు దేశాలు స్ప‌ష్టం చేశాయి. నిపుణుల‌ను, అనుభ‌వాల‌ను మ‌రిన్ని రంగాల్లో ఇచ్చిపుచ్చుకోవాల‌ని ఇరు దేశాలు అంగీక‌రించాయి. ముఖ్యంగా భార‌త‌దేశం, జ‌ర్మ‌నీల జాతీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల ఏర్పాటు, అమలులో ఈ ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.
  9. ప‌ని ప్ర‌దేశాల్లో వ‌చ్చే వ్యాధులు, పున‌రావాసం మ‌రియు బీమా వ్య‌క్తుల‌కు వృత్తి శిక్ష‌ణ …ఈ అంశానికి సంబంధించిన‌ అవ‌గాహ‌నా ఒప్పందం ప‌త్రంపై సంత‌కాలు జ‌ర‌గ‌డాన్ని ఇరు దేశాలు స్వాగ‌తించాయి. దీనికి సంబంధించి జ‌ర్మ‌న్ సోష‌ల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ( డిజియువి), ఉద్యోగులకు సంబంధించిన‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌, భార‌త‌దేశ కార్మిక మ‌రియు ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ సామ‌ర్థ్య నిర్మాణాన్ని చేస్తాయి. అంతే కాదు బీమా క‌లిగిన దివ్యాంగుల‌కు పున‌రావాసం ల‌భిస్తుంది. అంతే కాదు ప‌ని ప్ర‌దేశాల్లో వ‌చ్చే వ్యాధుల గుర్తింపు, నివార‌ణ, చికిత్స‌ను చేప‌డ‌తారు.
  10. ప‌న్నుల రంగంలో ఈ మ‌ధ్య‌కాలంలో సాధించిన ప్ర‌గ‌తిప‌ట్ల ఇరుదేశాల నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. డిజిట‌లీక‌ర‌ణ కార‌ణంగా ప‌న్నుల ప‌రంగా ఏర్ప‌డిన స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డంలో ఈ ప్ర‌గ‌తిని సాధించ‌డం జ‌ర‌గింది. ఈ విష‌యంలో జి 20 మ‌ద్ద‌తుక‌లిగిన కార్య‌క్ర‌మాన్ని స్వాగ‌తించారు. ఈ కార్య‌క్ర‌మంలో టు పిల్ల‌ర్ విధానం వుంది. బేస్ ఎరోజ‌న్ అండ్ ప్రాఫిట్ షిప్టింగ్ మీద కార్యాచ‌ర‌ణ‌ను పరిగ‌ణ‌లోకి తీసుకోవ‌డంద్వారా ఈ టు పిల్ల‌ర్ విధానం వచ్చింది. దీన్ని ఓ నివేదిక స‌హితంగా 2020లో ఆమోదిస్తారు. అన్ని వ్యాపారాల‌కు వ‌ర్తించేలా ఈ ఒక‌టి , రెండు ఫిల్ల‌ర్ల‌పైన స‌రైన స‌మ‌యంలో ఏకాభిప్రాయ ప‌రిష్కారం సాధించాల‌నే ఉమ్మ‌డినిశ్చ‌యాన్ని ఇరు దేశాలు గ‌ట్టిగా ప్ర‌స్తావించాయి.
  11. ఇండియా, జ‌ర్మ‌నీల ఆర్ధిక మంత్రిత్వ‌శాఖ‌ల ఉన్న‌తాధికారుల స‌మావేశం తిరిగి ప్రారంభించ‌డాన్ని ఇద్ద‌రు నేత‌లు స్వాగ‌తించారు. ఈ స‌మావేశంద్వారా ఇరుదేశాల‌ ఆర్ధిక ప్రాధాన్య‌త‌లు, స‌మాచారం ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. చ‌ర్చ‌లకు వేదిక ల‌భిస్తుంది. ఈ ఏడాది ఇరుదేశాల ఎక్చేంజి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మైన అంశాలను చూస్తే ఆర్ధిక మ‌రియు బీమా రంగంతోపాటు డిజిట‌లీక‌ర‌ణ కార‌ణంగా ఏర్ప‌డిన ప‌న్నుల స‌వాళ్లు కూడా వున్నాయి.
  12. పౌర విమాన‌యాన రంగానికి సంబంధించిన స‌హ‌కారం విష‌యంలో చేసుకున్న ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌పై ఇరు దేశాలు సంత‌కాలు చేయ‌డాన్ని ఇద్ద‌రు నేత‌లు గుర్తించారు. దీనివ‌ల్ల ఇరు దేశాలు స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డంతోపాటు సాంకేతిక‌, సాంకేతికేత‌ర శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో ఉత్త‌మ విధానాల్ని అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది. భార‌త‌దేశంలో వ్యాపార విమాన‌యాన ప్ర‌గ‌తి విష‌యంలో ఇరు దేశాల వ్యాపార సంస్థ‌లు ఉమ్మ‌డిగా అభివృద్ధిని సాధించేందుకు, ఉమ్మ‌డిగా ఉత్ప‌త్తిని సాధించేందుకుగాను ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఇరు దేశాల నేత‌లు కోరారు. త‌మ ప్రోత్సాహం వుంటుంద‌ని చెప్పారు. స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డ‌మే కాకుండా, సాంకేతిక‌త‌ల బ‌దిలీ కూడా వుంటుంది.
  13. రైల్వే రంగంలో ఇరు దేశాల మ‌ధ్య‌న స‌హ‌కారం సుదీర్ఘ‌కాలంగా విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. ఈ విష‌యంలో ఇరుదేశాల మ‌ధ్య‌న సుదీర్ఘ చ‌రిత్ర వుంది. చాలా సంవ‌త్స‌రాలుగా ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేయ‌డంవ‌ల్ల చేకూరిన ప్ర‌యోజ‌నాల‌ను ఇరువురు నేత‌లు ప్ర‌శంసించారు. రైల్వే రంగ నిపుణుల‌ను త‌యారు చేయ‌డానికి శిక్ష‌ణ ఇవ్వ‌డం, రైల్వే భ‌ద్ర‌త, అధిక వేగం, అత్య‌ధిక వేగం త‌దిత‌ర అంశాల్లో సాంకేతిక స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డ జ‌రిగింది. ఇది భ‌విష్య‌త్ లో కూడా కొన‌సాగుతుంది. భార‌తదేశంలో అత్య‌ధిక‌, అధిక వేగం క‌లిగిన రైలు ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డానికి సంబంధించి ఇరు దేశాలు ఒక అంగీకారానికి రావ‌డానికిగాను సుముఖ‌త చూప‌డంప‌ట్ల ఇరు దేశాల నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు.
  14. నాణ్య‌మైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఇండో జ‌ర్మ‌న్ వ‌ర్కింగ్ గ్రూప్ ద్వారా చ‌క్క‌టి స‌హ‌కారం ల‌భించ‌డాన్ని ఇరు దేశాలు ప్ర‌శంసించాయి. ఐజిసి 2013లో సుముఖ‌త వ్య‌క్తం చేస్తూ వెలువ‌డిన‌ ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న ఆధారంగానే వ‌ర్కింగ్ గ్రూప్ ప‌ని చేస్తోంది. ద్వైపాక్షిక సాంకేతిక మ‌రియు ఆర్ధిక స‌హ‌కారానికి సంబంధించి రూపొందిన విధివిధానాల ప్ర‌కారం ప‌ని చేయాల‌ని ఇరు దేశాల ప్ర‌భుత్వాలు మ‌రో సారి స్ప‌ష్టం చేశాయి. ఈ వ‌ర్కింగ్ గ్రూప్ ను 2020 త‌ర్వాత కూడా ప్రోత్స‌హించాల‌ని బిఎండ‌బ్ల్యు త‌ల‌పోస్తోంది. త‌న గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ క్వాలిటీ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ (జిపి క్యూఐ) ద్వారా ఈ ప‌ని జ‌రుగుతుంది.
  15. అంత‌రిక్ష రంగంలో ఇరుదేశాల మ‌ధ్య‌న కొన‌సాగుతున్న స‌హ‌కారంప‌ట్ల ఇరు దేశాల నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. భూగోళాన్ని ప‌రిశీలించ‌డం, ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ అంశాల్లో ఈ స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌నే నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. భార‌త‌దేశ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ( ఇస్రో)కు జ‌ర్మ‌న్ ఏరో స్పేస్ సెంట‌ర్ ( డిఎల్ ఆర్‌)కు మ‌ధ్య‌న సిబ్బందిని ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు అమ‌లు ప‌త్రంపై సంత‌కాలు జ‌ర‌గ‌డాన్ని ఇరుదేశాల నేత‌లు స్వాగ‌తించారు.
  16. అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యంతో ఏర్ప‌డిన సంస్థ డిసాస్ట‌ర్ రెజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కోయ‌లిష‌న్ (సిడిఆర్ ఐ). ప్ర‌కృతి వైప‌రీత్యాలను త‌ట్టుకొనే మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి ఈ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ఇరుదేశాలు స్వాగ‌తించాయి. ఇందులో అనేక దేశాల‌తోపాటు, ఐక్య‌రాజ్య‌స‌మితి సంస్థ‌లు, బ‌హుళ‌రంగాల్లో విస్త‌రించిన బ్యాంకులు, ఆర్ధిక స‌హాయ సంస్థ‌లు, ప్రైవేటు రంగా, విద్యారంగ సంస్థ‌లు భాగ‌స్వాములుగా వుంటాయి. సుస్థిర‌మైన అభివృద్ధి ల‌క్ష్యాల‌ను, పారిస్ క్లైమాట్ అగ్రిమెంట్ ల‌క్ష్యాల‌ను, ప్ర‌కృతి వైప‌రీత్యాల ప్ర‌మ‌దాల త‌గ్గింపుకోసం వెలువ‌డిన సెండాయ్ విధివిధానాల ల‌క్ష్యాల‌ను సాధించేందుకుగాను ఈ సంస్థ సాయంలో స‌మ‌ర్థ‌వంత‌మైన మౌలిక స‌దుపాయాలను, వ్య‌వ‌స్థ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. సిడిఆర్ ఐకి జ‌ర్మ‌నీ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అందులో చేర‌డానికి త‌న సంసిద్ద‌త‌ను వ్య‌క్తం చేసింది. అంతే కాదు అద స‌మ‌యంలో ఇండియాతోనూ, ఇత‌ర అంత‌ర్జాతీయ భాగ‌స్వాముల‌తో క‌లిసి ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను త‌ట్టుకునే సుస్థిర‌మైన మౌలిక స‌దుపాయాల ఏర్పాటులోను, పెట్టుబ‌డుల విష‌యంలోను క‌లిసి ప‌ని చేయ‌డం జ‌రుగుతుంద‌ని జ‌ర్మ‌నీ స్ప‌ష్టం చేసింది.

