ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రోల్స్ రాయస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘భారత్‌లో రోల్స్ రాయస్ తన కార్యకలాపాల్ని పెంచుకోవడాన్నీ, ఉత్సాహంతో, ఆవిష్కరణలతో నిండిన భారత యవతతో కలిసి పనిచేయడాన్నీ స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ ఉత్సాహ భరిత వాతావరణంలో ఈ రోజు ఉదయం రోల్స్ రాయస్ సీఈఓ శ్రీ టుఫాన్ ఎర్గిన్‌బిల్‌గిక్‌తో భేటీ జరిగింది.
రోల్స్ రాయస్ భారత్‌లో తన కార్యకలాపాల్ని పెంచుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణల పట్ల మక్కువ కనబరుస్తున్న మా యువతతో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
It was wonderful meeting Mr. Tufan Erginbilgic, CEO of Rolls-Royce earlier today.
— Narendra Modi (@narendramodi) February 11, 2026
We welcome Rolls-Royce’s enthusiasm towards scaling up its activities in India and partnering with our innovative and dynamic youth. https://t.co/ZWj3EcQR7c


