ఎల్ డబ్ల్యుఈ ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్, డేటా సేవలపై దృష్టి..
దేశీయ తయారీ కి ప్రోత్సాహం: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాకారం
అంచనా వేసిన ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 2426.39 కోట్లు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం వామ పక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్.డబ్ల్యూ.ఈ) ప్రాంతాలలోని భద్రతా శిబిరాల వద్ద వద్ద 2జి మొబైల్ సేవలను 4జి కి అప్ గ్రేడ్ చేయడం కోసం యూనివర్స ల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ 2,343 వామ పక్ష తీవ్రవాద (ఎల్.డబ్ల్యూ.ఈ) ఫేజ్-1 సైట్లను 2జి నుండి 4జి మొబైల్ సేవలకు 1,884.59 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్ గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐదేళ్ల పాటు ఓ అండ్ ఎం కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ తన సొంత ఖర్చుతో మరో ఐదు సంవత్సరాల పాటు ఈ సైట్లను నిర్వహిస్తుంది. ఈ సైట్లు బిఎస్ఎన్ఎల్ కు  చెందినవి కాబట్టి ఈ పనిని బిఎస్ఎన్ఎల్ కే అప్పగిస్తారు.

541.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధికి మించి పొడిగించబడిన కాలానికి బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎల్ డబ్ల్యుఇ ఫేజ్-1 2జి సైట్ల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చుకు నిధులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 12 నెలల వరకు పొడిగింపు కేబినెట్ ఆమోదం పొందిన తేదీ నుంచి లేదా 4జీ సైట్లను ప్రారంభించే తేదీ నుంచి ఏది ముందు అయితే అప్పటి నుంచి ఉంటుంది.

ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయడంతో పాటు దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడానికి టెలికాం గేర్ విభాగంలో స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కు దేశీయ 4జి టెలికాం పరికరాల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో కూడా ఈ 4జి ఎక్విప్ మెంట్ ఉపయోగించబడుతుంది.

అప్ గ్రేడేషన్, ఈ  ఎల్.ఎస్.డబ్ల్యు ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్, డేటా సేవలను అందిస్తుంది. ఇది హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలను తీరుస్తుంది.  ఈ ప్రాంతాల్లో మోహరించిన భద్రతా సిబ్బంది కమ్యూనికేషన్ అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. అదనంగా, వివిధ ఈ- గవర్నెన్స్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలి-మెడిసిన్ డెలివరీ; మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైనవి ఈ ప్రాంతాల్లో సాధ్యమవుతాయి.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Gains in manufacturing and services sectors push flash PMI to 60.9 in June

Media Coverage

Gains in manufacturing and services sectors push flash PMI to 60.9 in June
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Gujarat CM meets PM
June 22, 2024

Chief Minister of Gujarat, Shri Bhupendra Patel, met Prime Minister Narendra Modi today.

The Prime Minister's Office (PMO) posted on X:

"Chief Minister of Gujarat, Shri Bhupendra Patel, met Prime Minister Narendra Modi."