ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ‘వ్యక్తికీ వర్తకుడికీ మధ్య (పీ2ఎం) తక్కువ విలువ గల భీమ్ - యూపీఐ లావాదేవీల ప్రోత్సాహక’ పథకాన్ని కింద పేర్కొన్న విధంగా ఈరోజు ఆమోదించింది:

i) 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో తక్కువ విలువ కలిగిన భీమ్-యూపీఐ లావాదేవీల (పీ2ఎం) ప్రోత్సాహక పథకం.

ii. చిన్న వర్తకుల కోసం రూ. 2,000 వరకు ఉన్న యూపీఐ (పీ2ఎం) లావాదేవీలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

 

విభాగం

చిన్న వర్తకులు

పెద్ద వర్తకులు

రూ. 2 వేల వరకు

ఎండీఆర్ లేదు / ప్రోత్సాహకం (@0.15%)

ఎండీఆర్ లేదు / ప్రోత్సాహకం లేదు

రూ. 2 వేలకు మించి

ఎండీఆర్ లేదు / ప్రోత్సాహకం లేదు

ఎండీఆర్ లేదు / ప్రోత్సాహకం లేదు

 

           iii. చిన్న వర్తకుల విభాగంలో రూ.2,000 లోపు లావాదేవీలకు ఒక్కో లావాదేవీ విలువకు 0.15 శాతం చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు.

          iv. ఈ పథకం కింద అన్ని త్రైమాసికాల్లో ఆర్జిత బ్యాంకులు చెల్లించడానికి అంగీకరించిన మొత్తంలో 80 శాతాన్ని ఎలాంటి షరతులూ లేకుండా పంపిణీ చేస్తారు.

            v. ప్రతీ త్రైమాసికానికీ సంబంధించి తిరిగి చెల్లించడానికి అంగీకరించిన మిగతా 20 శాతం కింది షరతులను ఏ మేరకు నెరవేరుస్తుందన్న అంశంపై ఆధారపడి ఉంటాయి:

a) చెల్లించడానికి అంగీకరించిన మొత్తంలో 10 శాతాన్ని ఆర్జిత బ్యాంకు సాంకేతిక లోపం 0.75% కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అందిస్తారు;

b) యూపీఐ లావాదేవీలో ఆర్జిత బ్యాంకు నిర్వహణ సమయం 99.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా 10 శాతాన్ని అందిస్తారు.

 

ప్రయోజనాలు:

i. సౌకర్యవంతమైన, సురక్షితమైన, వేగవంతమైన నగదు బదిలీతోపాటు డిజిటల్ మార్గాల్లో మెరుగైన రుణ లభ్యత.

ii. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా నిరంతర చెల్లింపు సౌకర్యాలతో సామాన్య ప్రజలు ప్రయోజనం పొందుతారు.

iii. చిన్న వ్యాపారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూపీఐ సేవలను పొందడానికి వీలు కల్పిస్తుంది. చిన్నపాటి ఆదాయం కూడా వారిని విశేషంగా ప్రభావితులను చేస్తుంది కాబట్టి.. ఈ ప్రోత్సాహకాలు యూపీఐ చెల్లింపులను అంగీకరించేలా చిరు వ్యాపారులను ప్రేరేపిస్తాయి.

iv. ఇది లావాదేవీని డిజిటల్ రూపంలో క్రమబద్ధీకరించి, గణిస్తుంది. తద్వారా ‘ఆర్థిక వ్యవస్థలో నగదు రూపేణా తక్కువ ద్రవ్యం’ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.

v. సామర్థ్యంలో పెరుగుదల - బ్యాంకులకు సంబంధించి ఎక్కువ నిర్వహణ సమయం, తక్కువ సాంకేతిక లోపాలపై 20% ప్రోత్సాహకాలు ఆధారపడి ఉంటాయి. ఇది పౌరులకు చెల్లింపు సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చేస్తుంది.

vi. యూపీఐ లావాదేవీల పెరుగుదల, ప్రభుత్వ ఖజానాపై తక్కువ ఆర్థిక భారం... రెండింటి మధ్య విచక్షణాయుత సమతౌల్యం.

