షేర్ చేయండి
 
Comments

సాధారణ భావన

ఆర్థికాభివృద్ధి ని పెంపొందించడానికి, సుస్థిర అభివృద్ధి, మరియు డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి అవసరమైన ఇంటర్ నెట్ విస్తరణ కోసం తమ సమాజాల్లో డిజిటల్ టెక్నాలజీ ని ఒక రూపాంతర కారకంగా చేయాలన్నది భారత, ఫ్రాన్స్ దేశాల ఉద్దేశ్యం.

ఇందులో భాగంగా, పౌరులకు సాధికారత కల్పించి, అసమానతలు తగ్గించి, సుస్థిర అభివృద్ధి పెంపొందించడానికి భారత, ఫ్రాన్స్ దేశాలు డిజిటల్ టెక్నాలజీ పై దృష్టి సారించాయి. .

అంతర్జాతీయ భద్రతా మరియు దౌత్యపరమైన కృషి

ఒక ఉదారమైన, నమ్మకమైన, భద్రతతో కూడిన స్థిరమైన, శాంతియుతమైన సైబర్ స్పేస్ నెలకొల్పుకోవాలన్న తమ నిబద్ధతను ధృవీకరించాయి. శాంతి, సుస్థిరతలను కాపాడడానికి ఇది అవసరం. ఉదారమైన, భద్రతతో కూడిన, శాంతియుతమైన డిజిటల్ వాతావరణాన్ని పెంపొందించడానికి, అంతర్జాతీయ చట్టాలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి విభాగం అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజ్యసమితి పరిధికి లోబడి విశ్వాసం, సామర్ధ్య నిర్మాణం చర్యలను అభివృద్ధి చేయడం తో పాటు , సైబర్ స్పేస్ లో భార్యయుతమైన అధికార ప్రవర్తన కోసం స్వచ్చందంగా కొన్ని నిబంధనలను అమలుచేయడం, అభివృద్ధి పరచడం ప్రాముఖ్యతను వారు పునరుద్ఘాటించారు. సైబర్ స్పేస్ లో శాంతి, భద్రతలకు సమిష్టి కృషే పునాది.

సైబర్ స్పేస్ లో విస్వాసం, భద్రత, స్థిరత్వం పెంపొందించడానికి, ఎన్నో రకాల అంశాలు తమ తమ పాత్రలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నట్లు ఫ్రాన్స్, భారత దేశాలు – గుర్తించాయి. ఉదారం, భద్రత, స్థిరమైన, అందుబాటులో, శాంతియుత డిజిటల్ వాతావరణం నెలకొల్పుకోడానికి బహుళ భాగస్వామ్య విధానాన్ని పటిష్ఠపరచుకోవాలని వారు పిలుపునిచ్చారు

పరిపాలన, సార్వభౌమత్వం, సాంకేతిక నియంత్రణ

రాష్ట్రాలతో సహా భాగస్వామ్య పక్షాలందరి ప్రయోజనాలను గౌరవించే ఇంటర్ నెట్ కోసం, బహుళ భాగస్వాములు, బహుపాక్షిక విధానాన్ని పరిరక్షించడం ద్వారా సమ్మిళిత, పారదర్శకమైన, ఉదార డిజిటల్ వాతావరణాన్ని పెంపొందించడం కోసం భారత, ఫ్రాన్స్ దేశాలు కలిసి పనిచేయాలని తలచాయి.

డిజిటల్ టెక్నాలజీ యొక్క వేగవంతమైన అభివృద్ధి, వినియోగాన్ని భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. అంతర్జాతీయ సమాజం తీసుకునే సహకార, సముచితమైన, నిశ్చయమైన, స్థిరమైన చర్య తప్పనిసరిగా ఉండాలి. ఆన్ లైన్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ నుపరిరక్షించడంతో పాటు, రాష్ట్రాల భూభాగంలో ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాలపై రాష్ట్రాల సార్వభౌమాధికారానికి హామీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు దేశాలు ఉన్నాయి.

సైబర్ భద్రత రంగంలో సహకారం

ఈ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. ప్యారిస్ లో 2019 జూన్ 20వ తేదీన జరిగిన మూడవ దఫా సైబర్ చర్చల ముగింపులో ఆమోదించిన సంయుక్త ప్రకటనను స్వాగతించాయి.

