ఆమె పర్యటన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని అందిస్తుందన్న ప్రధాని
జీ7 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం కెనడాలో తన పర్యటనను, పీఎం కార్నీతో చేపట్టిన సమావేశాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని
రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజా సంబంధాల్లో సహకార విస్తరణ ప్రాధాన్యాన్ని వివరించిన పీఎం
పీఎం కార్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపిన ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు సమావేశమయ్యారు.

విదేశాంగ మంత్రి ఆనంద్‌కు ప్రధాని స్వాగతం పలుకుతూ.. భారత్-కెనడా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగాన్ని పెంచే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఆమె పర్యటన తోడ్పడుతుందన్నారు.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం కెనడాలో చేపట్టిన పర్యటనను, ఆ సమయంలో ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన ఉత్పాదక సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజా సంబంధాల మధ్య సహకారం విస్తరించాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి వివరించారు.

ప్రధాని మార్క్ కార్నీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi's record run: Assessing 12 years of governance and change

Media Coverage

PM Modi's record run: Assessing 12 years of governance and change
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance