మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు సాన పట్టడం, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగేలా మౌలిక సదుపాయాల కల్పన , ఆరోగ్య సంరక్షణ , విద్య తదితర రంగాలకు ఊతాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న కృషిని ఆమె స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతున్నదీ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు పదును పెట్టడం, రాబోయే కాలం అవసరాల్ని తీర్చగలిగే దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, తదితర రంగాలకు ఊతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.
In her speech in the Lok Sabha, Finance Minister Smt. Nirmala Sitharaman Ji gave a comprehensive picture of how this year’s Budget will contribute to our nation’s economic transformation. She emphasised on Reform Express, the support to MSMEs, skilling, push to next-gen…
— Narendra Modi (@narendramodi) February 12, 2026


