ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అబ్దుల్లా శాహిద్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు. ఇండియా-మాల్దీవ్స్ జాయింట్ కమిశన్ (జెసిఎమ్) ఆరో సమావేశం లో పాల్గొనడం కోసం శ్రీ అబ్దుల్లా శాహిద్ భారతదేశాన్ని ఆధికారికం గా సందర్శిస్తున్నారు.

అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ నాయకత్వం లోని ప్రభుత్వం ఒకటో సంవత్సరం లో సాధించిన విజయాల కు గాను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శాహిద్ కు ప్రధాన మంత్రి తన అభినందనలు తెలిపారు. మాల్దీవ్స్ కు మరియు భారతదేశాని కి మధ్య బంధం మరింత గా వృద్ధి చెందడం మరియు గడచిన సంవత్సర కాలం లో ద్వైపాక్షిక సహకారం తాలూకు సకారాత్మక ఫలితాల ను ఆయన సంతృప్తి తో గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆరో జెసిఎమ్ సమావేశాల లో చోటు చేసుకొనే చర్చలు ఇరు పక్షాలు రెండు దేశాల మధ్య పురోగతి ని సమీక్షించడం తో పాటు పరస్పర ప్రయోజకారకమైన సహకారాన్ని మరింత బలపరచుకొనే దిశ గా ఒక మహత్వాకాంక్ష తో కూడిన మార్గసూచీ ని సిద్ధం చేయగలవన్న తన విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒక బలమైనటువంటి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి, సమృద్ధమైనటువంటి మరియు ప్రశాంతమైనటువంటి మాల్దీవ్స్ ఆవిష్కారాని కి గాను మాల్దీవ్స్ ప్రభుత్వం తో భాగస్తురాలు కావడం కోసం భారతదేశం కట్టుబడివుందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.

భారతదేశం-మాల్దీవ్స్ సంబంధాన్ని ముందుకు తీసుకుపోవడం లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రదర్శిస్తున్న దృఢ నాయకత్వాని కి మరియు దార్శనికత కు గాను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శాహిద్ శ్రీ మోదీ కి ధన్యవాదాలు పలికారు. ప్రస్తుతం మాల్దీవ్స్ లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి సంబంధిత సహకారాత్మక కార్యక్రమాల లో భారతదేశం అందిస్తున్నటువంటి తోడ్పాటు పట్ల ఆయన గాఢమైన ప్రశంస ను వ్యక్తం చేశారు. మాల్దీవ్స్ అనుసరిస్తున్న ‘ఇండియా ఫస్ట్’ విధానం పట్ల తమ నిబద్ధత ను, అలాగే, భారతదేశం తో సంబంధాన్ని మరింత గా బలోపేతం చేసుకోవాలని ఉందన్న అభిలాష ను ఆయన ఈ సందర్భం గా వ్యక్తం చేశారు.