జహాఁ ఝుగ్గీ వహాఁ మకాన్’ (ఎక్కడ గుడిసె ఉందో అక్కడే ఇల్లు) పథకం లో భాగం గా దిల్లీ లో కాల్ కాజీ ప్రాంతం లో లబ్ధిదారుల కు పక్కా ఇళ్ల ను కేటాయించడం జరగగా, ఆ లబ్ధిదారులు ప్రధాన మంత్రి కి వ్రాసిన లేఖల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉబ్బితబ్బిబ్బు అయ్యి విషయాన్ని ఈ రోజు న ఒక ట్వీట్ లో వెల్లడించారు.
లబ్ధిదారు మహిళ లు తమ తో భేటీ అయిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్ కు తమ ఉత్తరాల ను అందజేశారు. లబ్ధిదారులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ కల ను పండించుకోవడం లో సాయం చేసి మరి గృహ నిర్మాణ పథకం ద్వారా వారి జీవనాన్ని సరళతరం చేసినందుకు ప్రధాన మంత్రి కి వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
పేద ప్రజానీకం సంక్షేమం కోసం పాటుపడడం కోసం ప్రభుత్వం యొక్క వచనబద్ధత ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘జహాఁ ఝుగ్గీ వహీఁ మకాన్’ పథకం లో భఆగం గా పక్కా ఇళ్లు లభించినటువంటి దిల్లీ కి చెందిన కల్ కాజీ ప్రాంత మాతృమూర్తుల మరియు సోదరీమణుల లేఖల ను అందుకొని ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @DrSJaishankar గారు అక్కడ కు వెళ్లినప్పుడు ఆ మహిళ లు ఈ ఉత్తరాల ను ఆయన కు అందించారు. వాటి లో వారు వారి యొక్క ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా వారి యొక్క ఎన్నో సంవత్సరాల నాటి కల ఎలా నెరవేరిందీ మరి కుటుంబ సభ్యులు అందరి జీవనం సరళతరం గా ఎలాగ మారిపోయిందీ వారు వెల్లడించారు. మీరు వ్రాసిన ఉత్తరాల కు గాను మీకు అందరి కి చాలా చాలా కృతజ్ఞత లు. మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇదే విధం గా కట్టుబడి ఉండి పాటుపడుతూ ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.
दिल्ली के कालकाजी की उन माताओं और बहनों के पत्रों को पाकर अभिभूत हूं, जिन्हें ‘जहां झुग्गी वहीं मकान’ स्कीम के तहत पक्के घर मिले हैं। विदेश मंत्री @DrSJaishankar जी जब वहां गए तो महिलाओं ने ये पत्र उन्हें सौंपे, जिनमें उन्होंने अपनी खुशी जाहिर की है। वे बताती हैं कि कैसे इस स्कीम… pic.twitter.com/M1nOtV3Phj
— Narendra Modi (@narendramodi) August 4, 2023


