జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటామని చెబుతూ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
కేంద్ర శాస్త్ర,సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ప్రతిజ్ఞను చేయించారు.
ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ పి.కె మిశ్రా , ప్రధానమంత్రి రెండో ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతిష్ చంద్ర, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని.. ఐక్యతా, శక్తిమంతమైన భారత్ అనే ఆయన దార్శనికతను స్మరించుకుంటూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా తెలిపింది.
‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో “కేంద్ర మంత్రి @DrJitendraSingh ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి రెండో ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి అతిష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు’’
Union MoS @DrJitendraSingh administered the Ekta Pledge in the Prime Minister's Office.
— PMO India (@PMOIndia) October 31, 2025
Principal Secretary to PM, Dr. P.K. Mishra, Principal Secretary-2 to PM, Shri Shaktikanta Das, Advisor to PM, Shri Tarun Kapoor, Special Secretary to PM, Shri Atish Chandra and other… pic.twitter.com/yp8oBurtfb