ఈ విషయంలో, అంతర్జాతీయ చట్టాల అమలుతో పాటు, గతంలో జరిగిన యు ఎన్ జిజిఈ నివేదికల అమలు, అదే విధంగా సైబర్ స్పేస్ విషయంలో బాధ్యతాయుతమైన రాష్ట్రాల ప్రవర్తనపై నిబంధనల అమలు కోసం కొనసాగుతున్న చర్చ వివిధ బహు పాక్షిక వేదికలకు అంకితమైన చర్చకు మద్దతుగా వారి సమన్వయాన్ని పటిష్ఠపరచాలని భారత, ఫ్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి.

భారత, ఫ్రాన్స్ దేశాలు తమ సహకారాన్ని ప్రముఖంగా తమ సైబర్ భద్రతా సంస్థల మధ్య సమాచార మార్పిడి ద్వారా బలోపేతం చేసుకోడానికి తమ సుముఖతను వ్యక్తం చేశాయి. ద్వేషపూరిత చర్యలను నిరోధించడానికి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి, వారి సామర్ధ్య ప్రభావాన్ని తగ్గించడానికి, వాటి కారణాలను గుర్తించడానికి ఈ చర్య దోహదపడుతుంది.

డిజిటల్ ప్రక్రియలు, ఉత్పత్తులు, సేవల భద్రత ను పటిష్ట పరచుకోవలసిన అవసరాన్ని భారత్, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. జాతీయ భద్రతను ప్రభావింతం చేసే ఆర్ధిక సమాచార మౌలిక సదుపాయాలూ , డిజిటల్ ఉత్పత్తుల పరీక్ష, ధ్రువీకరణలతో సహా చట్టపరమైన, నియంత్రణ విధానం, ఉత్తమ పద్ధతుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భావించాయి. ఈ సందర్భంలో, 5జి టెక్నాలజీ విస్తరణకు సంబంధించిన ఇబ్బందులు, వాటిని పరిష్కరించడానికి అమలుచేస్తున్న సాంకేతిక పరిష్కారాలపై కలిసి పనిచేయాలని భారత, ఫ్రాన్స్ దేశాలు నిర్ణయించాయి.

సైబర్ స్పేస్ లో హానికరమైన సాధనాలు, విధానాల విస్తరణ ద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించవలసిన అవసరాన్ని కూడా భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. ఇందు కోసం, రెండు పక్షాలు భాగస్వాములుగా ఉన్న వస్సేనార్ ఏర్పాటు కింద జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ చర్యలో భాగంగా, చట్ట పరమైన, నియంత్రణ వ్యవస్థ లోని అంశాలను ముఖ్యంగా ఆర్ధిక సమాచార మౌలిక సదుపాయాల రక్షణ గురించి పంచుకోవాలని భారత, ఫ్రాన్స్ దేశాలు నిర్ణయించాయి.

సైబర్ భద్రతకు వచ్చే బెదిరింపులను ఎదుర్కోడంలో, ముఖ్యంగా జాతీయ భద్రతను ప్రభావితం చేసే ఆర్ధిక సమాచార మౌలిక సదుపాయాల విషయంలో, అన్ని దేశాల మధ్య – సన్నిహిత సహకారం ప్రాముఖ్యతను భారత, ఫ్రాన్స్ దేశాలు ప్రముఖంగా పేర్కొన్నాయి.

సైబర్ నేరాలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహకారం

సైబర్ నేరం ఒక బహుళ జాతి నేరం. అందువల్ల సైబర్ నేరస్తులను సమర్ధంగా చట్టం ముందుకు తీసుకురావాలంటే మెరుగైన అంతర్జాతీయ సహకారం అవసరం ఉంటుందని భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. అందువల్ల, సులువుగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, సాక్ష్యాల సేకరణ, నేరస్థుల గుర్తింపు, ముఖ్యంగా వైరస్ వంటివి సృష్టించేవారు, వెబ్ హోస్టింగ్ చేసేవారు, ప్రసారం చేసేవారిని గుర్తించడం వంటి విషయాలలో, వారి సహకారం పటిష్ఠపరచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏ టి ఎమ్ యంత్రాల ద్వారా నగదు తీసుకోవడం తో సహా ఆన్ లైన్ మోసాలకు వ్యతిరేకంగా వినియోగదారుల రక్షణకు తమ నిబద్ధతను నిర్ధారించుకున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతులద్వారా చేసే చెల్లింపుల భద్రత గురించి కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరగా, సర్వీస్ ప్రొవైడర్లు, సామాజిక మీడియా సంస్థల నుండి సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటుతో సైబర్ నేరాలను నివారించడానికి అనువైన ప్రణాళికలపై వారు చర్చించాలని నిర్ణయించారు.