లక్ష్యం:

·        దేశీయ భీమ్-యూపీఐ వేదికను ప్రోత్సహించడం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీల పరిమాణం రూ. 20,000 కోట్ల లక్ష్యాన్ని సాధించడం.

·        బలమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా చెల్లింపు వ్యవస్థలోని భాగస్వాములకు సహకారాన్ని అందిస్తుంది.

·        ఫీచర్ ఫోన్ ఆధారిత (యూపీఐ 123 పే), ఆఫ్ లైన్ (యూపీఐ లైట్/ యూపీఐ లైట్ ఎక్స్) చెల్లింపు విధానాల వంటి వినూత్న మార్గాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా.. మూడో అంచె, ఆరో అంచెల్లోని నగరాల్లో, ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ వినియోగాన్ని అందుబాటులోకి తేవడం.

·      నిర్వహణ సమయాన్ని పెంచడంతోపాటు సాంకేతిక లోపాలను తగ్గించడం.


 


 

నేపథ్యం:

‘డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం’ అన్నది ఆర్థిక సమ్మిళితత్వం, సామాన్యులకు విస్తృతమైన చెల్లింపు అవకాశాలను కల్పించాలన్న వ్యూహంలో అంతర్భాగం. డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ తన వినియోగదారులు/వర్తకుడికి సేవలను అందించే సమయంలో అయ్యే వ్యయాన్ని మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలు చేస్తారు.

ఆర్బీఐ ప్రకారం.. అన్ని కార్డులకూ (డెబిట్ కార్డులకు) లావాదేవీ విలువలో 0.90% వరకు ఎండీఆర్ వర్తిస్తుంది. ఎన్పీసీఐ ప్రకారం.. యూపీఐ పీ2ఎం లావాదేవీకి దాని విలువలో 0.30% వరకు ఎండీఆర్ వర్తిస్తుంది. 2020 జనవరి నుంచి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం రూపే డెబిట్ కార్డులు, భీమ్-యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ను పూర్తిగా తొలగించారు. ఇందుకోసం చెల్లింపులు, సెటిల్మెంట్ల వ్యవస్థ చట్టం-2007లోని సెక్షన్ 10ఎ, ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 269ఎస్ యూలను సవరించారు.

మరింత సమర్థవంతంగా సేవలందించే దిశగా చెల్లింపుల వ్యవస్థలో భాగస్వాములందరికీ చేయూతనిచ్చేలా.. క్యాబినెట్ ఆమోదంతో ‘‘రూపే డెబిట్ కార్డులుతక్కువ విలువ గల భీమ్ – యూపీఐ లావాదేవీలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రోత్సాహక పథకం (పీ2ఎం)’’ అమలు చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లించిన మొత్తం (రూ. కోట్లలో): 

ఆర్థిక సంవత్సరం

భారత ప్రభుత్వ చెల్లింపులు

రూపే డెబిట్ కార్డు

భీమ్-యూపీఐ

2021-22

1,389

432

957

2022-23

2,210

408

1,802

2023-24

3,631

363

3,268

 

ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ఆర్జిత బ్యాంకు (వ్యాపారి బ్యాంకు)కు చెల్లిస్తుంది. అనంతరం ఇతర భాగస్వాములకు.. అంటే, చెల్లించే బ్యాంకు (వినియోగదారుడి బ్యాంకు), చెల్లింపు సేవలను అందించే బ్యాంకు (యూపీఐ యాప్/ ఏపీఐ ఇంటిగ్రేషన్లలో వినియోగదారును సమీకృతం చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది), యాప్ ప్రొవైడర్ల (టీపీఏపీలు)కు పంచుతారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi