ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు సమావేశమయ్యారు.
విదేశాంగ మంత్రి ఆనంద్‌కు ప్రధాని స్వాగతం పలుకుతూ.. భారత్-కెనడా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగాన్ని పెంచే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఆమె పర్యటన తోడ్పడుతుందన్నారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం కెనడాలో చేపట్టిన పర్యటనను, ఆ సమయంలో ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన ఉత్పాదక సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజా సంబంధాల మధ్య సహకారం విస్తరించాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి వివరించారు.
ప్రధాని మార్క్ కార్నీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.
Welcomed Canada’s Foreign Minister, Ms. Anita Anand. Discussed ways to strengthen cooperation in trade, technology, energy, agriculture and people-to-people exchanges for mutual growth and prosperity.@AnitaAnandMP pic.twitter.com/GCQfbJvBh4
— Narendra Modi (@narendramodi) October 13, 2025