డిజిటల్ పరిపాలనలో సహకారం

ప్రాంతాల వారీ సవాళ్లు

అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ రంగాన్ని సురక్షితంగా ఉంచడానికి, చట్టబద్ధమైన, సరసమైన, సమతుల్య విధానం అభివృద్ధి చేయడానికి, వారి సమన్వయాన్ని పటిష్ఠపరచుకోవాలని భారత్, ఫ్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి. ప్రజా వస్తువులు, డేటా సార్వభౌమాధికారం, ప్రాధమిక స్వేచ్ఛ మొదలైన వాటికి సాంకేతికతలు రక్షణగా ఉండే విధంగా అవసరమైన ప్రణాలికను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని కూడా భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి.

కృత్రిమ మేధస్సు నియంత్రణ

కృత్రిమ మేధస్సు ముఖ్యంగా, సుస్థిర అభివృధి, ఈ -పరిపాలన, స్వయం ప్రతిపత్తి రవాణా, స్మార్ట్ నగరాలు, సైబర్ భద్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల ద్వారా లభించే అభివృద్ధిని భారత, ఫ్రాన్స్ దేశాలు స్వాగతించాయి.

పౌర కేంద్రీకృత సేవలు, చట్టాలు, నియంత్రణ, సైబర్ భద్రతా దృక్ఫధాలకు చెందిన డేటా సార్వభౌమాధికారం మొదలైన విషయాలలో కృత్రిమ మేధస్సు విధానాలు / కార్యక్రమాల అభివృద్ధి, అమలు యొక్క అవసరాన్ని భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. కృత్రిమ మేధస్సు లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన నైపుణ్యాలను, ఉత్తమ విధానాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకోడానికి భారత, ఫ్రాన్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయి.

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మానవాళి సేవలో అంతర్జాతీయ, న్యాయ, నైతిక మూల నిధి ఏర్పాటుచేయవలసిన ప్రాముఖ్యాన్ని భారత, ఫ్రాన్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. జి-7, జి-20, ఐక్యరాజ్య సమితి వంటి వివిధ అంతర్జాతీయ వేదికలపై ఈ లక్ష్యంతో పనిచేయడానికి, కృత్రిమ మేధస్సు పై అంతర్జాతీయ మండలి (ఐపిఏఐ) లో పాల్గొనడానికి, కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు.

ఆన్ లైన్ లో తీవ్రవాదం, హింస, ఉగ్రవాదం, ద్వేషపూరిత సమాచారం మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాటం

ఆన్ లైన్ లో చట్ట విరుద్ధ, ద్వేష పూరిత ప్రసంగాలతో సహా తీవ్రవాద, హిస్మాత్మక ఉగ్రవాద సమాచార నియంత్రణలో, సామాజిక మాధ్యమాలు బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించనున్నట్లు భారత, ఫ్రాన్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. క్రిస్ట్ చర్చి కాల్ లో నిర్దేశించిన సూత్రాలకు వారి మద్దతును గుర్తుచేశారు.

సమాచారాన్ని తారుమారు చేయడాన్ని నిరోధించడం

సమాచారాన్ని తారుమారు చేయకుండా, అసత్య వార్తలను ప్రసారం చేయకుండా అరికట్టదానికీ, ఆన్ లైన్ లో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాముఖ్యతను కాపాడడానికి, కట్టుబడి ఉన్నామని, భారత, ఫ్రాన్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. తారుమారు చేసిన సమాచారం, అసత్య వారాలు ప్రచారం చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పరచడం వల్ల కలిగే నష్టాల గురించి వారు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ముప్పు గురించి ముఖ్యంగా సామాజిక మాధ్యమం వేదికలను నియంత్రించడానికి ఒక నియమావళిని అభివృద్ధి చేయడంపై అంతర్జాతీయ చర్చ జరగాలని భారత, ఫ్రాన్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

వ్యక్తిగత సమాచారం రక్షణ

వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా, గౌరవంగా రక్షించేందుకు ఒక వినూత్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారత, ఫ్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ సాధారణ డేటా రక్షణ నియంత్రణ (జి డి పి ఆర్) ను అమలుచేసే సందర్భంలోనూ మరియు ఈ ప్రాంతాల్లో తగిన నియంత్రణ ఉండాలన్న భారతదేశ ఉద్దేశ్యానికి అనుగుణంగా, యూరోప్, భారదేశాల డేటా రక్షణ విధానాల కలయిక, సమాచారం మరియు డేటా ప్రసారాన్ని సులభతరం చేస్తుందని ఇరుపక్షాలు గుర్తించాయి.