 ………….

  1. వాతావ‌ర‌ణ మ‌రియు సుస్థిర అభివృద్ధి కోసం చ‌ర్య‌లు

………………….

  1. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌నుంచి భూగోళాన్ని ర‌క్షించడంలో ఇరు దేశాల‌కు ఉమ్మ‌డిగా బాధ్య‌త వుంద‌నే విష‌యాన్ని ఇద్ద‌రు నేత‌లు స్ప‌ష్టం చేశారు. పున‌: వినియోగ ఇంధ‌నాన్ని ప్రోత్స‌హించ‌డంద్వారా వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌గ్గించ‌వచ్చు.ఇంధ‌న రంగంలో స‌మ‌ర్థ‌త‌ను పెంచ‌డంద్వారా కార్బ‌న్ వాయువుల విడుద‌ల త‌గ్గించవ‌చ్చు. ఈ విష‌యంలో ఇరుదేశాల స‌హకారానికిగాను సుస్థిర‌మైన అభివృద్ధి ల‌క్ష్యాలు, పారిస్ ఒప్పందం అనేవి విధివిధానాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రెండు దేశాల్లో ఇంధ‌నం, ర‌వాణా రంగాల్లో విజ‌య‌వంతంగా ముందుకు సాగాలంటే ఇరు దేశాలు దృఢంగా స‌హ‌కారాన్ని అందించుకోవాలనే విష‌యాన్ని ఇరు దేశాలు గుర్తించాయి. అంతే కాదు ఇరు దేశాలు ఒక‌దానినుంచి మ‌రొక‌టి నేర్చుకోవాల్సి. ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ ద్వారా స‌మ‌కూరే ఆర్ధిక సామ‌ర్థ్యాన్నించి ల‌బ్ది పొందాలంటే ఈ స‌హ‌కారం అవ‌స‌రం.
  2. వాతావ‌ర‌ణానికి సంబంధించి ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ఆశించిన స్థాయిలో కృషి జ‌ర‌గ‌డం లేదు. ఈ విష‌యంప‌ట్ల ఇరు దేశాల నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై ప్ర‌పంచ‌దేశాలు దృష్టి పెట్టాల‌ని, గ‌ట్టిగా కృషి చేయాల‌ని ఇరు దేశాల నేత‌లు పిలుపునిచ్చారు. వాత‌వ‌ర‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించి అంద‌రికీ స‌మ న్యాయం క‌ల్పించే నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా, ఉమ్మ‌డిగా వుంటూనే అదే స‌మ‌యంలో ఎవ‌రి బాధ్య‌త‌ల‌ను వారు నిర్వ‌ర్తించేలా, వారి వారి సామ‌ర్థ్యాల‌కు తగిన‌ట్టుగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రాన్ని ఇరు దేశాలు గ‌ట్టిగా చెప్పాయి. ప్ర‌తి దేశానికి త‌న‌కంటూ జాతీయ ప‌రిస్థితులున్న నేప‌థ్యంలో ఈ ప‌ని చేయాలి. అలాగే పారిస్ ఒప్పందంలో అంగీక‌రించిన‌ట్టుగా ఆయా దేశాలు త‌మ ఎన్ డీసీలను అభివృద్ధి చేసుకోవాల్సి వుంటుంది. అలాగే జర్మ‌నీ కూడా యూరోపియ‌న్ యూనియ‌న్లో భాగంగా, ఇండియాతో భాగ‌స్వామిగా దీర్ఘ‌కాలం గ్రీన్ హౌస్ ఉద్గారాల‌ను అతి త‌క్కువ‌గా విడుద‌ల చేయాలి. పారిస్ ఒప్పందంలోని ఆర్టిక‌ల్ 2ను, ఐపిసిసి ఈ మ‌ధ్య‌నే విడుద‌ల చేసిన ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి వ్యూహాల‌ను అమ‌లు చేయాలి. అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రిగేలా, ఉమ్మ‌డిగా అదే స‌మ‌యంలో ఎవ‌రి బాధ్య‌త‌ల‌ను వారు నిర్వ‌ర్తిస్తూ, వారి వారి సామ‌ర్థ్యాల‌కు అనుగుణంగా ప‌ని చేయాలి. వివిధ ర‌కాల జాతీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో, సుస్థిర‌మైన అభివృద్ధి సాధ‌న మ‌రియు పేద‌రిక నిర్మూల‌న ల‌క్ష్యంగా ప‌ని చేయాల్సి వుంటుంది.
  3. హ‌రిత వాతావ‌ర‌ణ నిధిని తిరిగి విజ‌య‌వంతంగా ప్రారంభించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఇండియా మ‌రియు జ‌ర్మ‌నీలు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాయి. ఈ విష‌యంలో ఈ నిధికోసం కృషి చేయ‌గ‌లిగే అభివృద్ధి చెందిన దేశాలు, ఈ ప‌ని చేయ‌గ‌లిగే స్థితిలో వున్న ఇంకా ఇత‌ర దేశాలు త‌మ నిధి వాటాల‌ను పెంచాల‌ని లేదా మొద‌టి సారిగా హ‌రిత వాతావ‌ర‌ణ నిధికి త‌మ వాటాల‌ను అందించాల‌ని ఇండియా జ‌ర్మ‌నీలు కోరాయి. పారిస్ ఒప్పందం మ‌రియు యుఎన్ ఎఫ్ సిసిసి ప్ర‌కారం వాటిలోని నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ నిధికోసం కేటాయింపులు చేయాల‌ని సూచించాయి. కాప్ 25 విజ‌య‌వంతం కావ‌డానికి వీలుగా ఇరు దేశాలు ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మాణాత్మ‌కంగా ప‌ని చేస్తామ‌ని త‌మ‌కున్న నిబ‌ద్ద‌త‌ను మ‌రోసారి స్ప‌ష్టం చేశాయి. ప‌ర్యావ‌ర‌ణప‌ర‌మైన నిబ‌ద్ద‌త‌ను క‌లిగియుంటూనే, సుస్థిర అభివృద్ధిని కాపాడుకుంటూనే మార్కెట్ వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించిన స్ప‌ష్ట‌మైన నియ‌మాల‌ను అనుస‌రించాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి.
  4. అభివృద్ధిని విజ‌య‌వంతంగా సాధించ‌డంలో భార‌త‌దేశానికి జ‌ర్మ‌నీకి మ‌ధ్య‌న 60 సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌మైన చరిత్ర వుంది. ఇంధ‌న‌, సుస్థిర మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ హిత ప‌ట్ట‌ణాభివృద్ధి, ర‌వాణా, స‌హ‌జ వ‌న‌రుల సుస్థిర నిర్వ‌హ‌ణ‌, జీవ వైవిద్య ప‌రిర‌క్ష‌ణ రంగాల్లో సుదీర్ఘ కాలం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డంద్వారా ఇరు దేశాల‌కు ల‌బ్ధి చేకూరుంద‌ని ఇది ఎంతో గొప్ప విష‌య‌మ‌ని ఇరు దేశాల నేత‌లు ప్ర‌శంసించారు.
  5. పౌరులంద‌రి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి వీలుగా అతి త‌క్కువ కార్బ‌న్ మ‌రియు సుస్థిర అనుకూల ప‌రిష్కారాలను అందించ‌డంప‌ట్ల ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. ఇది ఎదుగుతున్న మ‌రియు పారిశ్రామిక ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌ను క‌లిగిన దేశాల పౌరుల అవ‌స‌రాల‌ను తీరుస్తుంద‌ని వారు అన్నారు. జాతీయ విధానాలు మ‌రియు కార్య‌క్ర‌మాలద్వారా వినియోగ హిత మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రంగా సుస్థిర‌మైన అనుకూల ప‌థ‌కాల‌ను రూపొందించ‌డానికిగాను జ‌ర్మ‌నీ, భార‌త‌దేశం ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకున్నాయి. ర‌వాణాలో అతి త‌క్కువ కార్బ‌న్ కు అనుకూల ప‌రిష్కారాల‌ను పెంపొందించుకోవాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. హ‌రిత ప‌ట్ట‌ణ ర‌వాణా విష‌యంలో ఇరు దేశాల భాగ‌స్వామ్యానికి సంబంధించిన నూత‌న ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌పై సంత‌కాల‌ను ఇరు దేశాలు ఆహ్వానించాయి. ఈ విష‌యంలో ఒక బిలియ‌న్ యూరోల స‌హాయాన్ని అందిచడానికి జ‌ర్మ‌నీ సంసిద్ద‌త‌ను వ్య‌క్తం చేసింది. ఈ స‌హాయంతో భార‌త‌దేశ న‌గ‌రాల్లో హ‌రిత ప‌ట్ట‌ణ ర‌వాణా మౌలిక స‌దుపాయాల‌ను, సేవ‌ల‌ను అందించ‌వ‌చ్చు. అంతే కాదు జాతీయ‌, రాష్ట్ర‌, స్థానిక సంస్థ‌ల సామ‌ర్థ్యాల‌ను బ‌లోపేతం చేయ‌డంద్వారా సుస్థిర‌, అంద‌రికీ ఉప‌యోప‌గ‌డే ఆక‌ర్ష‌ణీయ ర‌వాణా ప‌రిష్కారాల‌ను అమ‌లు చేయ‌వ‌చ్చు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ ర‌వాణాను ఇరు దేశాల నేత‌లు స్వాగ‌తించారు. ఈ రంగంలో ఇరు దేశాలు క‌లిసి ప‌ని చేయాల‌ని ఆకాంక్షించారు. అంతే కాదు ఆటోమోటివ్ రంగంలో ఇప్ప‌టికే పాతుకుపోయిన జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ కింద కూడా ఈ ప‌ని జ‌రుగుతుంది.
  6. అంత‌ర్జాతీయంగా ఇంధ‌న రంగంలోని విజ‌య‌వంత‌మైన మార్పుయొక్క ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌ను ఇరు దేశాలు గుర్తించాయి. దీనిద్వారా పారిస్ ఒప్పందంలోని సుదీర్ఘ ల‌క్ష్యాల‌ను సాధించ‌వ‌చ్చు. అంతే కాదు సుస్థిర‌మైన అభివృద్ధి ల‌క్ష్యాల‌ను 2030 నాటికి అందుకోవ‌చ్చు. పు: వినియోగ ఇంధ‌నం, ఇంధ‌న సామ‌ర్థ్యం అంశాల్లో స‌హ‌కారం ప‌ట్ల ఇరు దేశాల నేత‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. అంతే కాదు ఇండో జ‌ర్మ‌న్ ఇంధ‌న వేదిక ( ఐజిఇ ఎఫ్‌)ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ముఖ్య‌మైన మ‌రియు విజ‌యవంత‌మైన ప‌నిప‌ట్ల, అంత‌ర్జాతీయ వాతావ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ప‌ట్ల‌ సంతోషం వ్య‌క్తం చేశారు.
  7. బొగ్గుతో స‌హా శిలాజ ఇంధ‌నాల‌కు ఆధార‌నీయ‌మ‌మైన ప్ర‌త్యామ్నాయాలు క‌నుగొనేందుకు అవ‌స‌ర‌మైన ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటులో క‌లిసి ప‌ని చేయాల‌ని ఉభ‌య వ‌ర్గాలు క‌ట్టుబాటు ప్ర‌క‌టించాయి. గ్రిడ్ మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం, ఇంధ‌న సామ‌ర్థ్యం సాధించ‌డం, డిమాండు దిశ‌గా స‌మ‌ర్థ‌వంత‌మైన యాజ‌మాన్య విధానాలు అనుస‌రించ‌డం, అవ‌స‌రం మేర‌కు విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డం, భారీ ప‌రిమాణంలో స్టోరేజి వ‌స‌తులు స‌మ‌కూర్చుకోవ‌డం వంటి విధానాల ద్వారా సుస్థిర ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌పై దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాదు, గ్రామీణ ప్ర‌జ‌ల జీవితాలు ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల జీవితాల్లో మార్పులు తీసుకురావ‌డంలో సౌర విద్యుత్తుతో స‌హా ప‌లు టెక్నాల‌జీలు స‌హాయ‌కారిగా ఉంటాయ‌ని గుర్తిస్తూ ఆ రంగంలో స‌హ‌కారం విస్త‌రించుకునేందుకు గ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని అంగీకారానికి వ‌చ్చారు. ఇలాంటి టెక్నాల‌జీల‌కు అవ‌స‌రం అయిన స్టోరేజి సెల్‌, మైక్రో గ్రిడ్ సొల్యూష‌న్ల అభివృద్ధిలో స‌హ‌క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించారు.

 

  1. 2015 సంవ‌త్స‌రంలో ప్రారంభించిన ఇండో జ‌ర్మ‌న్ సోలార్ భాగ‌స్వామ్యం, 2013లో రూపొందించుకున్న గ్రీన్ ఎన‌ర్జీ కారిడార్ల‌లో స‌హ‌కారం విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రుగుతున్న‌ట్టు వారు అంగీక‌రించారు. 2022 నాటికి 175 గిగావాట్ల పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల సామ‌ర్థ్యం, త‌దుప‌రి వివిధ ద‌శ‌ల్లో ఆ ఉత్పాద‌క సామ‌ర్ధ్యాన్ని 450 గిగావాట్ల‌కు పెంచ‌డం ద్వారా 2050 నాటికి మొత్తం విద్యుత్ ఉత్ప‌త్తిలో పున‌రుత్పాద‌క ఇంధ‌నాల వాటా 80 శాతానికి చేర్చాల‌న్న భార‌త ప్ర‌భుత్వ ఆశావ‌హ‌మైన ల‌క్ష్యాల‌సాధ‌న‌, ఇత‌ర‌త్రా చోటు చేసుకుంటున్న సానుకూల ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త‌, జ‌ర్మ‌న్ విద్యుత్ మార్కెట్ల‌ను ప‌ర్యావ‌ర‌ణ మిత్రంగా తీర్చి దిద్ద‌డ‌లో స‌హ‌క‌రించుకోవాల‌ని కూడా నాయ‌కులు నిర్ణ‌యించారు.

