మార్కెటింగ్ సీజన్ 2026-27కు గాను అన్ని అనివార్య రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లో పెరుగుదలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
రైతులకు వారి పంటలకు గిట్టుబాటు ధరలు దక్కేటట్లు చూసే ఉద్దేశంతో, 2026-27 మార్కెటింగ్ సీజనులో రబీ పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం పెంచేసింది. ఎంఎస్‌పీలో అన్నింటి కన్నా ఎక్కువ గా ధర పెరుగుదల కుసుమల విషయంలో వర్తించింది. ఒక్కో క్వింటాలుకు రూ.600 చొప్పున ఈ వృద్ధి ఉంది. మసూర్ పప్పు లేదా ఎర్ర కందిపప్పు ధరలో ప్రతి క్వింటాలుకు రూ.300 పెరుగుదల ఉంది. ఎంఎస్‌పీలో వృద్ధి (ఒక్కొక్క క్వింటాలు వారీగా) ఆవజాతి విత్తనాలకూ (రేప్‌సీడ్), ఆవాలకూ రూ.250, శనగపప్పునకు రూ.225, బార్లీ కి రూ.170, గోధుమల విషయంలో రూ.160 వంతున ఉంది.
మార్కెటింగ్ సీజన్ 2026-27 కు గాను అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలు.
(క్వింటాలు ఒక్కింటికి రూపాయల్లో)
|
Crops |
MSP RMS 2026-27 |
Cost*of Production RMS 2026-27 |
Margin over cost (in percent) |
MSP RMS 2025-26 |
Increase in MSP (Absolute) |
|
Wheat |
2585 |
1239 |
109 |
2425 |
160 |
|
Barley |
2150 |
1361 |
58 |
1980 |
170 |
|
Gram |
5875 |
3699 |
59 |
5650 |
225 |
|
Lentil (Masur) |
7000 |
3705 |
89 |
6700 |
300 |
|
Rapeseed & Mustard |
6200 |
3210 |
93 |
5950 |
250 |
|
Safflower |
6540 |
4360 |
50 |
5940 |
* ఈ గుర్తు ఖర్చును సూచిస్తుంది. దీనిలో అన్ని చెల్లింపులకూ చేసిన ఖర్చు కలిసి ఉంది. ఉదాహరణకు, పనివారి కిరాయి ఖర్చు, ఎద్దులకూ, యంత్రాలకూ పెట్టే ఖర్చు, కౌలుకు తీసుకున్న భూమికి చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు వంటివి ఉపయోగించడానికి చేసిన ఖర్చు, సాగునీటి చార్జీలూ, పరికరాల వినియోగంలో తరుగుదల పద్దుగా పేర్కొనే ఖర్చు, పంప్ సెట్లను పనిచేయించడానికి డీజిల్‌కు పెట్టిన ఖర్చు, విద్యుత్తు చార్జీలు ఇతరత్రా దీనిలో లెక్కకు వస్తాయి.
అఖిల భారతీయ సగటు ఉత్పాదన వ్యయంలో కనీసం ఒకటిన్నర రెట్ల స్థాయిలో ఎంఎస్‌పీని ఖరారు చేస్తారంటూ 2018-19 కేంద్ర బడ్జెటులో చేసిన ప్రకటనకు అనుగుణంగా మార్కెటింగ్ సీజను 2026-27కు గాను అనివార్య రబీ పంటల ఎంఎస్‌పీలో పెరుగుదల వర్తిస్తుంది. అఖిల భారతీయ సగటు ఉత్పాదన వ్యయంలో అంచనా మార్జిన్ గోధుమ విషయంలో 109 శాతం, రేప్‌సీడ్‌తో పాటు ఆవాల విషయంలో 93 శాతం, మసూర్ విషయంలో 89 శాతం, శనగపప్పు విషయానికి వస్తే 59 శాతం, బార్లీకి 58 శాతం, కుసుమలకు 50 శాతంగాను ఉంది. రబీ పంటలకు ఎంఎస్‌పీలో ఈ పెరుగుదల రైతులకు గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు పంటల వివిధీకరణను ప్రోత్సహిస్తుంది.