డిజిటల్ విభజన తగ్గింపు

పౌరుల జీవితాల్లో టెక్నాలజీ పాత్ర, ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని, ముఖ్యంగా, ఈ విషయమై, వారి జాతీయ విధానాలు, మంచి అభ్యాసాల సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా – డిజిటల్ ఇంక్లూజన్ ప్రోత్సహించాలని, డిజిటల్ విభజనను తగ్గించాలని, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాలని, భారత, ప్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి.

భారత్ – ఫ్రాన్స్ డిజిటల్ భాగస్వామ్యం

ఫ్రాన్స్ కు చెందిన ఎకానమీ & ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ అదేవిధంగా భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తగిన విధానం ద్వారా భారత, ఫ్రాన్స్ డిజిటల్ భాగస్వామ్యం అమలును సమన్వయ పరుస్తాయి.

భౌతికంగా సమావేశాలు, వీడియో సమావేశాల ద్వారా తరచూ సంప్రదింపులు జరిపి, ” భారత, ఫ్రాన్స్ డిజిటల్ భాగస్వామ్యాన్ని” బలోపేతం చేయాలని రెండు పక్షాలు కోరుకుంటున్నాయి.

ఈ ప్రణాళిక కింద, భారత, ఫ్రాన్స్ దేశాలలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇతర కట్టుబాట్లతో తగిన రీతిలో సమన్వయంతో సంప్రదింపులు జరపడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.

1.1. ఆర్ధిక మార్పిడి

వ్యాపారం మరియు ఆవిష్కరణ

తమ తమ మార్కెట్లలో విస్తృత పరిధిలో పనిచేయడానికి డిజిటల్ రంగంలో వ్యాపార సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత, ఫ్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థల మధ్య బంధాలను కొత్త స్థాయికి చేర్చి, మార్కెట్ అవకాశాలను మరింతగా పెంపొందించుకునే దిశగా కూడా భారత, ఫ్రాన్స్ దేశాలకు చెందిన డిజిటల్ కంపెనీలు కలిసి పనిచేస్తాయి.

ద్వైపాక్షిక పెట్టుడబడులు పెట్టిన అనేక ఫ్రెంచ్ కంపెనీలు భారత డిజిటల్ అవుట్ రీచ్ లలో పాల్గొన్నాయి. అదేవిధంగా భారతీయ సంస్థలు ఫ్రాన్స్ లో తమ కార్యాలయాలను నెలకొల్పాయి. తద్వారా భారత, ఫ్రాన్స్ దేశాలు డిజిటల్ రంగంలో ఇప్పటికే బలమైన ఆర్ధిక సంబంధాలు కలిగి ఉన్నాయి.

రెండు దేశాలలోని వ్యవస్థాపకులు తమ ఆలోచనలను, ప్రాజెక్టులను పరస్పరం ఇచ్చి పుచ్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తూ – రెండు దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ అంకురం సంస్థల కలయిక యొక్క ప్రాముఖ్యతను భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. భారత్ లో ఫ్రెంచ్ డిజిటల్ కంపెనీలు, ఫ్రాన్స్ లో భారతీయ డిజిటల్ కంపెనీలు గణనీయమైన ఉపాధిని కలిగించాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు :

– ఫ్రెంచ్ టెక్ టికెట్స్ ఇనీషియేటివ్ ద్వారా 13 భారతీయ అంకుర సంస్థలు ఫ్రాన్స్ లోని ఇంక్యూబేషన్-యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని అనుసరించాయి.

– మన రెండు సాంకేతిక పర్యావరణ వ్యవస్థల మధ్య భారీ సంబంధాల కోసం ఇటీవల ఫ్రెంచ్ టెక్ బెంగుళూరు ఇండియా కమ్యూనిటీ ప్రారంభమైంది.

– భారతీయ ఉద్యగులు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఫ్రెంచ్ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ప్రవేశించడానికీ, భారత, ఫ్రాన్స్ దేశాల మధ్య నూతన సంబంధాలు సృష్టించడానికీ, అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక సరికొత్త ఫ్రెంచ్ టెక్ వీసా విధానం ప్రారంభమైంది.