 

  1. అంత‌ర్జాతీయంగా వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌కు దోహ‌ద‌ప‌డేందుకు, స‌మ‌ర్థ‌వంత‌మైన విద్యుత్ సొల్యూష‌న్లు అభివృద్ధి చేయ‌డానికి ఏర్పాటైన ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అలయెన్స్ లో (ఐఎస్ఏ) భాగ‌స్వామి కావ‌డానికి జ‌ర్మ‌నీ ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం ప‌ట్ల భార‌త్ హ‌ర్షం ప్ర‌క‌టించింది.

 

  1. ఢిల్లీలో 2019 ఫిబ్ర‌వ‌రిలో చివ‌రి సారిగా స‌మావేశ‌మైన ఇండో జ‌ర్మ‌న్ ప‌ర్యావ‌ర‌ణ వేదిక ప్రాధాన్య‌త‌ను ప్ర‌ధాన‌మంత్రి మోదీ, చాన్స‌ల‌ర్ మెర్కెట్ పున‌రుద్ఘాటించారు. ఉభ‌య దేశాల్లోని ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రాష్ట్ర స్థాయి, మునిసిపాలిటీల స్థాయి భాగ‌స్వామ్యం ప్రోత్స‌హించాల‌ని కూడా వారు నిర్ణ‌యించారు.

 

  1. జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పులు జీవ‌వైవిధ్యం వంటి భిన్న విభాగాల్లో స‌హ‌కారానికి ఏర్పాటైన జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ ల స‌మావేశం కావ‌డాన్ని వారు ఆహ్వానించారు. అలాగే ప‌ర్యావ‌ర‌ణంలో స‌ముద్ర వ్య‌ర్థాల‌ను వ‌దిలే విధానాల‌ను రూపుమాపేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్న నిర్ణ‌యాన్ని కూడా వారు ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల ఎస్ డిజి 12 సాధ‌న‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌కు మ‌రింత ఉత్తేజం క‌లుగుతుంద‌న్న విశ్వాసం వారు ప్ర‌క‌టించారు. స‌ముద్ర వ్య‌ర్థాల అదుపు విష‌యంలో సంత‌కాలు చేసిన రెండు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌ల‌కు వారు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

 

  1. వాతావ‌ర‌ణ మార్పుల నిరోధం కోసం ల‌భించిన 35 మిలియ‌న్ యూరోల స‌హాయంలో కొంత భాగాన్ని గ్రిడ్ విస్త‌ర‌ణ‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ స్టోరేజి సొల్యూష‌న్ల ఏర్పాటు, అట‌వీ ప‌ర్యావ‌ర‌ణం పున‌రుద్ధ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌కు కేటాయించాల‌ని ఉభ‌యులు అంగీక‌రించారు. బాన్ స‌మావేశం నిర్దేశించిన ల‌క్ష్యాలు సాధించ‌డంతో పాటు దేశీయ భూమండ‌లంలో 33 శాతం అట‌వీ భూములు విస్త‌రించేలా చూడాల‌న్న భార‌తదేశం బృహ‌త్ ల‌క్ష్యం సాధించ‌డానికి ఈ అట‌వీ ప‌ర్యావ‌ర‌ణం పున‌రుద్ధ‌ర‌ణ కార్య‌క్ర‌మం కింద చేప‌డుతున్న కొత్త న‌మూనాలు స‌హాయ‌కారిగా ఉంటాయ‌ని భావించారు. వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు జీవ‌వైవిధ్యం ప‌రిర‌క్ష‌ణ‌కు త‌ద్వారా సుస్థిర‌మైన అభివృద్ధి సాధ‌న‌కు అడ‌వులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఉభ‌యులు ప్ర‌త్యేకంగా నొక్కి వ‌క్కాణించారు.

 

  1. క‌న్వెన్ష‌న్ ఫ‌ర్ బ‌యో డైవ‌ర్సిటీ (సిబిడి) చ‌ర్చ‌లు ప్రాతిప‌దిక‌గా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, జైవ‌వైవిధ్య స‌హ‌కారం కొన‌సాగించి మ‌రింత ప‌టిష్ఠం చేసుకోవాల‌ని ఉభ‌యులు నిర్ణ‌యించారు. కోస్తా, స‌ముద్ర జీవ వైవిధ్యం ప‌రిర‌క్ష‌ణ‌, పుప్పొడిని ఒక మొక్క నుంచి మ‌రో మొక్క‌కు పంచుతూ అన్ని మొక్క‌లు పుష్పించేలా చూసే జాతుల ప‌రిర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణంపై దాడి చేస్తున్న కొత్త మొక్క‌ల నిరోధం, ఓష‌ధి మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ వంటి భిన్న విభాగాల్లో స‌హ‌కారానికి అవ‌కాశం మెండుగా ఉంద‌ని ఉభ‌య‌వ‌ర్గాలు అంగీక‌రించాయి.

 

  1. ప‌ర్యావ‌ర‌ణ మిత్ర‌మైన న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డం ల‌క్ష్యంగా 2017 మేలో చేసిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లోని అంశాల అమ‌లులో పురోగ‌తి ప‌ట్ల ఇరువురు నాయ‌కులు సంతృప్తి ప్ర‌క‌టిస్తూ ఆ రంగంలో విజ‌య‌వంత‌మైన ఆ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌గా కొన‌సాగించుకునేందుకు క‌ట్టుబాటు ప్ర‌క‌టించాఉ. అలాగే అంత‌ర్జాతీయ స్మార్ట్ సిటీస్ నెట్ వ‌ర్క్ లో భార‌త‌దేశం చేర‌డానిక స‌హ‌కారం అందించుకునేందుకు కుదిరిన సంయుక్త ప్ర‌క‌ట‌న‌కు కూడా వారు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్, 2019-20 నాటికి మ‌రింత మెరుగైన నిర్మాణ టెక్నాల‌జీలు స‌మ‌కూర్చుకోవాల‌న్న త‌మ ల‌క్ష్యాన్ని ముందుకు న‌డిపించ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని జ‌ర్మ‌నీ కంపెనీల‌కు భార‌త్ ఆహ్వానించింది. 2020లో జ‌ర్మ‌నీలో జ‌రుగ‌నున్న ప‌ట్ట‌ణాభివృద్ధి విభాగానికి చెందిన జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశాల కోసం ఆస‌క్తికరంగా ఎదురు చూస్తున్న‌ట్టు ఉభ‌య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

 

  1. 2016 సంవ‌త్స‌రంలో జ‌రిగిన హాబిటాట్ III స‌ద‌స్సులు కుదిరిన న్యూ అర్బ‌న్ అజెండాలోని ల‌క్ష్యాల‌ను సాధించే దిశ‌గా క‌లిసి కృషి చేయ‌డానికి ఉభ‌యులు అంగీక‌రించారు. కోచి, కోయంబ‌త్తూర్‌, భువ‌నేశ్వ‌ర్ న‌గ‌రాల అభివృద్ధికి స‌హ‌క‌రించుకునేందుకు ద్వైపాక్షిక స‌హ‌కార ఒప్పందం ప‌ట్ల‌ ఇద్ద‌రు నాయ‌కులు హ‌ర్షం ప్ర‌క‌టిస్తూ భార‌త్ లోని మ‌రిన్ని న‌గ‌రాల అభివృద్ధికి ఈ స‌హ‌కారం విస్త‌రించుకునేందుకు అంగీక‌రించారు.
  2. చ‌త్తీస్ గ‌ఢ్ లో స‌మ‌న్వ‌య‌పూరిత వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు కుదిరిన భాగ‌స్వామ్యానికి అనుమ‌తి ప్ర‌క‌టించ‌డాన్ని జ‌ర్మ‌నీ ఆహ్వానిస్తూ మ‌రిన్ని భార‌తీయ న‌గ‌రాలు, రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, కేంద్ర‌ప్ర‌భుత్వం కూడా ఇందులో భాగ‌స్వాములు కావ‌డాన్ని ప్రోత్స‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

 

  1. వ్య‌వ‌సాయం, ఆహార ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల ప‌రిర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల్లో స‌హ‌కారానికి జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ చేస్తున్న నిర్మాణాత్మ‌క‌మైన కృషిని ఉభ‌య‌వ‌ర్గాలు ప్ర‌శంసిచాయి. 2019 మార్చిలో ఢిల్లీలో ఈ వ‌ర్కింగ్ గ్రూప్ చివ‌రి స‌మావేశం స‌హా ప‌లు స‌మావేశాల్లో ఆహార భ‌ద్ర‌త‌, వ్య‌వ‌సాయంలో శిక్ష‌ణ‌, నైపుణ్యాల అభివృద్ధి, కోత‌ల అనంత‌ర యాజ‌మాన్య విధానాలు, వ్య‌వ‌సాయ లాజిస్టిక్స్ విభాగాల్లో స‌హ‌కారానికి కుదుర్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలు పురోగ‌మిస్తున్న తీరు ప‌ట్ల వారు సంతృప్తి ప్ర‌క‌టించారు.

 

  1. వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్థ‌కం, ఫుడ్ ప్రాసెసింగ్‌, స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ వంటి విభాగాల్లో సాంకేతిక ప‌రిజ్ఞానాలందించ‌డానికి జ‌ర్మ‌న్ కంపెనీల‌కు అవ‌కాశాలు ఎన్నో ఉన్నాయ‌న్న విష‌యం ఉభ‌యులు గుర్తించారు. 2019 చివ‌రిలో ఢిల్లీలో జ‌రుగ‌నున్న కోత‌ల అనంత‌ర యాజ‌మాన్య విధానాలు, వ్య‌వ‌సాయ లాజిస్టిక్స్ వ‌ర్క్ షాప్ కు వారు మ‌ద్ద‌తు ప‌లికారు.

 

  1. రైత‌న్న‌ల‌కు అత్యున్న‌త నాణ్య‌త గ‌ల విత్త‌నాలు అందుబాటులో ఉంచ‌డం ల‌క్ష్యంగా 2019 జూన్ లో చేసిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌ను పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్టు నాయ‌కులు ప్ర‌క‌టిస్తూ విత్త‌నాభివృద్ధిలో భాగ‌స్వామ్యం ఫ‌ల‌వంతం కావ‌డం ప‌ట్ల హ‌ర్షం ప్ర‌క‌టించారు. వ్య‌వ‌సాయ రంగంలో స‌హ‌కారం మ‌రింత పెంచుకోవాల‌న్న ఆకాంక్ష‌ను ప్ర‌క‌టించిన ఉభ‌య వ‌ర్గాలు ఈ దిశ‌గా కొత్త ద్వైపాక్షిక ప్రాజెక్టు చేప‌ట్టేందుకు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేయ‌డాన్ని ఆహ్వానించారు. భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ మార్కెట్ అభివృద్ధికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తారు.

 

  1. ప్ర‌కృతి వ‌న‌రులు ప్ర‌త్యేకించి నీరు, భూమి ప‌రిర‌క్ష‌ణలో సుస్థిర యాజ‌మాన్య విధానాల్లో స‌హ‌కారం కొన‌సాగించుకోవాల‌న్న ఆకాంక్ష‌కు ఇద్ద‌రు నాయ‌కులు మ‌ద్ద‌తు ప‌లికారు.

 

  1. ప్ర‌జ‌ల మ‌ధ్య సాన్నిహిత్యం పెంపు

 

  1. సాంస్కృతిక విభాగంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న బ‌లీయ‌మైన భాగ‌స్వామ్యం ప‌ట్ల ఇద్ద‌రు నాయ‌కులు సంతృప్తిని ప్ర‌క‌టిస్తూ ప్ర‌ష్య‌న్ సాంస్కృతిక హెరిటేజ్ ఫౌండేష‌న్, హంబోల్టో ఫోరం ఏర్పాటు, సాంస్కృతిక వైభ‌వం ప‌రిర‌క్ష‌ణ‌, మ్యూజియంల పున‌రుద్ధ‌ర‌ణ‌ దిశ‌గా స‌హ‌క‌రించుకునేందుకు జ‌ర్మ‌నీతో పాటు జాతీయ మ్యూజియం స‌హా భార‌త‌ మ్యూజియంలు చేసుకున్న ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌ను ఉభ‌యులు ఆహ్వానించారు.

 

  1. కోచ్‌ల విద్య‌, టాలెంట్ పెంపు, ఆధునిక టెక్నాల‌జీలు ప్ర‌వేశ‌పెట్ట‌డం కోసం అఖిల భార‌త ఫుట్ బాల్ ఫెడ‌రేష‌న్‌, జ‌ర్మ‌న్ ఫుట్ బాల్ అసోసియేష‌న్ మ‌ధ్య కుదిరిన భాగ‌స్వామ్యం ప‌ట్ల ఉభ‌య వ‌ర్గాలు హ‌ర్షం ప్ర‌క‌టించాయి.

 

51.న్యూఢిల్లీలోని 2 న‌యామార్గ్ లో జ‌ర్మ‌న్‌రాయ‌బార కార్యాల‌యం పాఠ‌శాల‌, ప్ర‌భుత్వ నిధుల‌తో ప‌ని చేసే ఇత‌ర కార్యాల‌యాల ఏర్పాటు కోసం జ‌ర్మ‌న్ హౌస్ నిర్మించాల‌న్న నిర్ణ‌యం ప‌ట్ల ఉభ‌య నాయ‌కులు హ‌ర్షం ప్ర‌క‌టించారు. జ‌ర్మ‌న్ రాయ‌బార కార్యాల‌యం వాణిజ్య‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, శాస్ర్తీయ విభాగాలు ఈ భ‌వనంలో ఏర్పాట‌వుతాయి. భార‌త‌, జ‌ర్మ‌నీ సాంకేతిక భాగ‌స్వామ్యానికి ఒక చిహ్నంగా డిజైన్ చేయ‌త‌ల‌పెట్టిన ఈ భ‌వ‌నం అత్యాధునిక ప‌రిజ్ఞానాల‌తో నిర్మించేందుకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు.

 

52.విద్యారంగంలో మ‌రింత స‌హ‌కారానికి కూడా నాయ‌కులు అంగీక‌రించారు. ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో విద్యాభ్యాసం చేస్తున్న భార‌తీయ విద్యార్ధులు 20,800 కాగా ఆ సంఖ్య మ‌రింత పెంచుకునేంద‌కు కూడా చ‌ర్య‌లు తీసుకోవ‌డం, భార‌త‌దేశానికి విద్యార్థుల రాక‌కు మ‌రింత మెరుగైన మార్గం క‌ల్పించ‌డం కోసం ఇండో జ‌ర్మ‌న్ ఉన్న‌త విద్యా భాగ‌స్వామ్యం కింద చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న నిర్ణ‌యాల ప‌ట్ల ఉభ‌యులు హ‌ర్షం ప్ర‌క‌టించారు. ఆధునిక భార‌తీయ భాష‌ల‌ను జ‌ర్మ‌న్ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి 2015లో కుదిరిన సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో కుదుర్చుకున్న అంగీకారం ప్రాధాన్య‌త‌ను గుర్తిస్తున్న‌ట్టు వారు ప్ర‌క‌టించారు.

 

  1. 2020 సంవ‌త్స‌రంలో ప‌దో వార్షికోత్స‌వం నిర్వ‌హించుకుంటున్న‌ ఇండో జ‌ర్మ‌న్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ సెంట‌ర్, ఐజిఎస్ టిసిలో కొన‌సాగుతున్న దీర్ఘ‌కాలిక ప‌రిశోధ‌న భాగ‌స్వామ్యాన్ని ఇద్ద‌రు నాయ‌కులు ప్ర‌శంసించారు. టియు9, ఐఐటిల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌య స్థాయి భాగ‌స్వామ్యంతో పాటు ఇండో జ‌ర్మ‌న్ సెంట‌ర్ ఫ‌ర్ స‌స్టెయిన‌బులిటీకి మ‌ద్ద‌తును కొన‌సాగించాల‌ని వారు నిర్ణ‌యించారు.

 

  1. సాంప్ర‌దాయిక వైద్య విధానాల మ‌ధ్య ప‌రిశోధ‌న భాగ‌స్వామ్యాన్ని మ‌రింత విస్త‌రించుకునేందుకు జ‌ర్మ‌నీకి చెందిన ఎఫ్ఐజ‌డ్‌, అఖిల భార‌త ఆయుర్వేద వైద్య విద్యా సంస్థ మ‌ధ్య కుదిరిన ఒప్పందంలోని అంశాల‌ను మ‌రింత ముందుకు న‌డిపేందుకు స‌ర్వ‌స్వ‌తంత్రంగా ప‌ని చేస్తున్న భార‌త ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధునిక వైద్య విధానాల‌తో ఆయుర్వేద సూత్రాల‌ను అనుసంధానం చేస్తూ అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

 

  1. సాంప్ర‌దాయిక వైద్య‌విధానాలు ప్ర‌త్యేకించి ఆయుర్వేద‌, యోగ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో పోషిస్తున్న పాత్ర‌ను గుర్తిస్తూ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నంలో ఆ రెండు వైద్య విధానాల పాత్ర‌ను దృష్టిలో ఉంచుకుని విద్య‌, ప‌రిశోధ‌న‌, ఆచ‌ర‌ణీయ విభాగాల్లో స‌హ‌కారం విస్త‌రించుకోవ‌డానికి అవ‌కాశం గ‌ల విభాగాల్లో ద్వైపాక్షిక ప్రాజెక్టులు చేప‌ట్ట‌నున్నార‌ని ప్ర‌క‌టించారు. సాంప్ర‌దాయిక వైద్య విధానాల‌కు అవ‌స‌రం అయిన మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డంలో పెట్టుబ‌డులు ప్రోత్స‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు.

 

  1. దౌత్య విభాగానికి చెందిన అన్ని అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డం కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌ను వ్య‌వ‌స్థాత్మ‌కం చేయాల‌న్న నిర్ణ‌యాన్ని ఉభ‌య నాయ‌కులు ప్ర‌శంసించారు. వీలైనంత త్వ‌ర‌లో భార‌త‌-జ‌ర్మ‌నీ రాయ‌బార స్థాయి తొలి చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

 

  1. నేర‌పూరిత అంశాల్లో ప‌ర‌స్ప‌ర న్యాయ‌ స‌హ‌కార ఒప్పందానికి తుది రూపం ఇచ్చే ప‌నులు సంతృప్తిక‌రంగా పురోగ‌మిస్తూ ఉండ‌డం ప‌ట్ల నాయ‌కులు హ‌ర్షం ప్ర‌క‌టించారు.ఇండో జ‌ర్మ‌నీ వ‌ల‌స‌, మొబిలిటీ భాగ‌స్వామ్య ఒప్పందం కింద మైగ్రేష‌న్‌, మొబిలిటీ భాగ‌స్వామ్యానికి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌ను మ‌రింత ముందుకు న‌డిపించాల‌ని వారు నిర్ణ‌యించారు.

 

58.వీసాల జారీని మ‌రింత స‌ర‌ళం చేయ‌డం కోసం ముంబైలోని జ‌ర్మ‌న్ కాన్స‌ల్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో 2020 ఆగ‌స్టు నుంచి షెన్జెన్ వీసా సెంట‌ర్ ప్రారంభించాల‌న్న జ‌ర్మ‌న్ ఫెడ‌రేష‌న్ విదేశీ కార్యాల‌యం ఆకాంక్ష ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల భార‌త ప్ర‌భుత్వం హ‌ర్షం ప్ర‌క‌టించింది.

 

  1. ప్ర‌పంచ బాధ్య‌త‌ల భాగ‌స్వామ్యం

 

  1. 2020 నాటికి 20వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశిస్తున్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ఠం చేసుకునే ల‌క్ష్యంతో విదేశాంగ కార్యాల‌య స్థాయి సంప్ర‌దింపుల‌ను వ్య‌వ‌స్థీకృతం చేయాల‌ని, ఒక నుంచి విదేశాంగ కార్య‌ద‌ర్శి స్థాయి చ‌ర్చ‌లు ప్ర‌తీ ఏడాది నిర్వ‌హించాల‌ని ఉభ‌య వ‌ర్గాలు నిర్ణ‌యించాయి. ప్ర‌తీ ఏడాది జాతీయ‌, ప్రాంతీయ‌, వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాలు గ‌ల అంశాల్లో అభిప్రాయాలు, భావాలు పంచుకునేందుకు కీల‌క భాగ‌స్వాములంద‌రితోనూ 1.5 వ్యూహాత్మ‌క చ‌ర్చ‌ల ట్రాక్ ఒక‌టి ఏర్పాటు చేశారు. విధాన‌ప‌ర‌మైన అంశాల్లో ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు అవ‌స‌రం అయిన సిఫార‌సుల‌ను ఇది అందిస్తుంది. అలాగే మీడియా వృత్తి నిపుణుల‌ను ప‌ర‌స్ప‌రం పంపించుకోవ‌డానికి వీలుగా నిరంత‌రం స‌మాచార మార్పిడి వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుచుకోవాల‌ని కూడా నిర్ణ‌యించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో స్వేచ్ఛాయుత‌మైన ప‌త్రికా వ్య‌వ‌స్థ ఉండాల‌న్న క‌ట్టుబాటు ఉభ‌యులు ప్ర‌క‌టించారు. ఉభ‌య దేశాల‌కు చెందిన పార్ల‌మెంటేరియ‌న్లు, పండితుల మ‌ధ్య క్ర‌మం త‌ప్ప‌ని బంధాన్ని ప్రోత్స‌హించాల‌ని ఇద్ద‌రు నాయ‌కులు నిర్ణ‌యించారు. విద్యా, చ‌ర్చ విధానాల ద్వారా ఇలాంటి బంధాన్ని ఏర్పాటు చేయ‌డంలో జ‌ర్మ‌న్ రాజ‌కీయ ఫౌండేష‌న్లు కీల‌క పాత్ర పోషించాల‌ని వారు భావించారు.

 

  1. వ‌ర్థ‌మాన‌, అల్పాదాయ దేశాల్లో స్థిర‌మైన ప్ర‌భుత్వ రుణ వ్య‌వ‌స్థను నిర్మించ‌డం కోసం ప్రైవేటు, ప్ర‌భుత్వ‌ రుణ‌దాత‌లు, రుణ‌గ్ర‌హీత‌ల మ‌ధ్య పార‌ద‌ర్శ‌కం, ఆధార‌నీయ‌మైన ఫైనాన్సింగ్ విధానాలు నెల‌కొనేలా చేయాల్సిన అవ‌స‌రాన్ని ఇద్ద‌రు నాయ‌కులు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇందులో భాగంగా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి, ప్ర‌పంచ బ్యాంకు, పారిస్ క్ల‌బ్ నిర్వ‌హిస్తున్న పాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని వారు నిర్ణ‌యించారు. ద్వైపాక్షిక అధికార రుణ‌భారాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌డంలో పారిస్ క్ల‌బ్ నిర్మాణాత్మ‌క‌మైన‌ పాత్ర పోషిస్తున్న విష‌యం ధ్రువీక‌రిస్తూ ప్ర‌భుత్వ రుణ అంశాల‌కు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

 

61.ప్ర‌పంచ‌, ప్రాంతీయ భ‌ద్ర‌తా స‌వాళ్ల‌ను దీటుగా ఉమ్మ‌డిగా ఎదుర్కొన‌డానికి వ్యూహాత్మ‌క భాగ‌స్వాములుగా తాము ద్వైపాక్షిక ర‌క్ష‌ణ స‌హ‌కారం మ‌రింత విస్త‌రించుకోవాల‌నుకుంటున్న‌ట్టు భార‌త్‌, జ‌ర్మ‌నీ ప్ర‌క‌టించాయి. అంత‌ర్జాతీయ‌, యూరోపియ‌న్‌, జాతీయ నిబంధ‌న‌ల ప‌రిధిలోనే అవ‌స‌ర‌మైన సైనిక స‌హాయం చేయ‌డానికి, సాంకేతిక ప‌రిజ్ఞానం బ‌దిలీకి జ‌ర్మ‌నీ అంగీక‌రించింది. భార‌త ప్ర‌భుత్వ మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మం కింద ఉభ‌య దేశాల ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య స‌హ‌కారం విస్త‌రించుకోవ‌డం ద్వారా ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ఉమ్మ‌డి అభివృద్ధి, ఉమ్మ‌డి ఉత్ప‌త్తి చేప‌ట్ట‌డాన్ని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు. అలాగే త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ర‌క్ష‌ణ కారిడార్ల ప్ర‌యోజ‌నాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంగీక‌రించారు. హిందూ మ‌హాస‌ముద్రం సుస్థిర‌త ప్ర‌యోజ‌నాల దృష్ట్యా భార‌త‌, జ‌ర్మ‌నీ నౌకా పారిశ్రామిక విభాగాల‌ (ఉదాహ‌ర‌ణ‌కు జ‌లాంత‌ర్గాములు) మ‌ధ్య ప్రాజెక్టులు చేప‌ట్ట‌డాన్ని కూడా ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు. ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మైన టెస్టింగ్‌, స‌ర్టిఫికేష‌న్‌, వివిధ వ్య‌వ‌స్థ‌లు, ఉప‌వ్య‌వ‌స్థ‌ల డిజైన్ స‌ర్టిఫికేష‌న్‌, నాణ్య‌తా ప్ర‌మాణాల కోసం ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య శ‌క్తివంత‌మైన స‌హ‌కారం అభివృద్ధి చేసుకోవ‌డానికి కూడా ఉభ‌య వ‌ర్గాలు అంగీక‌రించాయి. అంతే కాదు, స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌లో ఉభ‌య దేశాలు త‌మ దేశాల చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు/  సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా ప్ర‌ధాన ప‌రిశ్ర‌మ‌ల‌తో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కూడా వారు అంగీకారానికి వ‌చ్చారు.

 

  1. ఉభ‌య దేశాల ర‌క్ష‌ణ మంత్రుల మ‌ధ్య ప్ర‌తీ రెండేళ్ల‌కు ఒక సారి జ‌ర్మ‌నీ, భార‌త్ ల‌లో చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌న్న నిర్ణ‌యాన్ని ఇద్ద‌రు నాయ‌కులు ఆహ్వానించారు. ఈ ఏడాది మొద‌ట్లో సంత‌కాలు చేసిన ద్వైపాక్షిక ర‌క్ష‌ణ స‌హ‌కారం అమ‌లు ఒప్పందాన్ని కూడా వారు ఆహ్వానించారు. ఇది కొత్త ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా చ‌ర్చ‌ల వ్య‌వ‌స్థ‌ల ప‌రిధిలో ర‌క్ష‌ణ స‌హ‌కారానికి మ‌రింత ఉత్తేజం క‌ల్పిస్తుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. అంతే కాదు ప్ర‌పంచ‌, ప్రాంతీయ‌, సాగ‌ర‌, సైబ‌ర్ సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి శాంతి ద‌ళానికి ప‌ర‌స్ప‌రం ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వ‌డానికి కూడా వారు అంగీక‌రించారు.

 

  1. మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఉభ‌య నాయ‌కులు ఆయ‌న‌కు ఘ‌న నివాళి అర్పించారు. అహింస‌, సామ‌ర‌స్య సిద్ధాంతాల‌కు హార‌తి ప‌ట్టారు. ఐక్య‌రాజ్య స‌మితి నియ‌మావ‌ళి ప‌రిధిలో ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌, స‌మాన‌త్వం, సార్వ‌భౌమ‌త్వాల‌ను కాపాడుకుంటూ ఉమ్మ‌డి విలువ‌ల ప్రాతిప‌దిక‌న‌ ప్ర‌జాస్వామిక పాల‌న‌, చ‌ట్ట‌ప‌ర‌మైన నిబంధ‌న‌లకు క‌ట్టుబాటు, మాన‌వ వ‌న‌రులు, మౌలిక హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ‌, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం పెంపొందంచుకోవ‌డానికి క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. మాన‌వ హ‌క్కుల‌కు, ప్రాథ‌మిక స్వేచ్ఛ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, ఆత్మ‌ర‌క్ష‌ణ ల‌క్ష్యంతో జాతీయ, అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్ఠం చేయాల‌ని ఉభ‌యులు నిర్ణ‌యించారు. ప్ర‌పంచ శాంతి, భ‌ద్ర‌త‌, ప్ర‌పంచ ఆర్థిక సుస్థిర‌త‌, అభివృద్ధి కోసం జి 20, ఐక్య‌రాజ్య‌స‌మితి, ఇత‌ర బ‌హుముఖీన వ్య‌వ‌స్థ‌ల స్థాయిలో భాగ‌స్వాముల‌తో క‌లిసి ద్వైపాక్షిక, స‌న్నిహిత స‌హ‌కారం పెంపొందించుకోవాల‌ని ఉభ‌య దేశాలు నిర్ణ‌యించాయి. 2022లో జి20కి భార‌త‌దేశం, 2022లో జి7కి జ‌ర్మ‌నీ నాయ‌క‌త్వం వ‌హించే స‌మ‌యంలో మ‌రింత స‌న్నిహితంగా స‌హ‌క‌రించుకునేందుకు ఎదురు చూస్తున్న‌ట్టు ఉభ‌య‌వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

 

  1. అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప‌రిధిలో ప్ర‌త్యేకించి ఐక్య‌రాజ్య‌మితి సాగ‌ర ఒప్పందం 1982ని గౌర‌విస్తూ నిరంత‌రాయ‌మైన వాణిజ్య‌, నౌకా స్వేచ్ఛ‌కు గ‌ల ప్రాధాన్య‌త‌ను గౌర‌వించుకోవాల‌ని ఉభ‌య వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాయి.

 

  1. స్థిర‌మైన‌, ఐక్య‌త‌, సుసంప‌న్న‌త‌, బ‌హుముఖీన‌త‌, శాంతిలో విల‌సిల్లే ఆఫ్ఘ‌నిస్థాన్ ఏర్పాటుకు ఉభ‌య నాయ‌కులు క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. పూర్తిగా స‌ర్వ‌స్వ‌తంత్ర‌మైన, ఆఫ్ఘ‌న్ల నిర్వ‌హ‌ణ‌లోని శాంతి, రాజీ ప్ర‌ణాళికు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ల‌క్ష్యంగా ఇంట్రా ఆఫ్ఘ‌న్ చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించ‌డంలో జ‌ర్మ‌నీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త్ ప్ర‌శంసించింది. హింస‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని, అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద ధోర‌ణులు విడ‌నాడాల‌ని పిలుపు ఇవ్వ‌డంతో పాటు ఉగ్ర‌వాదులకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న ప్ర‌దేశాలు ధ్వంసం చేయ‌డం, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం, ఆఫ్ఘ‌న్ పౌరులంద‌రికీ రాజ్యాంగం ప‌రిధిలో సార్వ‌త్రిక మాన‌వ హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం ప్ర‌ధాన‌మ‌ని నొక్కి చెప్పారు. ఆఫ్ఘ‌నిస్తాన్ పున‌ర్నిర్మాణానికి కృషి చేయ‌డంతో పాటు అభివృద్ధి స‌హాయం అందించ‌డానికి భార‌త‌దేశం తీసుకుంటున్న చొర‌వ‌ను జ‌ర్మ‌నీ ప్ర‌శంసించింది. ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ విశ్వాస నిర్మాణ చ‌ర్య‌లు, రాజ‌కీయ స‌హ‌కారం వంటి ల‌క్ష్యాల‌తో ముందుకు సాగ‌డంలో ఆఫ్ఘ‌నిస్తాన్ కోసం ఆసియా-ఇస్తాంబుల్ ప్ర‌క్రియ కీల‌కం అన్న విష‌యం ప్ర‌క‌టించారు.

 

  1. ఉగ్ర‌వాదం ప్ర‌పంచానికే ముప్పు అని ఉభ‌య‌దేశాల నాయ‌కులు గ‌ట్టిగా చెబుతూ దాన్ని ఉమ్మ‌డిగా ఎదుర్కొనాల‌ని తీర్మానించుకున్నారు. ఉగ్ర‌వాదుల ర‌క్ష‌ణ స్థ‌లాల‌ను, మౌలిక వ‌స‌తుల‌ను పూర్తిగా నిర్మూలించాల‌ని, ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ ల‌ను విచ్ఛిన్నం చేయాల‌ని, వారికి ఆర్థిక‌స‌హాయం అందిస్తున్న మార్గాలు మూసివేయాల‌ని అన్ని దేశాల‌కు పిలుపు ఇచ్చారు. ఉగ్ర‌వాదాన్ని దీటుగా ఎదుర్కొన‌డంలో శ‌క్తివంత‌మైన అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం వారు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.ఉగ్ర‌వాదం స‌మాచారం, గూఢ‌చ‌ర్యానికి సంబంధించిన స‌మాచారాన్ని పంపిణీ చేసుకోవాల‌ని, దేశీయ‌, అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, మాన‌వ హ‌క్కుల‌ను కాపాడాల‌ని, అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల చ‌ట్టాల‌ను గౌర‌వించాల‌ని నిర్ణ‌యించారు.

 

  1. ఏ ఒక్క దేశం కూడా త‌మ భూభాగం ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు స్థావ‌రం కావ‌డాన్ని, ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు కేంద్ర‌స్థానం కావ‌డాన్ని అనుమ‌తించ‌రాద‌ని వారు నొక్కి చెప్పారు. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదాన్ని ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా ఉమ్మ‌డిగానే ఎదుర్కొనాల‌ని, ఉగ్ర‌వాదం అనేది ఏ విధానంలో అయినా, ఏ ర‌కంగా అయినా అంత‌ర్జాతీయ స‌మాజంలో ఆమోద‌నీయం కాద‌నే బ‌లీయ‌మైన సందేశం వెలువ‌రించాల‌ని పిలుపు ఇచ్చారు.2020 మార్చి నాటికి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద నిర్మూల‌న స‌మ‌గ్ర ఒప్పందం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఆమోదింప‌చేయాల‌ని వారు పిలుపు ఇచ్చారు.

 

  1. జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ స్థాయిలోనే ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఎదుర్కొనే విష‌యంలో కూడా స‌హ‌కారం కొన‌సాగించుకోవాల‌ని, ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ లకు సంబంధించిన‌ స‌మాచారం, గూఢ‌చ‌ర్య స‌మాచారం అందించుకోవాల‌ని, నానాటికీ పెరిగిపోతున్న తీవ్ర‌వాద ధోర‌ణుల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ఉభ‌య నాయ‌కులు అంగీక‌రించారు. ఉగ్ర‌వాద నిరోధక చ‌ర్య‌ల కోసం జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశం త్వ‌ర‌గా ఏర్పాటుచేయాల‌ని వారు త‌మ అధికార‌వ‌ర్గాల‌ను కోరారు.

 

  1. ఇరాన్‌, ఇ3+3 మ‌ధ్య‌న కుదిరిన స‌మ‌గ్ర ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లుకు త‌మ మ‌ద్ద‌తును ఉభ‌య దేశాలు పున‌రుద్ఘాటించాయి. దాని చుట్టూ అల్లుకున్న స‌మ‌స్య‌ల‌ను కూడా రాజ‌కీయ చ‌ర్చ‌ల ద్వారా శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని పిలుపు ఇచ్చారు. ఇరాన్ అణు కార్య‌క్ర‌మం విష‌యంలో స‌మ‌గ్ర ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు ఇద్ద‌రు నాయ‌కులు త‌మ క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. అలాగే ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త పాదుగొల్ప‌డానికి ఐక్య‌రాజ్య‌స‌మితి కౌన్సిల్ తీర్మానం 2231 కీల‌క‌మ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల స‌డ‌లింపుతో పాటు ప్ర‌తీ స‌మ‌స్య‌ను శాంతియుత చ‌ర్చ‌లు, విశ్వాస నిర్మాణం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాల‌ని పిలుపు ఇచ్చారు.

 

  1. అంత‌ర్జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న ఆయుధ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌ల‌ను ప‌టిష్ఠం చేయ‌డానికి ఇద్ద‌రు నాయ‌కులు త‌మ క‌ట్టుబాటును ప్ర‌క‌టించారు. మిసైల్ టెక్నాల‌జీ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌, ఆస్ర్టేలియా గ్రూప్‌, వాసెనార్ ఒప్పందంలో భాగ‌స్వామి కావ‌డానికి భార‌త్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నందుకు జ‌ర్మ‌నీకి భార‌త్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అణు స‌ర‌ఫ‌రా దేశాల బృందంలో (ఎన్ఎస్ జి) భార‌త భాగ‌స్వామ్యానికి సంపూర్ణ మ‌ద్ద‌తును జ‌ర్మ‌నీ పున‌రుద్ఘాటించింది. భార‌త‌దేశం చేప‌ట్టిన నిర్మాణాత్మ‌క అణువ్యాప్తి నిరోధం, నిరాయుధీక‌ర‌ణ‌, ఆయుధ సంప‌త్తి అదుపు చ‌ర్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా జ‌ర్మ‌నీ గుర్తు చేసింది.

 

71.. ఐక్యరాజ్య మితి ర్వప్రతినిధి  74 మావేశాల సందర్భంగా ద్రతా మండలి సంస్కపై ఒక తీర్మానం హాయంతోనే ర్చలు రిపేందుకు జి-4 దేశాలుఇత సంస్క ప్రాధాన్య దేశాలుబృందాలు ట్టి ప్రత్నం చేయాలని ఇద్దరు నాయకులు పిలుపు ఇచ్చారుసంస్కరించివిస్తరించిన ఐక్యరాజ్య మితి ద్రతా మండలిలో భ్యత్వానికి ఉభయులు స్పరం పూర్తి స్థాయిలో రించుకోవాలన్న ట్టుబాటును వారు పునరుద్ఘాటించారుహుముఖీన నిబంధనల ఆధారిత వ్యస్థను టిష్ఠం చేయడానికి ద్రతామండలిలో సంస్కలు కీలని వారు నొక్కి క్కాణించారుఅంతర్జాతీయ శాంతిసుస్థిర ర్య విషయంలో అంతర్జాతీయ స్థాయిలో కీలకంగా వ్యరించడానికి ద్రతామండలిలో రైన ప్రాతినిథ్యం లేకుండా పోయిందన్న‌ విషయం గుర్తు చేశారుఅందరూ అంతర్జాతీయ స్ధాయిలో ఎదుర్కొంటున్న వాళ్ల నేపథ్యంలో ఐక్యరాజ్యమితిని ర్థవంతమైనదిలీయమైనదిట్టద్ధమైనదిగా తీర్చి దిద్దాల్సిన అవరం ఉన్నని వారు అంగీకారానికి చ్చారు.

 

  1. శాంతిసుస్థిర‌, సంపన్న సాధకు లీయమైన‌, ర్థవంతమైన హుముఖీన కారం అవరంనం ప్రస్తుతం లు వాళ్లు ఎదుర్కొంటున్న  కాలంలో ప్రతీ అంశానికి  అంతర్జాతీయ‌ స్వభావంరిధి కారణంగా  ఒక్క దేశం  అంశాన్ని ఏకాకిగా రిష్కరించలేదుఅందరి కారంతో ఉమ్మడిగానే ఏదైనా ఎదుర్కొనడం సాధ్యం అని ఉభయులు క్కాణించారు,

 

  1. ఐజిసి 5 మావేశంలో రిగిన ర్చ ట్ల ఉభ దేశాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని రింత లోపేతం చేసుకునేందుకు ట్టుబాటును ప్రటించారుఅలాగే ప్రాంతీయప్రపంచ ప్రాధాన్యం  అంశాల‌ విషయంలో  ఉమ్మడి లాలను కూడదీసుకుని ని చేయాలని నిర్ణయించారుఐజిసికి క్కనిహృదపూర్వమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ర్మనీ ఫెడల్ చాన్సర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీకి న్యవాదాలు తెలిపారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India AI Summit: Global South’s AI Voice Finds Its Microphone In Delhi

Media Coverage

India AI Summit: Global South’s AI Voice Finds Its Microphone In Delhi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Chhatrapati Shivaji Maharaj on his Jayanti
February 19, 2026

On the Jayanti of Chhatrapati Shivaji Maharaj, Prime Minister Shri Narendra Modi paid homage to the visionary leader, exceptional administrator, strategic thinker, and champion of Swarajya.

The Prime Minister stated that Shivaji Maharaj’s courage continues to inspire, his governance serves as a guiding light, and his spirit of justice and self-respect strengthens society even today.

He emphasized that Chhatrapati Shivaji Maharaj always placed the welfare of every single person above everything else and dedicated himself completely to their protection. This commitment is why his life remains a beacon for India across generations.

In separate posts on X, Shri Modi said:

“On the Jayanti of Chhatrapati Shivaji Maharaj, we bow in reverence to the visionary leader, exceptional administrator, strategic thinker and champion of Swarajya.

May his courage inspire us, his governance guide us and his spirit of justice and self-respect strengthen our society.”