రేపటి రోజున, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు నిర్వహించే పరీక్షాపేచర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ సంవత్సరపు సంచికలో పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఉంటాయనీ, ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండడానికీ, నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికీ ప్రాధాన్యంగా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వేదిక తనకు సదా ఆనందాన్నిస్తుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో మాట్లాడే అవకాశం కలగడమే దీనికి కారణమని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రేపు, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు పరీక్షా పే చర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమాన్ని చూడండి. పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఈ సంవత్సరం పరీక్షా పే చర్చాలో భాగంగా ఉంటాయి.. ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండాల్సిన అవసరంతో పాటు నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం, తదితర అంశాలు దీన్లో ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని నేను ఎప్పటికీ ఆనందిస్తుంటాను.. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులతో భేటీ అయ్యి, వారితో మాట్లాడే అవకాశం నాకు ఈ కార్యక్రమం ద్వారా లభించడమే దీనికి కారణం’’ అని పేర్కొన్నారు.
Do watch #ParikshaPeCharcha26 tomorrow, 6th February at 10 AM. This year’s PPC features very interesting topics relating to examinations, notably the need to remain stress free, focus on learning and more. This is a platform I’ve always enjoyed, as it gives me an opportunity to…
— Narendra Modi (@narendramodi) February 5, 2026