– భారత, ఫ్రాన్స్ దేశాలలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ మధ్య సహకార సంబంధాల కోసం, ఫ్రెంచ్ టెక్ కమ్యూనిటీ బెంగుళూరు ఇండియా మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (ఎమ్ ఈ ఐ టి వై) స్టార్ట్ అప్ హబ్ పనిచేస్తోంది.

1.2. పరిశోధన, శిక్షణ మరియు విద్య

సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్

డిజిటల్ రంగంలో ఉన్నతమైన కంప్యూటింగ్ పనితీరు వారి ద్వైపాక్షిక సహకారంలో ఒక కీలకమైన భాగంగా భారత, ఫ్రాన్స్ దేశాలు గుర్తించాయి. హై పెరఫార్మన్స్ క్యాలిక్యులేషన్ టూల్స్ సంయుక్త అభివృద్ధికి దోహదపడిన జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ పరిధిలో వారి సహకారంలో పురోగతిని వారు అభినందిస్తున్నారు.

మహానదీ రివర్ బేసిన్ లో నీటి ప్రవాహం కోసం హై పెరఫార్మన్స్ కంప్యూటింగ్ ఉపయోగించిన భారత, ఫ్రెంచ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రయోగాన్ని ఇరు పక్షాలు ప్రశంసించాయి.

మూడు ప్రధాన ప్రాంతాల్లో – భారత, ఫ్రాన్స్ దేశాలు తమ సహకారాన్ని మరింతగా విస్తరించి పటిష్ఠపరచుకోవాలన్న తమ అభిలాషను పునరుద్ఘాటించాయి.

– కృత్రిమ మేధస్సు కు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ను ఉపయోగించాలి.

– క్వాంటమ్ క్యాలిక్యులేషన్, ఈ విషయంలో పూనా లో ఒక భారత-ఫ్రెంచ్ సెంటర్ అఫ్ ఎక్సెలెన్స్ ఇన్ క్వాంటమ్ క్యాలిక్యులేషన్ ను నెలకొల్పడాన్ని వారు అభినందించారు.

– ఎక్సా స్కేల్ లెక్కింపు.

కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ లతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో భాగం పంచుకోడానికి కార్యక్రమాలు, పద్ధతులు రూపొందించుకోడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి.

కృత్రిమ మేధస్సు ప్రేరణ

కంప్యూటర్ సైన్స్, గణితం కోర్సులలో వారి కున్న విశేష పరిజ్ఞానం యొక్క అవకాశాన్ని వారి పాఠశాలల్లో వినియోగించుకోవాలనీ, కేవలం కృత్రిమ మేధస్సు కే పరిమితమయ్యే భారత, ఫ్రెంచ్ పరిశోధన, ఆవిష్కరణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలనీ, భారత, ఫ్రాన్స్ దేశాలు కోరుకుంటున్నాయి.

విద్యా సంస్థలు, మంత్రిత్వ శాఖలు, సూచన సంస్థలను సమన్వ పరుస్తూ ఒక ( కన్సార్షియం) సహాయతా సంఘాన్ని నెలకొల్పాలి. ఆ సంస్థ భారత, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆరోగ్యం, వాతావరణం, రవాణా, వ్యవసాయం, విపత్తు ప్రతి స్పందన, స్మార్ట్ నగరాలు మొదలైన ప్రాజెక్టులలోని కృత్రిమ మేధస్సు సామర్ధ్యాలను వెలికి తీస్తుంది.

ఈ కన్సార్షియం ఏర్పాటు తో పాటు, ఏటా 2 మిలియన్ యూరో లతో ఒక నిధిని ఏర్పాటు చేయడానికి రెండు పక్షాలు పనిచేస్తాయి. ఈ నిధిని ప్రాధమిక మరియు అనువర్తిత పరిశోధన ప్రాజెక్టులు, శిక్షణ, పరిశోధన ఉపకార వేతనాలు, నిపుణులు, పరిశోధన ప్రోజెక్టుల మార్పిడి, అవగాహనా చర్యల కోసం వినియోగిస్తారు.

నాలెడ్జ్ సమ్మేళనంతో పాటు ప్రతి ఏడాదీ ఈ కన్సార్షియం కూడా సమావేశమౌతుంది. ఈ కన్సార్షియం మొదటి సమావేశం 2019 అక్టోబర్ లో లియోన్ లో జరుగుతుంది.

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s

Media Coverage

EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 అక్టోబర్ 2021
October 21, 2021
షేర్ చేయండి
 
Comments

#VaccineCentury: India celebrates the achievement of completing 100 crore COVID-19 vaccine doses.

India is on the path of development under the leadership of Modi Govt.