ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బీహార్‌లోని బక్సార్ - భాగల్‌పూర్ హైస్పీడ్ కారిడార్‌ పరిధిలోని మోకామా - ముంగేర్ 4 వరుసల హరిత కొత్త ప్రావేశిక నియంత్రిత రహదారి నిర్మాణానికి ఈ రోజు ఆమోదం తెలిపింది. మొత్తం 82.4 కి.మీ పొడవున్న ఈ రహదారి ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం రూ. 4447.38 కోట్లు. హైబ్రిడ్ వార్షిక చెల్లింపు విధానం (హామ్)లో దీన్ని నిర్మించనున్నారు.

 

అనుబంధం-Iలోని చిత్రపటంలో సూచించిన విధంగా.. మోకామా, బరాహియా, లఖిసరాయ్, జమల్పూర్, ముంగేర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలను ఈ కొత్త రహదారి భాగల్పూర్‌తో అనుసంధానిస్తుంది.

 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ప్రస్తుత గన్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్‌లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన మరో ఫ్యాక్టరీ), లోకోమోటివ్ కర్మాగారం (జమల్‌పూర్‌లో), ఆహార శుద్ధి (ఉదా: ముంగేర్‌లోని ఐటీసీ), సంబంధిత రవాణా, గిడ్డంగుల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ... తూర్పు బీహార్‌లోని ముంగేర్- జమాల్పూర్- భాగల్పూర్ ప్రాంతం కీలక పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతోంది. భాగల్‌పురి సిల్క్ ప్రధాన ఆకర్షణగా.. జౌళి, రవాణా ప్రధాన కేంద్రంగా భాగల్‌పూర్ నిలుస్తోంది. (భాగల్‌పూర్‌లోని ప్రతిపాదిత జౌళి అనుకూల వ్యవస్థ వివరాలు). అలాగే ఆహార ప్యాకేజింగ్, శుద్ధి, వ్యవసాయ గిడ్డంగుల నిలయంగా బరాహియా ఎదుగుతోంది. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల భవిష్యత్తులో సరుకు రవాణాతోపాటు మోకామా-ముంగేర్ ప్రాంతంలో రాకపోకలను పెంచుతాయని భావిస్తున్నారు.

 

క్లోజ్ టోలింగ్ - విధానంలో గంటకు గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగానికి తగినట్టుగా నిర్మించి- సగటున గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలున్న ఈ కారిడార్ మొత్తం ప్రయాణ సమయాన్ని దాదాపు 1.5 గంటలకు తగ్గిస్తుంది. ప్రయాణికులకు, సరుకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన, అంతరాయాల్లేని అనుసంధానాన్నీ అందిస్తుంది.

 

82.40 కి.మీ ఉన్న ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా దాదాపు 14.83 లక్షల ప్రత్యక్ష పని దినాలు లభిస్తాయి. పరోక్షంగా 18.46 లక్షల పని దినాల పరోక్ష ఉపాధి లభిస్తుంది. ప్రతిపాదిత కారిడార్ పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జూన్ 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth