ఇండియా భూటాన్ సాటలైట్ అనేది భూటాన్ ప్రజల తో మన కు గల విశిష్టమైనటువంటి సంబంధానికి ఒక ప్రమాణం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సంయుక్తం గా అభివృద్ధిపరచిన ఈ మానవ నిర్మిత ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించినందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ ఎండ్ టెలికమ్ (డిఐటిటి), భూటాన్ ను మరియు ఇస్ రో ను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఇండియా- భూటాన్ సేట్ ను ఫలప్రదం గా ప్రయోగించిన సందర్భం లో రాజు యొక్క సందేశాన్ని తెలియజేస్తూ భూటాన్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జవాబిస్తూ,
‘‘ఇండియా భూటాన్ సేటలైట్ నిజానికి భూటాన్ ప్రజల తో మా విశేష సంబంధాల కు ప్రమాణం గా ఉంది. సంయుక్తం గా అభివృద్ధిపరచిన ఈ మాపవ నిర్మిత ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించినందుకు @dittbhutan ను మరియు @isro ను నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
India Bhutan Satellite is a testament to our special relationship with the people of Bhutan. I commend @dittbhutan and @isro on the successful launch of this jointly developed satellite. @PMBhutan https://t.co/bWbFgRVLkp
— Narendra Modi (@narendramodi) November 26, 2022


